Aero India 2025 : ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్‌షో ప్రత్యేకతలు, ఎంట్రీ ఫీజు, కీలక తేదీలు ఇవే !

షేర్ చేయండి

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఎయిర్‌షో నేడు భారత్‌లో ప్రారంభమైంది. ఎరో ఇండియా 2025 ( Aero India 2025 ) అనే పేరుతో ఈ ఈవెంట్ కర్ణాటక రాజధాని బెంగుళూరులోని యలహంక ఎయిర్‌పోర్స్ స్టేషన్‌లో (Yelahanka Air Force Station) ఫిబ్రవరి 10 నుంచి జరుగుతుంది.

మొత్తం 42,000 చదరపు మీటర్ల మేరా విస్తరించి ఉన్న ఈ ఎయిర్ ఫోర్స్ స్టేసన్‌లో జరిగే ఈ ఈవెంట్ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద ఎయిర్‌షో భావిస్తున్నారు. 5 రోజుల పాటు జరగనున్న ఈ అద్భుతమైన ఎరో ఇండియా 2025లో మొత్తం 900 సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఇందులో 150 విదేశీ సంస్థలు కూడా ఉన్నాయి.

ఈ వేడుకలో వైమానిక ప్రదర్శనలు సాధారణ సందర్శకులను, పారిశ్రామికవేత్తలను, సాంకేతిక నిపుణులను, ఎరోనాటికల్ ఇంజినీర్లను ఆకట్టుకోనున్నాయి. 

ప్రారంభోత్సవం | Inauguration of Aero India 2025

ఎరో ఇండియా కార్యక్రమాన్ని భారత రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ( Rajnath Singh ) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ వర్గల సందర్శకుల కోసం తేదీలు ఖరాలు చేశారు. 

మొదటి మూడు రోజులు బిజినెస్ విజిటర్స్ కోసం మాత్రమే ఉండగా చివరి రెండు రోజులు మాత్రం సాధారణ ప్రజలను సందర్శించే అవకాశం ఇస్తారు. ఇలా చేయడం వల్ల అటు వ్యాపారవేత్తలకు, ఇటు ప్రజలకు కూడా ప్రయోజనం ఉంటుంది. 

ప్రత్యేకతలు | Aero India 2025 Highlights

  • రష్యాకు చెందిన సు-57 ( SU-57)
  • అమెరికాకు చెందిన ఎప్-35 ( F-35 ) లైట్నింగ్

5వ తరానికి చెంది ఈ ఫైటర్‌జెట్స్‌ను ( Fifth Generation Fighter Jets ) మొదటిసారిగా ఒకే ఈవెంట్‌లో చూసే అవకాశం లభిస్తుంది. వీటితో పాటు

  • కేసీ -135 స్ట్రాటో ట్యాంకర్, బీ-1బీ ల్యాన్సర్ 
  • బ్రెజిల్‌కు చెందిన మల్టిమిషన్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ కేసీ-390 మిలేనియంను కూడా ఇందులో చూడవచ్చు.
Prayanikudu
📣| ప్రయాణికుడు వాట్సాప్ అప్డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అంతర్జాతీయ సహకారంతో 

ఎరో ఇండియా షో ప్రత్యేక ఏంటి అంటే అంతర్జాతీయంగా వైమానిక రంగంలో వచ్చే మార్పులతో పాటు సైనిక పరికరాల్లో వచ్చే కొత్త సాంకేతికతను కూడా వీక్షించే అవకాశాన్ని సందర్శకులకు కలిగిస్తారు. ఈ సారి కూడా లేటెస్ట్ వర్షన్ ఎయిర్‌క్రాఫ్టులను ప్రదర్శించనున్నారు.

ఈ ఈవెంట్‌‌కు అంతర్జాతీయంగా కూడా మంచి పాపులారిటీ ఉంది. అమెరికా, రష్యాలాంటి గ్లోబల్ పవర్ ఉన్న దేశాలు తమ 5వ తరం ఫైటర్‌జెట్లను ఎరో ఇండియాలో ప్రదర్శించడమే దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.

ఈ విషయాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ( Indian Defence Ministry ) హైలైట్ చేస్తూ “  చరిత్రలో మొదటిసారిగా ఎరో ప్రపంచంలోనే అత్యాధునిక, అడ్వాన్స్‌డ్ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను ఇండియా 2025 వంటి  కార్యక్రమంలో మీరు చూడబోతున్నారు” అని తెలిపింది.

మన ఎయిర్‌క్రాఫ్టులు | Indian Aircrafts in Aero India 2025

ఎరో ఇండియాలో ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్న జెట్స్‌తో పాటు ప్రత్యేకమైన ఎయిర్‌క్రాఫ్టులను కూడా చూడవచ్చు.

