Srinivasa Mangapuram: యోగా నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి

షేర్ చేయండి

శ్రీవారు శ్రీవేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతి, తిరుమలలో నిత్యం ఎటు చూసినా అధ్యాత్మిక ఉత్సాహం భక్తుల్లో కనిపిస్తుంది. ప్రస్తుతం శ్రీనివాస మంగాపురంలో (Srinivasa Mangapuram) శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మెత్సవాలు జరుగుతున్నాయి. ఆ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఫోటోలు, విశేషాలు మీ కోసం..

శ్రీనివాస మంగాపురం | Srinivasa Mangapuram

ఈ సందర్భంగా స్వామివారి (Sri Kalyana Venkateswara Swamy) దర్శనం చేసుకుని తరించారు భక్తులు. బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు స్వామి వారు ఉగ్రమైన, కరుణామయమైన యోగ నరసింహుడి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ రూపంలో స్వామిని దర్శించుకున్న భక్తులకు ఆధ్యాత్మిక చైతన్యం కలుగుతుంది అంటారు. *

యోగా నరసింహుడి అలంకరణ విశిష్టతలు

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

శ్రీనివాసమంగాపురంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా 3వ రోజు ఉదయం స్వామి వారు యోగానరసింహుడి అలంకరణలో సింహవాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

స్వామి వారి వాహనానికి ముందు వృషభాలు, గజరాజులు నడుస్తుండగా స్వామివారు భక్తులకు దర్శనం ఇచ్చారు.

Srinivasa Mangapuram

భక్తులు చెక్క భజనలు, కోలాటాలతో స్వామి వారిని కీర్తించారు. మంగళ వాయిద్యాలు బ్రహ్మోత్సవం జరిగే ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభను మరింతగా పెంచాయి.

Srinivasa Mangapuram

స్వామి వారు సింహ వాహనంపై బయల్దేరగా అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించారు.

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

సింహం అంటే ధైర్యానికి, పరాక్రమానికి, తేజస్సులకు, ఆధిపత్యానికీ, మహా ధ్వనికి ప్రతీకగా భావిస్తారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం సింహవాహనంపై అధిరోహించారు శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు.

Sri Kalyana Venkateswara Swamy Brahmostavalu 2025 (6)

స్వామి వారిని సింహరూంలో దర్శించకుంటే పైన వివరించిన శక్తులు చైతన్యవంతం అవుతాయి. సోమరతనం నశిస్తుంది. విజయం సాధించే పట్టుదల కలుగుతుంది అని అంటారు.

శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ చరిత్ర

History Of Srinivasa Mangapuram Sri Kalyana Venkateswara Swamy Temple

ఓడిశాలో జన్మించిన సువర్ణముఖి నదికి (Swarnamukhi River) రెండు ఉపనదులు ఉన్నాయి. ఒకటి భీమా నది కాగా మరొకటి కల్యాణి నది (Kalyani River). ఈ కల్యాణి నదీ తీరంలో శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామివారు వెలిశారు.అమ్మవారికి ఉన్న అనేక పేర్లలో కల్యాణి కూడా ఒకటి. ఇలా
కళ్యాణం అనే పేరుకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.

తిరుమల అడవుల్లో ఉన్న వన్యమృగాలకు భయపడి కొంత మంది భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లేందుకు భయపడేవారు. కానీ దర్శనం చేసుకోవాలనే కోరికతో, వారు ఈ ఆధ్యాత్మిక యాత్రను సాహసయాత్రగా స్వామివారి పేరు తలచుకుని పూర్తి చేసేవారు.

అయితే అలాంటి భక్తుల కోసం కొండ కింద మైదాన ప్రాంతంలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నాలుగు ఆలయాలు వెలిశాయి. అయితే ఈ ఆలయాలు నిర్మించే సమయంలో ఇవి తాత్కాలికాలు అని..ఎప్పటికైనా భక్తులు ఏడు కొండలు (Lord Venkateswara Swamy) ఎక్కాల్సి ఉంటుంది అని అటు భక్తులకు ఇటు ఆలయ నిర్మాణం చేసిన వారికీ తెలుసు.

ఆ నాలుగు ఆలయాలు వచ్చేసి

  1. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం – శ్రీనివాస మంగాపురం
  2. శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయం – నారాయణవరం
  3. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి ఆలయం- తిరుచానూరు
  4. శ్రీ తిమ్మప్ప స్వామి ఆలయం -తొండవాడ

ఇందులో 4వ ఆలయం అన్నింటిలో కొత్తది. అంటే సుమారు 400 ఏళ్ల క్రితం నాటిది.

ఈ ఆలయాలు అన్నింటిలో కూడా శ్రీనివాస మంగాపురం అతిముఖ్యమైనది . ఇక్కడ స్వామి వారు అసలు స్వామి కంటే కాస్త ఒడ్డూ పొడుగ్గా ఆలయం మొత్తం నిండినట్టు గంభీరంగా దర్శనం ఇస్తారు.

మూలం: పైన వివరించిన శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయ చరిత్ర అంశాలను శ్రీగోపీకృష్ణ ఇదే పేరుతో రచించిన, 1980 లో వెలువడిన పుస్తకం నుంచి సేకరించి, యధాతథంగా అందించాము. . ఇందులో ప్రయాణికుడు.కామ్ ఎలాంటి సవరింపులు, లేదా మార్పులు కూర్పులు చేయలేదు.

ఈ సమాచారంపై సర్వ హక్కులు రచయిత, ముద్రిత సంస్థకే సొంతము. పాఠకులు గమనించగలరు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!