43 రోజుల్లో హైదారాబాద్ నుమాయిష్‌ను ఎంత మంది సందర్శించారో తెలుసా ? | Hyderabad Numaish 2025

షేర్ చేయండి

హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నుమాయిష్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిని ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE 2025) అని కూడా పిలుస్తుంటారు. 2025 జనవరిలో ప్రారంభమైన ఈ నుమాయిష్‌‌ను (Hyderabad Numaish 2025) ఇప్పటి వరకు 17.46 లక్షల మంది సందర్శించారు. 

నాంపల్లిలోని ఎగ్జిబిషన్ (Nampally Exhibition 2025) గ్రౌండ్‌లో వైభంగా జరుగుతున్న ఈ ప్రదర్శనలో ప్రజలు షాపింగ్ చేయడంతో పాటు వివిధ యాక్టివిటీస్‌లో భాగం అయ్యారు. దీంతో పాటు పలు రకాల ఆహార పదార్థాలను ఎంజాయ్ చేశారు.

అద్భుతమైన చరిత్ర | Numaish History

హైదరాబాద్ చరిత్రలో నుమాయిష్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఎగ్జిబిషన్ అనేది షాపింగ్, ఎంటర్‌టైన్మెంట్, కల్చరల్ ఎక్స్‌ఛేంజ్‌కు ఒక వేదికగా నిలుస్తోంది. ఈ తరం నుంచి పాత తరం వరకు అందరూ నుమాయిష్‌‌లో ఎంజాయ్ చేయడానికి , షాపింగ్ చేయడానికి వెళ్తుంటారు. హైదరాబాదీ (Hyderabadi ) ప్రజలు మెమోరీలో ఈ ఎగ్జిబిషన్‌ ఒక హైలైట్‌గా నిలుస్తుంది.

వైవిధ్య భరితం | Why Numaish Is So Special ?

దేశంలో ఉన్న అద్భుతమైన కళాఖండాలను, వస్తువులను చూసేందుకు చాలా మంది నుమాయిష్ వెళ్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి తమ కలెక్షన్‌ను అమ్మకానికి పెడుతుంటారు. ఇందులో కశ్మీర్‌లోని హ్యాండిక్రాఫ్ట్స్, డ్రై ఫ్రూట్స్ నుంచి రాజస్థాన్‌లోని (Rajasthan) టెక్ట్స్‌టైల్స్ వరకు ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి వర్తకులు తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తారు.

నుమాయిష్ కాదు.. ఒక మెమోరీ | Nostalgia of Numaish

చాలా కాలం నుంచి నుమాయిష్ వెళ్తున్న వాళ్లు ప్రతీసారి వారి బాల్యాన్ని గుర్తు చేసుకుంటారు. గతంలో ఇక్కడ ఈ స్టాల్ ఉండేది, అక్కడ అది ఉండేది అంటూ మెమోరీస్ రీకలెక్ట్ చేసుకుంటారు. 

  • ప్రస్తుతం హైదారబాద్‌లో అడుగడుగునా మాల్స్, షాప్స్ ఉన్నా కూడా ఎగ్జిబిషన్‌కు (Hyderabad Exhibition 2025) ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు. 
  • ఎందుకంటే నుమాయిష్ అనేది హైదరాబాద్ ప్రజలకు ఒక వాణిజ్య ప్రదర్శన మాత్రమే కాదు…కుటుంబ సమేతంగా వెళ్లేందుకు ఒక అనువైన చోటుగా కూడా మారింది. 
  • భారత దేశంలో వివిధ వస్తువులు, దుస్తువుల ట్రెండ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు.

కళాకారులకు అండగా | Objectives Of Numaish

hyderabad numaish 2025
నుమాయిష్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రిజన్ డిపార్ట్‌మెంట్ స్టాల్. ఇందులో ఖైదీలు తయారు చేసిన వస్తువులను అమ్మకానికి ఉంచారు.

