ఒక్క రోజులో భద్రాచలంలో చూడదగ్గ 7 ప్రదేశాలు | bhadrachalam 7 places in one day
భద్రాచలం వెళ్లాలి అనుకుంటున్నారా? ఒక్క రోజులో భద్రాచలంలో చూడదగ్గ 7 ప్రదేశాలు bhadrachalam 7 places in one day లో మీకు దర్శనం సమయం, పూజా టికెట్ల వివరాలు, 7 తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాలు, క్రౌడ్ రియాలిటీ, బడ్జెట్ లాంటి విషయాలు ఉన్నాయి. షేర్ చేసి బుక్‌మార్క్ చేసుకునే పోస్టు ఇది.
ముఖ్యాంశాలు
భద్రాచలం అంటే చాలా మందికి ఆలయం ఒక్కటే గుర్తుకువస్తుంది. కానీ సరైన ప్లానింగ్ లేకుండా వెళ్తే దర్శనం లైన్లో గంటల సమయం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.
తర్వాత ఫుడ్ & స్టే కన్ఫ్యూజన్, పార్కింగ్ టెన్షన్… ఇవన్నీ కలిసి మీ ట్రిప్ మూడ్‌ను స్పాయిల్ చేస్తాయి.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
అందుకే ఈ పోస్టు పబ్లిష్ చేస్తున్నాను.
ఈ గైడ్ వల్ల మీకు టైమ్ + మనీ సేవ్ అవుతుంది. ప్రశాంతత గ్యారంటీ.
భద్రాచలం చరిత్ర తెలియని తెలుగువాళ్లు ఉండరు కాబట్టి డైరెక్ట్‌గా ట్రావెల్ ప్లాన్‌లోకి వెళ్లిపోదాం.
తెలుసుకోవాల్సిన విషయాలు | Bhadrachalam Quick Facts
ఈ పాయింట్స్‌ను స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు.
- భద్రాచలం ఉన్న రాష్ట్రం: తెలంగాణ
- ఈ ప్రాంతం ఫేమస్ దేనికి: శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం (భద్రాద్రి రామయ్య – జై శ్రీరామ్)
- బెస్ట్ టైమ్: ఉదయం 5:30 AM – 7:00 AM
- ఎప్పుడు వెళ్లాలి: సోమవారం – గురువారం (పండగలు ఉంటే రద్దీ ఉంటుంది)
- ఫ్యామిలీతో వెళ్లొచ్చా: 100% అవును
- పార్కింగ్: ఆలయం దగ్గర లిమిటెడ్ స్పేస్
- ఎక్కడ ఉండాలి: ఆలయ కాటేజీలు, ప్రైవేట్ లాడ్జీలు
ఒక్క రోజులో భద్రాచలంలో చూడదగ్గ 7 ప్రదేశాలు | bhadrachalam 7 places in one day
1. భద్రాద్రి రామయ్య ఆలయం | Bhadrachalam Sri Rama Temple
భద్రాచలం ట్రిప్‌లో రామయ్య దర్శనం మెయిన్ హైలైట్. రోజును శ్రీరామచంద్రుడి దర్శనంతోనే మొదలుపెట్టండి. పొద్దున్నే వెళ్లితే ఆలయ ప్రాంగణం ప్రశాంతంగా ఉంటుంది.

దర్శనం టైమింగ్స్ | Darshan Timings
- 4:30 AM – ఆలయం తెరుచుకుంటుంది
- 5:30 AM – 7:00 AM – నిజరూప దర్శనం
- 8:30 AM – 11:30 AM – సర్వ దర్శనం
- 8:35 AM – 9:30 AM – ప్రత్యేక దర్శనం
- 12:30 PM – 1:00 PM – మధ్యాహ్న దర్శనం
- 3:00 PM – 8:00 PM – సాయంత్ర దర్శనం
- 8:30 PM – 9:00 PM – శయనోత్సవం
జనరల్ దర్శనం ఉచితం. ఫాస్ట్ దర్శనం కావాలంటే ₹50 / ₹100 టికెట్లు కొనవచ్చు.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
దర్శనం టిప్స్ | Darshan Tips
- ఉదయం 6–8 AM మధ్య రష్ తక్కువ
- 9 AM – 1 PM రష్ ఎక్కువ
- సాయంత్రం 6–8 PM మళ్లీ రద్దీ
- వీకెండ్స్‌లో స్పెషల్ దర్శనం టైమ్ సేవ్ చేస్తుంది
2. గోదావరి పుష్కర ఘాట్ | Godavari Pushkara Ghat

దర్శనం తర్వాత ప్రశాంతత కావాలంటే ఇది బెస్ట్ స్పాట్.
