ఒంటిమిట్టలో వైభవంగా మహాశాంతి అభిషేకం…మార్చి 9న మహా సంప్రోక్షణ కార్యక్రమం | Maha Shanti Abhishekam

షేర్ చేయండి

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో 2025 మార్చి 8వ తేదీన మహాశాంతి అభిషేకం (Maha Shanti Abhishekam) శాస్త్రోక్తంగా నిర్వహించారు.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామి (Vontimitta Kodandarama Swamy Temple) ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 2025 మార్చి 8వ తేదీన ఆలయంలో మహాశాంతి అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు.

మహా సంప్రోక్షణం | Maha Samprokshanam

Vontimitta Maha Samporakshanam 3

2025 మార్చి 9 వ తేదీన మహా సంప్రోక్షణ (Maha Samprokshanam) కార్యక్రమం నిర్వహించనున్నారు. 

శ్రీమద్రామాయణ యజ్ఞం | Srimadramayana Yagnam

Maha Shanti Abhishekam at Vontimitta

ఈ కార్యక్రమంలో భాగంగా ఒంటిమిట్ట ఆలయంలో (Vontimitta Temple) శనివారం ఉదయం 6 గంటలకు శ్రీమద్రామాయణ యజ్ఞం, సహస్త్రకలశాది దేవతా హోమం, చతుస్థానార్చనం, మూర్తి హోమం, సహస్ర కలశాభిషేకంతో పాటు పూర్థాహుతి కార్యక్రమాలు నిర్వహించారు.

కళాపకర్షణ | Kalapakarshana

Maha Shanti Abhishekam at Vontimitta

అదే విధంగా సాయంత్రం 6 గంటలకు శయ్యాదివాసం, ప్రధాన మూర్తి హోమం, కళాపకర్షణ, తత్వన్యాస హోమం, వేదాది పారాయణం (Vedaparayanam), అష్టబంధన సమర్పణ, శాంతి హోమం, మహాశాంతి అభిషేకంతో పాటు పూర్ణాహుతి నిర్వహించారు.

భగవత్ పుణ్యాహం

Maha Shanti Abhishekam at Vontimitta

ఇక 2025 మార్చి 9వ తేదీన ఆదివారం రోజు భగవత్ పుణ్యాహం, మూర్తి హోమం, శ్రీమద్రామాయణ హోమం (Srimadramayanam) , పంచసూక్త-పవమాన హోమాలు నిర్వహించనున్నారు.

స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తం | Swana Pushparchana Shastroktam

Maha Shanti Abhishekam at Vontimitta

ఇక ఉదయం 9 గంటలకు మహా పూర్ణాహుతి, 10 గంటల 15 నిమిషాల నుంచి 11.30 వరకు శ్రీమద్రామాయణ యజ్ఞంతో పాటు మహా కుంభాభిషేకం, స్వర్ణ పుష్పార్చన శాస్త్రోక్తం నిర్వహించనున్నారు. తరువాత భక్తులు స్వామి వారిని దర్శించుకోనున్నరు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!