Bus Travel Safety: బస్సు ప్రయాణంలో జాగ్రత్త.. సురక్షితంగా గమ్యాన్ని చేరాలంటే ఈ 8 ముఖ్యమైన టిప్స్ పాటించండి
Bus Travel Safety: ప్రతిరోజూ వేలాది మందికి అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణ సాధనం బస్సు. అయితే, కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల నిర్లక్ష్యం లేదా సాంకేతిక లోపాల వల్ల బస్సు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో బస్సు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండటం, కొన్ని ప్రాథమిక భద్రతా జాగ్రత్తలు (Safety Tips) పాటించడం చాలా అవసరం.
ముఖ్యాంశాలు
ఎలాంటి బస్సును బుక్ చేయాలి ? | Bus Booking Tips
బస్సు ఎక్కే ముందు నుంచి, ప్రయాణం చేస్తున్నప్పుడు, చివరికి ప్రమాదం సంభవించినప్పుడు కూడా ప్రాణాలను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలను వివరంగా తెలుసుకుందాం.
- సురక్షితమైన ప్రయాణం అనేది బస్సు ఎక్కడానికి ముందే ప్రారంభమవుతుంది. ఈ విషయంలో ప్రయాణికులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి.
- ప్రయాణం కోసం అధికారికంగా అనుమతి పొందిన బస్సులను మాత్రమే ఎంచుకోవాలి.
- ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించేటప్పుడు, ఆ బస్సు రిజిస్ట్రేషన్, లైసెన్స్ వివరాలను ఒకసారి తనిఖీ చేయడం మంచిది.
- డ్రైవర్ మత్తులో ఉన్నట్లుగా లేదా అలసటగా కనిపించినట్లయితే, ఆ బస్సులో ప్రయాణాన్ని నివారించండి. డ్రైవర్ ఆరోగ్యంగా, అప్రమత్తంగా ఉన్నప్పుడే ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి: Travel Tips 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలు
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి

బస్సులో చేయకూడని పనులు | Things Not To Do In bus
గ్యాస్ సిలిండర్లు, కెమికల్స్ లేదా ఇతర ప్రమాదకర వస్తువులను లగేజీలో లేదా బస్సులో తీసుకెళ్లకూడదు. కదులుతున్న బస్సు ఎక్కడానికి లేదా దిగడానికి అస్సలు ప్రయత్నించవద్దు.
- బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే దాని వైపు వెళ్లాలి.
- మీ సీటుకు సీటు బెల్ట్ ఉంటే, దాన్ని తప్పకుండా పెట్టుకోండి.
- ముఖ్యంగా లాంగ్ రూట్ ప్రయాణాలకు, సీటు బెల్ట్ వాడకం చాలా అవసరం.
- ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ప్రయాణ సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు
ప్రయాణం సాగుతున్నప్పుడు, ప్రయాణీకులు పాటించాల్సిన కొన్ని మర్యాదలు, జాగ్రత్తలు ఉన్నాయి.
- ఎమర్జెన్సీ ఎగ్జిట్ (Emergency Exit): మీ సీట్లో కూర్చున్న వెంటనే, అత్యవసర ద్వారం ఎక్కడ ఉందో, దాన్ని ఎలా తెరవాలో ముందుగానే తెలుసుకోవాలి.
- డ్రైవర్ దృష్టి మళ్లించవద్దు: సెల్ ఫోన్‌లలో బిగ్గరగా సంగీతం పెట్టుకోవడం లేదా పెద్దగా మాట్లాడటం వంటివి చేయకండి. ఇలాంటివి డ్రైవర్ దృష్టిని మళ్లించి, ప్రమాదానికి కారణం కావచ్చు.
- కిటికీల వద్ద: ప్రయాణ సమయంలో మీ తల, చేతులను కిటికీ వెలుపలికి చాచవద్దు.
- నిలబడి ప్రయాణం: నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తే, మీరు ఏదైనా గట్టిగా పట్టుకుని ఉండాలి. చాలా వేగంగా ప్రయాణిస్తున్నప్పుడు నిలబడటం సురక్షితం కాదు.
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
- నిద్రించేటప్పుడు: రాత్రి సమయాల్లో లైట్లు ఆఫ్ చేసి నిద్రపోయేటప్పుడు, ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే వెంటనే స్పందించడానికి వీలుగా అప్రమత్తంగా ఉండాలి.
- ప్రమాదం జరిగితే వెంటనే ఏం చేయాలి?
దురదృష్టవశాత్తూ, బస్సు ప్రమాదం జరిగినా లేదా మంటలు చెలరేగినా, ఈ చర్యలను పాటించడం ద్వారా ప్రాణాలను రక్షించుకోవచ్చు. - ముఖం కప్పుకోండి: మంటలు చెలరేగితే, వెలువడే విషవాయువులను పీల్చకుండా ఉండటానికి బట్టతో (ఉదా. దుపట్టా, షర్ట్) మీ ముఖాన్ని (ముక్కు, నోరు) వెంటనే కప్పుకోండి.
- బయటకు వెళ్లండి: వెంటనే ఎమర్జెన్సీ విండో లేదా కిటికీ ద్వారా సురక్షితంగా బయటకు వెళ్లడానికి ప్రయత్నించాలి. వీలైనంత త్వరగా వాహనం నుండి దూరంగా వెళ్లిపోవాలి.
- ఇతరులకు సహాయం: మీ వ్యక్తిగత వస్తువుల కోసం చూడకుండా, ముందుగా మీతో పాటు ఇతర తోటి ప్రయాణికులకు (ముఖ్యంగా పిల్లలకు, వృద్ధులకు) బయటకు రావడానికి సహాయం అందించండి.
- అత్యవసర సమాచారం: వీలైనంత త్వరగా పోలీసులకు (100), 108 అంబులెన్స్ సేవలకు ప్రమాదం జరిగిన ప్రదేశం గురించి స్పష్టంగా సమాచారం ఇవ్వాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
