భారతదేశంలో 2025లో తప్పక చూడాల్సిన 7 Best Snow Places | India
7 Best Snow Places : చలికాలం మనం దుప్పట్లో ఎలా దూరిపోతామో…భారీ పర్వతాలు కూడా మంచు దుప్పట్లో అలాగే దూరిపోతాయి. ఇలా మన దేశంలో మంచు దుప్పట్లో దూరిపోయే పర్వతాలను చూడాలి అనుకుంటే మీరు ఎక్కడికి వెళ్లాలో తెలుసుకునేందుకు మీ కోసం పోస్టులో కొన్ని డెస్టినేషన్స్ (Destinations) సూచిస్తున్నాను.
కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్…ఈ రాష్ట్రాల్లో మనం చూడగలిగే ఎంజాయ్ చేయగలిగే సూపర్ వింటర్ వండర్లాండ్ ఇవే.
ముఖ్యాంశాలు
1. గుల్మార్గ్ | Gulmarg, Kashmir
భారత దేశంలోనే అత్యంత బ్యూటిఫుల్ స్నో ప్లే గ్రౌండ్. ఇక్కడ మీరు స్కీయింగ్, కేబుల్ కార్ యాక్టివిటీస్ ఎంజాయ్ చేయవచ్చు.

మొత్తానికి గుల్మార్గ్ అనేది కేవలం మంచుతో నిండిన లోయ మాత్రమే కాదు…ఇది మీరు ఇమాజినేషన్ చేసుకున్న మంచు ప్రపంచంలో ఉంటుంది.
- ఇది కూడా చదవండి : చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే
2.సోన్మార్గ్, Sonmarg, Kashmir
ఇలాంటి మంచు ప్రపంచం ఒకటి ఉంటుంది అని సోన్మార్గ్ వెళ్లేంత వరకు చాలా మందికి తెలియదు.

ఇక్కడి మంచు మైదానాలు, గ్లేషియర్స్, మంచులా మారిన నదులు ఇవన్నీ మీ ట్రిప్‌ని పైసా వసూల్ అయ్యేలా చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాత హిల్ స్టేషన్స్ ఇవే!
3. పహల్గామ్ | Pahalgam
చలి కాలం పహల్గామ్ అనేది చాలా ప్రశాంతంగా అత్యంత అందంగా కనిపిస్తుంది. అండ్ ఈ సమయంలో చాలా తక్కువ మంది వెళ్తారు.

ఇక్కడ మీరు మంచు కట్టిన నదులు, మంచు దుప్పట్లో దూరిపోయిన పర్వతాలను చూస్తే ప్రశాంతంగా ఎంజాయ్ చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : Mini Switzerland : స్విట్జర్లాండ్ వెళ్లే బడ్జెట్ లేదా ? మన దేశంలో 6 మినీ స్విట్జర్లాండ్స్ ఉన్నాయి కదా!
4. మనాలి | Manali, Himachal Pradesh
మన దేశంలో ఉన్న అత్యంత రద్దీ ఉన్న వింటర్ డెస్టినేషన్ ఏదంటే మనాలియే అని చెప్పాలి. ఇక్కడ ఎంత టూరిస్టులు రావడం చూసి డిసెంబర్లో మంచు పడటం మానేసింది.

బట్ కులు, సోలాంగ్ వ్యాలి, రోహ్తాంగ్, సిసు వ్యాలి, స్పితి వ్యాలి వెళ్తే మంచు బాగా కనిపిస్తుంది. బట్ మనాలి కొన్ని సంవత్సరాలు వెళ్లకపోవడమే బెస్టు. చాలా క్రౌడ్ ఉంటోంది ఈ మధ్య.
- ఇది కూడా చదవండి : మనాలి టూర్ ఎలా ప్లాన్ చేయాలి ? | Complete Travel Guide
5. సొలాంగ్ వ్యాలీ | Solang Valley | 7 Best Snow Places
మనాలి నుంచి కూతవేటు దూరంలో ఉన్న సోలాంగ్ వ్యాలీ అనేది యాక్టివిటీస్‌కు కేంద్రం లాంటిది. ఇక్కడ స్నో స్కూటింగ్, సాహసోపైతమైన యాక్టివిటీస్ చేయవచ్చు.

అయితే ఇక్కడికి వెళ్లడానికి ముందు అక్కడ స్నో ఉందో లేదో తెలుసుకోండి.
- ఇది కూడా చదవండి : ఈ 30 యాక్టివిటీస్ చేయకపోతే మనాలి వెళ్లినట్టే కాదు
6. ఓలి | Auli, Uttarakhand
7 Best Snow Places : ఓలి గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే మీరు మంచు ప్రపంచంలో స్కీయింగ్, ట్రెక్కింగ్ వంటి యాక్టివిటీస్ చేయాలి అంటే తప్పకుండా మీరు ఓలి వెళ్లాలి.

బద్రినాథ్ (Badrinath) వెళ్లే దారిలో జ్యోషిమట్ నుంచి మీరు ఓలి వెళ్లవచ్చు. ఇక్కడ హోటల్స్ అండ్ హోమ్‌స్టేస్ చాలా బాగుంటాయి. అక్కడి నుంచి హిమాలయాలను (Himalayas) చూడటం అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్ అని చెప్పవచ్చు.
7. తవాంగ్ | Tawang, Arunachal Pradesh
చైనా బార్డర్‌కు చేరువలో ఉండే తవాంగ్..నేను చూసిన బ్యూటిఫుల్ హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడికి వెళ్తే స్వర్గంలో ఉన్న అనుభూతి కలుగుతుంది.

తవాంగ్‌లో మీరు స్నోఫాల్‌తో పాటు బుద్దిస్ట్ మోనాస్టరీలను కూడా చూడవచ్చు.
- ఇది కూడా చదవండి : నార్త్ ఈస్ట్‌లో టాప్ హనీమూన్ డెస్టినేషన్స్
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