ఉదయం మిస్ట్, సాయంత్రం సన్‌సెట్ – రెండూ బావుంటాయి.
- ఎంట్రీ ఫీజు లేదు
- ఉదయం లేదా సాయంత్రం బెస్ట్
- రాళ్లపై జాగ్రత్తగా నడవాలి
- ఆలయం పక్కనే ఉంటుంది
- కొన్ని సీజన్లలో బోట్ రైడ్ ఉంటుంది.
- ఇది కూడా చదవండి : శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
3. అభయాంజనేయ స్వామి ఆలయం | Abhaya Anjaneya Swamy Temple
ప్రధాన ఆలయ రష్ నుంచి కాస్త రిలీఫ్ కావాలంటే ఇది మంచి ఆప్షన్.
ప్రశాంతమైన వాతావరణం, దర్శనం ఫాస్ట్.
- టైమింగ్: 6 AM – 8 PM
- ఎంట్రీ ఫీజు లేదు
- పెద్దవాళ్లతో వెళ్లేవాళ్లకు సూటబుల్
4. పర్నశాల | Parnasala

భద్రాచలం ట్రిప్ పూర్తిగా ఫీల్ కావాలంటే ఇది మస్ట్.
నేచర్ + స్పిరిచువల్ వైబ్ కలిసిన ప్లేస్.
- దూరం: 35 KM (Up & Down)
- మధ్యాహ్నం వెళ్లకండి – వేడి ఎక్కువ
- ఎంట్రీ ఫీజు:
- పిల్లలు: ₹5–10
- పెద్దలు: ₹10–20
- పెయిడ్ పార్కింగ్ ఉంది
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
5. కిన్నెరసాని అభయారణ్యం | Kinnerasani Wildlife Sanctuary
టెంపుల్ ట్రిప్ మధ్యలో ఒక నేచర్ బ్రేక్.
పిల్లలకు, నేచర్ లవర్స్‌కు నచ్చుతుంది.
- సోమవారం మూసి ఉంటుంది
- ఎంట్రీ ఫీజు:
- పెద్దలు: ₹20–30
- పిల్లలు: ₹10
- కెమెరా: ₹50
- వెహికల్: ₹50 / ₹100
- మార్నింగ్ వెళ్లడం బెస్ట్
- ఇది కూడా చదవండి : బద్రినాథ్ ఆలయం సమీపంలో ఉన్న 6 సందర్శనీయ స్థలాలు
6. భద్రాచలం లోకల్ మార్కెట్ | Bhadrachalam Local Market
ఫుడ్, షాపింగ్, లోకల్ వైబ్ – అన్నీ ఒకే చోట.
సింపుల్ కానీ మెమరబుల్.
- టైమింగ్: 9 AM – 9 PM
- పూజా ఐటమ్స్, స్వీట్స్ దొరుకుతాయి
- సాయంత్రం బార్గెయిన్ ఛాన్స్ ఎక్కువ
7. పాపికొండలు వ్యూ పాయింట్ | Papikondalu View Point (Nearby)
పాపికొండలు టూర్ ఫుల్‌గా చేయాలంటే ఒక రోజు అవసరం. ఒక్కరోజులో అయితే వ్యూ పాయింట్ వరకే వెళ్లాలి. అది కుదరదు అనిపిస్తే మీకోసం ఒక ప్రత్యామ్నాయం…
గోదావరి రివర్ వ్యూ పాయింట్ – ఆలయం వెనకే ఉంటుంది, ఫ్రీ.
