చైనా కుర్రోడి నోట…రామ్ చరణ్ మాట… అక్కడ చెర్రీ ఎంత పాపులరో చూడండి | Chinese Person Asked About Ram Charan

షేర్ చేయండి

ప్రస్తుతం చైనాలో ఉన్న ఒక హిందీ వ్లాగర్ చైనాలో ఒక యువకుడికి హిందీ పాట వినిపించాడు. అది వినకుండా ఆ చైనా వ్యక్తి నోట చరణ్ మాట (Chinese Person Asked About Ram Charan ) వినిపించడంతో హిందీ వ్లాగర్ షాకయ్యాడు. ఎందుకంటే రామ్ చరణ్ అంత పాపులర్ అని అతనికి తెలియదు.

తెలుగులో చాలా మంది స్టార్ హీరోలకు అంతర్జాతీయంగా మంచి పాపులారిటీ ఉంది. రజినీకాంత్‌‌కు ఎలాగైతే జపాన్‌లో ( Rajinikanth Fans In Japan ) క్రేజ్ ఉందో రాజమౌళికి కూడా అంతే క్రేజ్ ఉంది. ట్రిపుల్ ఆర్ మూవీతో దర్శకుడు రాజమౌళితో పాటు ఈ మూవీలో నటించిన రామచరణ్‌, జూ. ఎన్టీఆర్‌కు కూడా జపాన్, చైనా లాంటి అనేక దేశాల్లో అభిమానులు పెరిగారు.

Chinese Person Asked About Ram Charan
జపాన్‌లో అభిమానులతో జక్కన్న, చరణ, తారక్ | Phot Source: x/kaketaku_japan

నాటు నాటు అక్కడ కూడా హిట్టు హిట్టు

ఎంతగా అంటే ఒక హిందీ వ్లాగర్ చైనాలోని ( Indian Vlogger In China ) ఒక సాధారణ ట్రైనులో ప్రయాణిస్తూ ఒక వ్లాగ్ చేశాడు. అందులో ఏవో ప్రశ్నలు అడుగుతూంటే చైనాకు చెందిన ఒక యువకుడి నోట రామ్ చరణ్ మాట వినిపించింది.

ఆన్ రోడ్ ఇండియన్ ( On Road Indian ) అనే పేరుతో ట్రావెల్ వీడియోలు ( Travel Videos ) చేసే ఒక వ్లాగర్ ఈ మధ్య చైనాలో వీడియోలు చేస్తున్నాడు. బుల్లెట్ ట్రైన్లు అంటే చైనా, చైనా అంటే బుల్లెట్ ట్రైన్ అని అనుకుంటున్న వారి కోసం అక్కడి జనరల్, డొమెస్టిక్ ట్రైన్స్ ఎలా ఉంటాయో చూపించేందుకు అందులో ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో తనున ఏం విషయాలు గమనించాడో షేర్ చేశాడు.

ఇక వ్లాగ్ కోసం వీడియో రికార్డు చేస్తున్న సమయంలో కొంత మంది చైనా యువకులు అతని దగ్గరికి వచ్చి పలకరించారు. వారికి హిందీ రాదు, ఇతనికి చైనా రాదు కాబట్టి గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడారు. ఒకరికి ఒకరు గూగుల్ ట్రాన్స్‌లేట్ మాధ్యమంతో ప్రశ్నలు అడగడం, సమాధానం చెప్పడం చేశారు.

చైనావాడి నోట చరణ్ మాట | Chinese Person Asked About Ram Charan

ఈ డిస్కషన్ మధ్యలో భారతీయుడు అతనికి తౌబా తౌబా అనే పాపులర్ హిందీ పాట వినాల్సిందిగా కోరాడు. ఆ పాట వినకుండా చైనా కుర్రోడు రామ్ చరణ్ పాటలు లేవా అని అడిగాడు. చైనా వ్యక్తి నోట చరణ్ మాట వినిపించడంతో హిందీ వ్లాగర్ షాకయ్యాడు.ఎందుకంటే రామ్ చరణ్ అంత పాపులర్ అని అతనికి తెలియదు. తరువాత అతను వేరే విషయాలు మాట్లాడుతూ తన వ్లాగింగ్ కంటిన్యూ చేశాడు.

ఈ వీడియోలో 14 నిమిషాలు 55 సెకండ్ల దగ్గర నేను చెప్పిన సెషన్ ఉంటుంది చూడండి.

యాక్సిడెంటల్‌గా చూశాను | Ram Charan Fan In China

నిజానికి చైనాలో లోకల్ ట్రైనులో కొంత మంది బాత్రూమ్ పక్కనే ఉంటారు, ట్రైన్ నేలపై పడుకుంటారు అని ఒక రీల్ చూశాను. దాంతో అతని ఛానెల్లో పూర్తి వీడియో చూడటం మొదలు పెట్టాను. వీడియో మధ్యలో నాకు సడెన్‌గా రామ్ చరణ్ అనే పేరు వినిపించింది. ఒక్కసారి ఫుల్ బాటిల్ చేయి నుంచి జారినప్పుడు మందు బాబులు ఎట్ల షాక్ అయితరో అట్ల షాకింగ్ గా అనిపించింది.

ఎందుకంటే చైనాలో ఒక యువకుడు మన తెలుగు సినిమా హీరో పేరు ఎలాంటి ఇబ్బంది లేకుండా స్పష్టంగా పలికాడు. ఇది నిజంగా గర్వకారణం కదా ? నాకైతే ఈ విషయం మీతో షేర్ చేయాలి అనిపించి షేర్ చేశాను.

ట్రిపుల్ ఆర్ ఎఫెక్ట్ | RRR Effect


Ram Charan Craze in China
| | నాటు నాటు పాట చైనాలో కూడా హిట్టు హిట్టు |Gif By Tenor

ట్రిపుల్ ఆర్ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో సంచలన విజయం సాధించింది. ఈ మూవీ టేకింగ్ నుంచి నటీనటులు పెర్ఫార్మెన్స్, మ్యూజిక్, గ్రాఫిక్స్ డ్యాన్స్ అన్నీ విభాగాలపై అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వచ్చాయి. నాటు నాటు పాట అయితే చైనాలో వైరల్ ( Naatu Naatu In China) అయింది. చాలా మంది దీనిపై డ్యాన్సులు చేస్తూ వీడియోలు రికార్డు చేశారు. దీంతో రామ్ చరణ్, తారక్ అక్కడి యూత్‌లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!