Travel History 01 : భారత బానిసత్వానికి పునాది వేసేందుకు వాస్కో డా గామా బయల్దేరిన రోజు
Travel History 01 : ప్రపంచం ఆరంభం నుంచి మనిషి ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేస్తునే ఉన్నాడు. అయితే కొన్ని ప్రయాణాలు మాత్రం చరిత్ర గమనాన్ని మార్చాయి. అందులో ఒక ప్రయాణం గురించి.. ఒక ప్రయాణికుడి గురించి…ఈ పోస్టులో…
ఈ రోజుల్లో మనకు గూగుల్ మ్యాప్స్ (Google Maps) , ట్రావెల్ వ్లాగ్స్ (Travel Vlogs) ఇలా ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. సులభంగా మనం అనుకున్న చోటికి చేరుకోగలం.
అయితే పక్కా మ్యాప్ చేతిలోకి (world map) రాకముందే వాస్కో డా గామా ప్రపంచ యాత్రను మొదలు పెట్టాడు. కానీ ఈ యాత్రకు ఒక లక్ష్యం ఉంది. అది ఇండియాను కనుక్కోవడం. భారత్ -యూరోప్ మధ్య సముద్ర దారిని, ఒక రూట్ మ్యాపును ఎస్టాబ్లిష్ చేయడం.
- ఇది కూడా చదవండి : ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
అలా 1497 లో ఇదే రోజు అంటే జూలై 8వ తేదీన గామా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు.
పైన మీరు చూస్తున్న చిత్రం లిస్బన్‌కు (Lisbon, Portugal) సంబంధించినది అక్కడి నుంచి గామా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. ఈ ప్రయాణంతో ప్రపంచ వాణిజ్య చరిత్రను మలుపుతిప్పాడు వాస్కోడా గామా. దీంతో పాటు భారత దేశాన్ని విదేశీయులు ఆక్రమించుకునేందుకు పునాది వేసింది కూడా ఇతనే.
ప్రపంచ యాత్ర కాదు….| Travel History 01
వాస్కోడా గామా (Vasco Da Gama) 1498 లో అంటే తన ప్రయాణం ప్రారంభించిన ఏడాది తరువాత్ భారత్ చేరుకున్నాడు. ఇతని ప్రయాణ లక్ష్యం ఒక్కటే అప్పటి వరకు అరబ్బు దేశాల నుంచి వస్తున్న సుగంధ ద్రవ్యాలు, ఇతర పదార్థాలపై యూరోప్ ఆధార పడేది.
ఈ సరకులు కొనేందుకు మధ్య వర్తులకు బాగా డబ్బు చెల్లించాల్సి వచ్చేది. ఈ బ్రోకేరేజ్ నుంచి తప్పించుకుని టోకుగా, తక్కువ ధరకు తమకు కావాల్సినవి కొనేందుకు భారత్ అయితే అనుకూలం అని భావించారు పోర్చుగీసు వాళ్లు.
అరబ్బుల ఏకఛత్రాధిపత్యం నచ్చక భారత్‌తో వ్యాపారం చేసుకుందామని భావించి ఇక్కడి మసాలాలు, సిల్కు, ఇతర ముడి పదర్థాల వ్యాపారం కోసం బయల్దేరాదు. తరువాత భారత్ పోర్చుగల్ మధ్య వాణిజ్యం మొదలైంది. పోర్చుగీస్ దేశం బాగా డబ్బు సంపాదించుకుంది.
- ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
రాజుకు నమ్మిన బంటు | Why Vasco Da Gama Sailed To India
ఈ ప్రయాణానికి వాస్కోడా గామా అయితే బెస్ట్ అనుకున్న కింగ్ మాన్యువల్ వన్ (King Manuel 1 ) ఈ యాత్రకు సంబంధించిన బాధ్యత అతనికి అప్పగించాడు. ఎందుకంటే గామా మంచి నేవిగేటర్. సముద్ర ప్రయాణంలో అతనికి ఉన్న అపార అనుభవం ఉపయోగపడుతుంది అనుకున్నాడు కింగ్. దీనికి తోడు గామా కుటుంబ సభ్యులు రాజ కుటుంబానికి నమ్మిన బంట్లుగా పేరు తెచ్చుకున్నారు.
బానిసత్వానికి పునాది…| How Portuguese Occupied india
వాస్కో డా గామా భారత్‌ను కనుక్కున్నాక (When Vasco Da Gama Discovered India) యూరోప్‌కు సరికొత్త మార్కెట్ దొరికింది. తరువాత అటూ ఇటూ ఎగుమతులు దిగుమతులు పెరిగాయి. దాంతో పాటు పోర్చుగీసు వారిలో స్వార్థం పెరిగింది. దురాశ పెరిగింది.
మెల్లిమెల్లిగా భారత్‌లో వ్యాపారంతో పాటు తమ సామ్రాజ్యాన్ని విస్తరించడం మొదలు పెట్టారు. ఇక్కడి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకుని ముందు గోవాను ఆక్రమించుకున్నారు. తరువాత యూరోప్‌లోని వివిధ దేశాలకు భారత దేశం మాత్రమే కనిపించింది. అంతులేని సంపదను దోచుకెళ్లేందుకు చేయాల్సినవి అన్నీ చేశారు. ఇదంతా మీకు తెలిసే ఉంటుంది.
తోపు కాదు…
సో వాస్కో డా గామా జస్ట్ అంటే ఏదో గొప్పగా చూడటం మానేసి అతని వల్లే మనం దేశం బానిసత్వపు సంకెళ్లలో చిక్కుకుంది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం. భారత్‌ను కనుక్కున్నాడు కనుక్కున్నాడు అని గొప్పగా చెప్పకండి ఇకపై. అతని వళ్లే కదా మన దేశం కొన్ని శతాబ్దాల పాటు బానిస సంకెళ్లలో చిక్కుకుంది.
ప్రత్యక్షంగా అతను కారణం కాకపోయినా…అతని వల్ల వచ్చిన వ్యాపారవేత్తలు తరువాత సామ్యాజ్యవాదాన్ని విస్తరించారు. సో వాస్కోడా గామా తోపు కాదు. మనకైతే కాదు.
Cover Image courtesy of Pixabay. Licensed under Creative Commons CC0 – Free for commercial use.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.