- ఇది కూడా చదవండి : కుమార స్వామి వివాహం జరిగిన దివ్య క్షేత్రం ఏదో తెలుసా? | Thiruparankundram Travel Guide
డే ప్లాన్ | Bhadrachalam 1 Day Trip Plan
- 5:00 AM – భద్రాచలం చేరుకోండి
- 5:30 – 7:00 AM – దర్శనం
- 7:00 – 7:30 AM – గోదావరి ఘాట్
- 7:45 – 8:15 AM – అభయాంజనేయ ఆలయం
- 8:30 – 9:30 AM – బ్రేక్‌ఫాస్ట్
- 10:00 AM – 1:30 PM – పర్నశాల
- 2:30 – 4:00 PM – కిన్నెరసాని
- 5:00 – 6:30 PM – లోకల్ మార్కెట్
- 6:30 – 7:00 PM – గోదావరి వ్యూ పాయింట్
అన్నీ కవర్ చేయకపోయినా 3–4 ప్లేసెస్ ప్రశాంతంగా చూసినా సరిపోతుంది.
ఎక్కడ ఉండాలి | Hotels in Bhadrachalam
- ఆలయ / ప్రభుత్వ కాటేజీలు: ₹800 – ₹1100
- ప్రైవేట్ లాడ్జీలు: ₹800 – ₹1500
- పండగల సమయంలో అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి
రూమ్ అవసరం లేదు అంటే…
- 2–4 గంటల ఫ్రెష్-అప్ రూమ్స్: ₹200 – ₹400
- పెయిడ్ బాత్రూమ్స్: ₹20 – ₹50
- Cloakroom / Luggage Counter: ₹20 – ₹30
- ఇది కూడా చదవండి : మన దేశంలో ఈ 5 ఆలయాలు దర్శనం చేసుకోవాంటే లక్కుండాలి
ఎలా చేరుకోవాలి | How to Reach Bhadrachalam
రోడ్ ద్వారా
- హైదరాబాద్ నుంచి: 310 KM
- సమయం: 8–11 గంటలు
ట్రైన్ ద్వారా
- భద్రాచలం రోడ్ స్టేషన్ (కొత్తగూడెం)
పార్కింగ్ టిప్స్
- ఆలయం దగ్గర లిమిటెడ్ స్పేస్
- పెయిడ్ పార్కింగ్ బెస్ట్
- పొద్దున్నే వెళ్లితే ఛాన్స్ ఎక్కువ
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
చేయాల్సివిన చేయకూడనివి | Temple Rules
- ఆహారం లోపలికి అనుమతి లేదు
- చిన్న వాటర్ బాటిల్ తీసుకెళ్లండి
- పెద్ద బ్యాగులు అనుమతి లేదు
- సీనియర్ సిటిజన్స్‌కు వీల్‌చైర్ ఉంది
భోజనం, వసతి | Food & Annadanam
- ప్రతిరోజూ అన్నదానం
- బయట హోటల్స్‌లో ₹50–150 లో మీల్స్
- మధ్యాహ్నం రష్ ఎక్కువ
తరచూ అడిగే ప్రశ్నలు | Bhadrachalam FAQs
- దర్శనానికి ఎంత టైమ్ పడుతుంది?
→ ఉదయం 30–60 నిమిషాలు, వీకెండ్స్‌లో 2–3 గంటలు - స్పెషల్ దర్శనం అవసరమా?
→ టైమ్ సేవ్ కావాలంటే అవును - ఒక్కరోజులో అన్నీ కవర్ అవుతాయా?
→ ప్లాన్ ఉంటే 5–6, ఫుల్ ఎనర్జీతో 7 కూడా - ఉచిత దర్శనం ఉందా?
→ ఉంది - పార్కింగ్ చార్జీలు ఎంత?
→ ₹30 – ₹100 - ఇది కూడా చదవండి : Pahalgam : పరమ శివుడు నందిని వదిలిన ప్రాంతానికి పహల్గాం అని పేరు ఎలా వచ్చింది ?
చివరగా…
ఈ bhadrachalam 7 places in one day ను ఫాలో అయితే మీ భద్రాచలం ట్రిప్ స్మూత్ & ప్రశాంతంగా ఉంటుంది.
- ఫ్రెండ్స్, ఫ్యామిలీతో షేర్ చేయండి.
- బుక్‌మార్క్ / సేవ్ చేసుకోండి
- నెక్ట్స్ ఏ డెస్టినేషన్ కావాలో చెప్పండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