నుమాయిష్‌ను హైదరాబాద్  చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ (The Last Nizam) ప్రారంభించారు. ఆయన దీనికి ప్రారంభించడానికి స్థానిక కళాకారులతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న వర్తకులకు ఆర్థికంగా అండగా నిలవడానికి ఒక వేదిక ఉండాలనే ఆలోచనే కారణం. నుమాయిష్‌లో చిన్న వర్తకులు, కళాకారులకు ప్రాధాన్యత ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే వర్తకులు హైదరాబాద్‌లోని ప్రజలకు తమ వస్తు, సేవల గురించి తెలిపే అవకాశం అందిస్తుంది నుమాయిష్. దీని వల్ల ఎన్నో కుటుంబాలకు ఆర్థికంగా లాభం చేకూరుతుంది.

2025 లో ఆలస్యంగా ప్రారంభం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మరణంతో వారం రోజుల పాటు సంతాపదినాలు ప్రకటించారు. దీనివల్ల జనవరి 1వ తేదీన ప్రారంభం కావాల్సిన నుమాయిష్ జనవరి 3వ తేదీన ప్రారంభం అయింది. అందుకే ఫిబ్రవరి 15వ తేదీన నుమాయిష్ ముగియనుండగా దీనిని ఫిబ్రవరి 17కు పొడగించారు నిర్వాహకులు.

సవాళ్లు | Hyderabad Numaish 2025

చిన్న ర్యాలీ నిర్వహిస్తేనే హైదరాబాద్‌లో ట్రాఫిక్ జామ్ (Hyderabad Traffic Jam) అయిపోతుంది. మరి ఇంత పెద్ద ఎగ్జిబిషన్ నిర్వహిస్తే పరిస్థితి ఏంటో మీరు కూడా ఊహించవచ్చు. నుమాయిష్‌ సమయంలో పార్కింగ్‌తో పాటు ట్రాఫిక్ సమస్య కూడా మారుతుంది. ట్రాఫిక్ వల్ల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్న సందర్శకులకు ఇబ్బంది కలుగుతుంది. గత ఏడాది 25 లక్షల మంది నుమాయిష్‌ను సందర్శించుకున్నారు.

*బ్యాగులు మోసేవాడు పురుషుడు సుమతి : నుమాయిష్‌లో బ్యాగులు మోసే భర్తల రీల్ వైరల్ | Men At Numaish

సేల్స్ పెరిగాయి

2024 తో పోల్చితే ఈ ఏడాది సందర్శకుల సంఖ్య స్వల్పంగా తగ్గినా అమ్మకాలు మాత్రం పెరిగాయంటున్నారు వ్యాపారులు. షాపింగ్ కోసమే నుమాయిష్ వచ్చిన వాళ్ల వల్ల అమ్మకాలు పుంజుకున్నాయి అంటున్నారు. ఇక ఎగ్జిబిషన్ ముగింపు దశలో ఉన్నందున ( Numaish 2025  Last Date) సందర్శకుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. 

  • ఎందుకంటే వీలైనంత ఎక్కువగా అమ్మాకాలు చేయాలని తక్కువ సరుకులతో తిరిగి వెళ్లాలని వ్యాపారుల ఆలోచిస్తారు. 
  • చివరి రోజుల్లో వ్యాపారులు తప్పకుండా ఎంతకు అడిగితే అంతకు ఇస్తారనే ఆశతో చాలా మంది లాస్ట్ వీక్‌లో నుమాయిష్ వెళ్తుంటారు. 
  • Read Also: ఇక నిమిషాల్లో ట్రాఫిక్ అప్డేట్స్ తెలుస్తాయి.

మొత్తానికి | Conclusion on Hyderabad Exhibition 2025

నుమాయిష్ (Numaish) అనేద ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నేటికీ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుని వేగంగా దూసుకెళ్తోంది. హైదరాబాద్ కల్చరల్ క్యాలెండర్‌లో నుమాయిష్ అత్యంత కీలకంగా భావించవచ్చు. ఇక్కడికి చిన్నా పెద్దా తేడాలేమీ లేకుండా అన్ని వర్గాల ప్రజలు తరలివస్తుంటారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ అనేది ఒక ప్రదర్శన మాత్రమే కాదు ఇది సంప్రదాయంగా మారింది. ఈ సంప్రదాయం ఇలాగే ఎప్పటికీ కొనసాగాలనే కొరుకుందాం.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!