Story Of World Map : ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచ పటం ఎప్పటిదో తెలుసా ?
Story Of World Map : గుహల్లో రంగు రంగుల చిత్రాలు వేయడం నుంచి చిన్న చిన్న గుడ్డముక్కలపై, ఆకులపై ఒక ప్రాంతాన్ని పాయింట్ చేయడం వరకు… ప్రపంచ పటం ఇలా ఎన్నో అంచెలను దాటుకుని మన కోసం సిద్ధం అయింది.
అయితే ఇప్పుడు మనం చూస్తున్న మ్యాప్ ఎప్పడు అందుబాటులోకి వచ్చింది ?….దాని ముందు జరిగిన విషయాలేంటో ఈ పోస్టులో తెలుసుకుందాం.
మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది అని మనకు తెలియడానికి సుమారు 2,500 సంవవత్సరాల ముందు నుంచే మనుషులు మ్యాపులు వాడటం ప్రారంభించారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి నుంచి అసలు ప్రపంచం ఆకారం లేదా దేశాల రూపాలు, ప్రాంతాలు, ద్వీపాలు ఇలా ఉంటాయి లేదా అలా ఉంటాయి అని ఊహిస్తూ కొన్ని వేల సంవత్సరాల నుంచి మ్యాపులు తయారు అవుతూనే ఉన్నాయి.
అతి పురాతనమైన మ్యాప్ | World’s Oldest Map
ప్రస్తుతం అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మ్యాప్ అనేది క్రీస్తు పూర్వం 600 వ సంవత్సరానికి అంటారు. దీనిని బాబిలోనియా ప్రపంచ పటం (Babylonia World Map) అని పిలుస్తారు.
ఇక గ్రీసు దేశానికి చెందిన ఎనగ్జిమాండర్ (Anaximander) అనే వ్యక్తి భౌగోళికం నియమాల ప్రకారం ఒక మ్యాపును రెడీ చేశారని అంటారు.
- ఇది కూడా చదవండి : Travel History 01 : భారత బానిసత్వానికి పునాది వేసేందుకు వాస్కో డా గామా బయల్దేరిన రోజు
అప్పట్లో క్లాడియస్ గారి మ్యాపు…| Story Of World Map
ఒక 150 సీఈలో క్లాడియస్ టోలెమీ (Claudius Ptolemy) అనే భౌగోళికవేత్త జియోగ్రాఫియా (Geographia) అనే పేరుతో ఒక పుస్తకం రాశి అందులో స్పష్టమైన మార్గాలు, గణాంకాలు ఇతర వివరాలు అందించాడు. అందులో ఉన్న వివరాలతో ఈ బుక్ ట్రెండ్ క్రియేట్ చేసింది. దీని ఆధారంగానే అప్పట్లో వాణిజ్య, వర్తక వ్యాపారాలు సాగేవట.
15వ శతాబ్దం…ప్రపంచ యాత్రికుల శకం | First World Travelers
సుమారు 15వ శతాబ్దం ఆ సమయంలో అనేక మంది నావికులు, వ్యాపారులు ప్రపంచ యాత్రలు మొదలు పెట్టారు. కొంత మంది ఒంటరి ప్రయాణాలు (Solo Travelers) చేస్తే కొంత మంది తమ నావికాదళంతో సముద్రయానం మొదలు పెట్టారు.
ఇదే సమయంలో వాస్కో డా గామా (Vasco Da Gama)…ఎవరి మామ అంటారేమో….భారత్‌ను వెతుకుతూ వచ్చిన నావికుడు. ఇతను భారత్ కూడా చేరుకున్నాడు. అయితే ఆ సమయంలో అతని చేతిలో చార్ట్స్ ఉన్నాయి. కానీ మనం వాటిని మ్యాప్ అనలేము. కనీసం అవి ఇప్పుడు చూసున్న మ్యాప్‌లా మాత్రం ఉండవు.
అదే సమయంలో కోలంబస్ ప్రపంచ యాత్ర (Columbus) మొదలైంది. ఇలా వివిధ యాత్రికులు కలిసి అప్పటికే అందుబాటులో ఉన్న మ్యాప్స్‌కు మెరుగులు దిద్దడం మొదలు పెట్టారు. వీరిని కార్టోగ్రాఫర్స్ ( Cartographers ) అని కూడా అంటారు.
- ఇది కూడా చదవండి : అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
అసలైన అన్వేషణ అంటే వీరిదే. వీళ్లు దేశాలను కనుగొనే వారు. వాటిని మ్యాపులో చేర్చేవారు. ఆ రోజుల్లో యూట్యూబ్ ఉండుంటే..వాళ్లు వ్లాగింగ్ చేసి ఉంటే..
” హెల్లో ఫ్రెండ్స్, నా పేరు వాస్కోడా గామా, మామ కాదు గామా. ఇప్పుడే నేను పవిత్రమైన భారత దేశ తీరానికి చేరుకున్నాను. నేను చేసిన ఈ నీచ్ కమీనే కుత్తే పనికి (Sorry), నా పనికి రాని ఈ యాత్ర వల్ల, భవిష్యత్తులో మసాలాల (indian Spcices) పేరుతో ఆంగ్లేయులుఇక్కడి వాళ్లు దోచుకుంటారని ఈ వ్లాగ్ చేసే సమయానికి నాకు తెలియదు.
తెల్లోళ్లు మసాలా దొంగలని (not sorry), వారిని దూరంగా పెట్టాలని..మసాలాలు, ఆ మసాలాలు పండించే భూమినీ, ఆ భూమిని దున్నే రైతును అన్నింటిని కొట్టేస్తామని భారతీయులకు తెలియదు. అసలు నాకే తెలియదు. ఏదేమైనా భారతీయులు నన్ను ఎప్పటికీ క్షమించరు… ” అని అనేవాడేమో..
పోయినోళ్లంతా గొప్పోళ్లు కాదు…వాస్కోడా గామా అస్సలు కాదు…ఇక టాపిక్‌లోకి వచ్చేస్తే…
ఇది ఫిక్స్…|
వేల సంవత్సరాల నుంచి ఎన్నో మార్పులు చేర్పులు, కట్ కాపీ పేస్ట్, ఆల్ట్ డిలీట్స్ ఇలా చాలా జరిగాక అప్పుడొచ్చిందయ్యా ఒక మ్యాపు. ప్రపంచ పటానికి ఒక షేపు. 15వ శతాబ్దంలో , పక్కాగా చెప్పాలంటే 1569 ఆ సమయంలో మెర్కేటర్ ప్రాజెక్షన్ (Mercator’s projection) అనే మ్యాప్‌తో ప్రపంచాన్ని పటానికి ఒక షేపొచ్చింది.
ఈ పద్ధతిలో మ్యాపులను అచ్చు వేసి నావికులకు అందించడం మొదలు పెట్టారు. ప్రపంచ పటం ఒక గ్లోబు ఆకారంలో నావికులకు సులభంగా అర్థం అయ్యేలా అందుబాటులోకి వచ్చింది.
ఆ తరువాత చేతులు మారుతూ మ్యాపులు మారుతూ ఉన్నా కానీ 15వ శతాబ్దంలో ఫిక్స్ అయిన మ్యాపుపైనే జరిగాయి. ఆధునిక ప్రపంచ పటానికి ఒక రూపు వచ్చింది.
Feature Image courtesy of Unsplash. Licensed under the Unsplash License – Free for commercial use.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.