IRCTC : ఐఆర్సిటిసి అద్భుతమైన టూర్ ప్యాకేజీ.. రూ.18,000కే అయోధ్య, సిమ్లా, రాజస్థాన్ ట్రిప్‌లు
IRCTC : ప్రయాణికులకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఎప్పటికప్పుడు ఆకర్షణీయమైన టూర్ ప్యాకేజీలను అందిస్తోంది. ఈసారి IRCTC అయోధ్య, షిమ్లా, రాజస్థాన్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు కేవలం రూ.18,000 లోపు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలలో రైలు ప్రయాణంతో పాటు స్థానికంగా చూసేందుకు క్యాబ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్యాకేజీల పూర్తి వివరాలను IRCTC అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
శ్రీరామ్ దర్శన్ ప్యాకేజీ
కోల్‌కతా నుండి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ ప్రయాణం 5 రాత్రులు, 6 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో ముఖ్యంగా అయోధ్య, వారణాసి సందర్శన ఉంటుంది. ఆయా ప్రాంతాల్లోని దర్శనీయ స్థలాలను చూసేందుకు క్యాబ్ సౌకర్యం కల్పిస్తారు.
ప్యాకేజీ పేరు: రామ్ మందిర్ దర్శన్ విత్ కన్ఫర్మ్డ్ ట్రైన్ టికెట్
ప్రయాణం: ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం ఉంటుంది.

ధరలు:
ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.16,150
ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.15,750
పిల్లలకు: రూ.5,250
షిమ్లా-కుఫ్రి ప్యాకేజీ
పర్వతాల అందాలను ఆస్వాదించేందుకు ఈ ప్యాకేజీ ఒక మంచి అవకాశం. చండీగఢ్ నుంచి మొదలయ్యే ఈ ప్రయాణం 3 రాత్రులు, 4 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీలో షిమ్లా, హతు మాతా ఆలయం, నార్కండ వంటి ప్రాంతాలను సందర్శిస్తారు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ప్యాకేజీ పేరు: షిమ్లా విత్ హతు టెంపుల్ నార్కండ ఎక్స్ చండీగఢ్
ప్రారంభం: ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 6న ప్రారంభమవుతుంది.
ధరలు:
ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.16,360
ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.15,160
పిల్లలకు: రూ.12,770
రాజస్థాన్ ప్యాకేజీ
చారిత్రక నగరాలు, సుందరమైన లోయలను చూడాలనుకునేవారికి ఈ ప్యాకేజీ అనుకూలంగా ఉంటుంది. జైపూర్ నుంచి ప్రారంభమయ్యే ఈ ప్యాకేజీ 4 రాత్రులు, 5 రోజులు కొనసాగుతుంది. ఈ ప్యాకేజీలో స్థానిక ప్రయాణానికి క్యాబ్ సౌకర్యం ఉంటుంది. జైపూర్, అజ్మీర్, పుష్కర్, ఉదయ్‌పూర్ వంటి ముఖ్యమైన నగరాలను సందర్శించవచ్చు.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
ప్రారంభం: ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 6న మొదలవుతుంది.
ధరలు:
ఇద్దరు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.12,840
ముగ్గురు వ్యక్తులకు ఒక్కొక్కరికి: రూ.11,910
పిల్లలకు: రూ.10,530
ప్యాకేజీ వివరాలు, బుకింగ్
ఈ టూర్ ప్యాకేజీలను సెప్టెంబర్ 15 లోపు బుక్ చేసుకోవాలని IRCTC సూచించింది. మీ ప్రయాణ అవసరాలకు తగ్గట్టుగా ఈ బడ్జెట్-ఫ్రెండ్లీ ప్యాకేజీలు ఎంచుకోవచ్చు. పవిత్ర యాత్రైనా, హిల్ స్టేషన్ టూరైనా లేదా చారిత్రక ప్రదేశాల సందర్శనైనా IRCTC అన్ని రకాల ప్రయాణాలకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. మరింత సమాచారం కోసం IRCTC అధికారిక వెబ్సైట్ లేదా యాప్‌ని సందర్శించి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.