  • తేజన్ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అయిన HJT 36
  • హిందుస్తాన్ టర్బో ట్రైనర్ -HTT-40
  • లైట్ యూటిలిటి హెలికాప్టర్ 
  • అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA)

వంటి ఎన్నో స్వదేశీ డిఫెన్స్ ఉత్పత్తులను చూడవచ్చు. వైమానిక సాంకేతిక పరిఙ్ఞానంలో భారత్ ఎంత వేగంగా దూసుకెళ్తోందో వీక్షించవచ్చు. దీంతో హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ ( HAL ) నిర్మించిన వారియర్ అనే కంబాట్ ఎయిర్ టీమింగ్ సిస్టమ్‌ ( CATS) తొలిసారి బయటి ప్రపంచం ముందు కనిపించనుంది.

ఎంత మంది రానున్నారు అంటే

2023 లో జరిగిన ఎరో ఇండియా ( Aero India 2023 ) లో సుమారు 7 లక్షల మంది సందర్శకులు, నిర్వాహకులు హాజరు అయినట్టు సమాచారం. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందులో ఎగ్జిబిటర్స్, వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు, స్టార్టప్స్‌, ఎమ్మెస్‌ఎమ్మీస్ (MSMEs) వంటి వివిధ వ్యాపార వర్గాల సందర్శకులు వచ్చే అవకాశం ఉంది. వైమానిక, రక్షణ పరిశ్రమకు చెందిన వారు ఒకరికి ఒకరు పరిచయం చేసుకునేందుకు కూడా ఇది మంచి వేదిక అని చెప్పవచ్చు.

వైమానిక ప్రదర్శనలు | Aerobatic Displays In Aero India 2025

Aero India 2025
Image Source: Aero india official website

ఎరో ఇండియా 2025 సూర్యకిరణ్ ఎరోబాటిక్ టీమ్ (SKAT) కు చెందిన 9 ఎయిర్ క్రాఫ్టుల వైమానిక ప్రదర్శన హైలైట్ కానుంది. 

  • అద్భుతమైన, ఒళ్లు గగర్పాటు కలిగించే విన్యాసాలతో సందర్శకులకు జీవితాంతం గుర్తుండేలా ప్రదర్శన ఉంటుంది. 
  • దీంతో పాటు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (Indian Air Force) కు చెందిన సారంగ్ హెలికాప్టర్ ప్రదర్శన టీమ్‌ కూడా గత రెండు దశాబ్దాలుగా అద్బుతమైన గగన విన్యాసాలు చేస్తూ మెప్పిస్తోంది.
  • ఈసారి కూడా మనం అలాంటి అద్భుతాన్ని ఆశించవచ్చు అని ఆశించారు చాలామంది. 
  • ఎల్‌హెచ్ ధృవ్ హెలికాప్టర్లను కొన్ని కారణాల వల్ల ప్రస్తుతం వినియోగించడాన్ని ( ALH Dhruv Helicopters Grounding ) ఆపేశారు. ఇది కాస్త డిస్సపాయింట్ కలిగించే విషయమే.

కీలక తేదీలు | Aero India 2025 Key Dates and Air Displays

ఈవెంట్‌లో ఫిబ్రవరి 11వ తేదీ, 12వ తేదీన మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు ఎయిర్‌ డిస్‌ప్లే ఉంటుంది. 

ఎంట్రీఫీజు | Aero India 2025 Entry Fee

ఎరో ఇండియా 2025కు వెళ్లాలి అనుకునే సందర్శకులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ తరువాత మీరు టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంట్రీ ఫీజు వచ్చేసి….

  • బిజినెస్ పాసులు ( భారతీయులకు ) రూ.5,000. విదేశీయులకు 150 డాలర్లు
  • వీటిని ఫిబ్రవరి 10 నుంచి 12 వ తేదీల మధ్యలో వినియోగించుకోవచ్చు.
  • ఆడ్వా పాసులు : భారతీయులకు రూ.1,000. విదేశీయులకు 50 డాలర్లు
  • సాధారణ ప్రజలకు రూ.2,500 ( ఫిబ్రవరి 13 -14వ తేదీల్లో మాత్రమే సాధారణ ప్రజలను సందర్శన కోసం అనుమతి ఇస్తారు.)

బుకింగ్ కోసం ఈ కింది లింకు ఉపయోగపడుతుంది.

Aeroindia 2025 : https://www.aeroindia.gov.in/visitor-registration

మరిన్ని వివవరాల కోసం ఏరో ఇండియా 2025 అధికారిక వెబ్‌సైట్ విజిట్ చేయగలరు

https://www.aeroindia.gov.in

ఎరో ఇండియా 2025 అనేది ఆసియాతో పాటు ప్రపంచంలోని అత్యాధునిక వైమానిక సాంకేతికతను పరిచయం చేసే అద్భుతమైన వేదికగా నిలవనుంది. ఇందులో సాధారణ ప్రజలు కూడా రక్షణ పరికరాలను, విమాన సాంకేతికతను చూడవచ్చు. ఎరోస్పేస్ ఇండస్ట్రీలో (Aerospace Industry ) జరుగుతున్న మార్పులను వీక్షించే ఈ అరుదైన అవకాశాన్ని మిస్ చేసుకోకండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!