Visa Temple : 11 ప్రదక్షిణలు చేస్తే వీసా? చిలుకూరు ఆలయం వెనుక ఉన్న విశ్వాసం
Visa Temple : తెలుగు ప్రజలకు చిల్కూరు ఆలయం గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మరిఈ ఆలయాన్ని వీసా టెంపుల్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
తెలంగాణ-ఆంధ్ర ప్రజలకు చిల్కూరు బాలాజీ ఆలయం ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఈ ఆలయం లక్షలాది మంది భక్తుల భక్తి, విశ్వాసానికి, ఆధ్యాత్మిక చైతన్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ ఆలయాన్ని చాలా మంది వీసా టెంపుల్ అని కూడా అంటారు.
జాతీయ స్థాయిలో ఈ ఆలయం గురించి ఎన్నో కథనాలు వచ్చాయి. అయితే వీసా టెంపుల్ అనే పేరు రావడానికి కారణాలు ఏంటో తెలుసుకుందామా?
- ఇది కూడా చదవండి : ఇలా కనిపించి అలా మాయం అయ్యే 5 ఆలయాలు
ఫారిన్ డ్రీమ్‌కు ఫస్ట్ స్టెప్ | Visa Temple
ఫారిన్ డ్రీమ్‌కు ఫస్ట్ స్టెప్ | Visa Templeచదువుల కోసమో, ఉద్యోగం కోసమో లేదా ఇతర ఏ కారణం చేతనో ఒక దేశానికి వెళ్లాలి అనుకుంటే ఆ దేశం మనకు వీసా ఇవ్వాల్సి ఉంటుంది. దాని కోసం మనం ఎన్నో అప్లికేషన్లు, సరైన డాక్యుమెంట్లు ఇలా ఎన్నో చూసుకోవాల్సి ఉంటుంది.
కానీ అన్నీ సరిగ్గా ఉన్నా కూడా అందరికీ వీసా లభిస్తుందనే గ్యారంటీ లేదు. ఇలా వీసా వస్తుందా లేదా అనే పరిస్థితిలో చాలా మంది భక్తులు తమకు వీసా కన్ఫర్మ్ అవ్వాలని కోరుకుంటూ చిల్కూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటారు.
ఆధ్మాత్మికతతో పాటు ఆశాకిరణం కూడా
ఇలా ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు చిల్కూరు బాలాజీని దర్శించుకునేందుకు వస్తుంటారు. అందులో చాలా మంది వీసా రావాలనే కోరికతో స్వామివారిని దర్శించుకుంటారు. దీనితో పాటు చదువులు, ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాల కల నెరవేరాలని కూడా కోరుకుంటారు.
Visa Temple : నిజానికి చిల్కూరు ఆలయం అనేది ఒక దేవాలయం మాత్రమే కాదు—it’s చాలా మందికి ఆధ్యాత్మిక ఆశాజ్యోతి కూడా. ఆస్ట్రేలియా, అమెరికా, కెనడాకు వెళ్లాలని కోరుకుని వీసా అప్లై చేసిన చాలా మంది ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని తమకు వీసా ఇవ్వమని ప్రార్థిస్తారు. ఇలా బాలాజీని దర్శించిన చాలా మందికి వీసా వచ్చిందంటారు.

అలా చాలా మంది జీవితాలు మారిందని, కుటుంబ పరిస్థితులు మెరుగయ్యాయని, విద్యార్థులకు ఉన్నత విద్యాభ్యాసం కోసం ఒక మార్గం లభించిందని చెబుతారు.
11 ప్రదక్షిణల సీక్రెట్ | Pradakshinas at Chilkur
చిల్కూరు ఆలయంలో 11 ప్రదక్షిణలు చేస్తే వీసా ఫాస్ట్‌గా వస్తుందని భక్తులు నమ్ముతారు. ఒక వేళ వీసా వస్తే మళ్లీ స్వామిని దర్శించి 108 ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. అందుకే ఈ ఆలయం వీసా టెంపుల్‌గా ఫేమస్ అయింది.
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి
మా వీడియో షార్ట్ చూసారా?
ఈ పోస్టుపై మా చిన్న వీడియోను మీ కోసం క్రింద షేర్ చేస్తున్నాం👇
చిల్కూరు ఆలయం ప్రత్యేకతలు | Speciality of Chilkur Temple
వేలాది మంది భక్తుల ఆధ్యాత్మికతకు, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న చిల్కూరు ఆలయం వీసా దేవాలయం మాత్రమే కాదు—ఎన్నో ఆసక్తికరమైన అంశాలకు కూడా ప్రతీకగా చెప్పవచ్చు.
- చిల్కూరు ఆలయంలో దర్శనానికి టికెట్ వ్యవస్థ లేదు. ఇది ప్రభుత్వ నియంత్రణలో కూడా లేదు. దీనితో పాటు ఇతర అనేక ఆలయాల్లో ఉన్న విధంగా వీఐపీ, వీవీఐపీ ఇతర సులభ దర్శన మార్గాలు, ప్రత్యేక వ్యవస్థలు కూడా ఉండవు. భక్తిగా వచ్చి దర్శించుకుని వెళ్ళడమే.
- స్వామివారి వద్దకు వెళ్లి ఏదైనా మొక్కు కోరుకునే భక్తులు ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారు. కోరిక లేదా మొక్కు నెరవేరిన తరువాత 108 ప్రదక్షిణలు చేస్తారు.
- ఆలయంలో ప్రదక్షిణం చేసే భక్తులకు మంచి విషయాలు, హితబోధనలు చెబుతూ ఆధ్యాత్మిక చైతన్యం పంచుతారు అక్కడి అయ్యగార్లు.
- ఇక చిల్కూరు ఆలయానికి వెళ్లే దారి, ఆలయం ఉన్న పరిసరాలు మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. మనసు ప్రశాంతంగా మారిపోతుంది.
- నాకు పర్సనల్‌గా అయితే ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలు చాలా నచ్చుతాయి. ఇంకా వెళ్లే దారిలో రకరకాల ఆలయాలు, ఇతర విహార స్థలాలు, తోటలు ఇవన్నీ ఒక మెమోరీలా మిగిలిపోతాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.