పహల్గాం (Pahalgam), కశ్మీరుకు తలమానీకం అని పిలిచే ఈ ప్రాంతం ఉగ్రవాదుల దాడితో రక్తమోడింది. ఈ దాడిని యాక్ట్ ఆఫ్ వార్ (Act Of War) గా భావించాల్సిందే. ఉగ్రవాదులకు తండ్రి లాంటి దేశం పాకిస్తాన్. మరి పాకిస్తాన్ పుట్టుకకు కారణం అయిన భారత దేశం దారి తప్పిన తన బిడ్డను లైన్‌లో పెట్టాల్సిన టైమ్ వచ్చింది. అయ్యకు ఆగ్రహం వస్తే కొడుకు బతుకేం అవుతుందో చూపించాల్సిన టైమ్ ఇది.
ముఖ్యాంశాలు
వడ్డీతో సహా తిరిగిచ్చేయాలి
పహల్గాం ఘటనతో పాకిస్తాన్ (Pakistan) పాపాల కుండ నిండిపోయింది. ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన అమాయకులైన పర్యాటకులపై అమానుషంగా దాడి చేసి ప్రాణం తీసేలా ఉగ్రవాదులను పెంచి, ప్రేరేపించి, ట్రైనింగ్ ఇచ్చిన పాకిస్తాన్‌కు భారత్ వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుంది.
ఉగ్రవాదుల పిరికి చర్యతో భూమిపై స్వర్గంగా భావించే కశ్మీరులో.. అందులోనూ మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్గాంలోని బైసారన్ వ్యాలీ (Baisaran Valley) కి ఇకపై మీరైనా, నేనైనా వెళ్లడానికి ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తామేమో. ఒక మనిషిగా ఈ భయం సాధారణం. కానీ ఇప్పుడు భయపడే టైమ్ పాకిస్తాన్‌ది.
- ఇది కూడా చదవండి : జమ్మూ అండ్ కశ్మీర్‌కు ఆ పేర్లు ఎలా వచ్చాయి ? భారత దేశ సంస్కృతిలో ప్రాధాన్యత ఏంటి ? | Jammu and Kashmir
రక్త చరిత్రకు ముందు | Pahalgam
ఈ రక్త చరిత్రకు ముందు పహల్గాం కథ ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకుందాం. చూడ్డానికి అందంగా ఉండే ఈ ప్రాంతానికి ఉన్న హిస్టరీ, దాని పేరు వెనక ఉన్న కథ తెలుసుకుంటే టూరిస్టులు రిస్కు చేసి మరీ ఎందుకు వెళ్లేవారో మీకు అర్థం అవుతుంది.
పహల్గాం పేరు వెనక ఉన్న కథ | The Etymology of Pahalgam
పహల్గాం అనే పేరు కశ్మీరీ భాషకు (Kashmiri Language) చెందినది.
- ఈ పహల్ లేదా పుహేల్ అంటే గొర్రెల కాపరులు (Shepherd) అని అర్థం వస్తుంది.
- ఇక గామ్ అంటే గ్రామం అని మీనింగ్.
- ఈ రెండూ కలిపితే గొర్రెల కాపరుల గ్రామం అని అర్థం వస్తుంది.
చుట్టుపక్కని గ్రామాలు, పట్టణాల నుంచి గుజ్జర్లు (Gujjars), బకర్వాల్ (Bakarwals) వర్గానికి చెందిన ప్రజలు తమ గొర్రెల మందను ఇక్కడి గడ్డి మైదానానికి మేతకు తీసుకువచ్చేవారు. కొన్ని రోజులు, నెలల పాటు ఇక్కడే ఉండే వారు.
తరువాత చలికాలం మంచు కురిసే సమయంలో తిరిగి లోయలోకి వెళ్లిపోయేవారు. అలా ఈ ప్రాంతానికి గొర్రెలకాపరులు గ్రామం పేరుతో పహల్గాం అని పేరు వచ్చింది.
శివుడి నడిచిన దారిలో… | Mythological, Cultural Significance

గొర్రెల కాపరుల కథకు ముందు కొన్ని వేళ సంవత్సరాల క్రితం నాటి ఒక వృత్తాంతం తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పార్వతీ (Goddess Parvati) మాతకు అమరత్వ రహస్యం గురించి చెప్పేందుకు… మహాశివుడు (Lord Shiva) అమర్‌నాథ్ గుహల వద్దకు ఇదే దారిలో వెళ్లారట.
పహల్గాం చేరుకున్నాక నందీశ్వరుడిని ఇక్కడ ఉండమని చెప్పి తన ప్రయాణాన్ని కొనసాగించారట.
అందుకే ఈ ప్రాంతాన్ని బెయిగావ్ (Bail Gaon) అంటే నందిగ్రామం అని పిలుస్తుంటారు. దాంతో పాటు భోళాశంకరుడు నడిచి వెళ్లిన దారి కాబట్టి దీన్ని అమర్‌నాథ్ ద్వారం (Gateway Of Amarnath) అని కూడా పిలుస్తుంటారు.
టూరిస్ట్ స్పాట్‌గా…
ఒకప్పుడు ఈ ప్రాంతం పశువుల కాపరులతో, మేత మేస్తున్న పశువులతో నిండి ఉండేది. కానీ తరువాత కాలంలో ఇది ఒక టూరిస్టు స్పాట్‌గా మారిపోయింది. ప్రతీ ఏడాది జరిగే అమర్‌నాథ్ యాత్రకు (Amarnath Yatra) భక్తుల్లో చాలా మంది ఈ మార్గంలోనే వెళ్తుంటారు.
పహల్గాం నుంచి అమర్‌నాథ్ (Pahalgam to Amarnath) గుహాలయానికి సుమారు 48 కిమి దూరం ఉంటుంది. ఈ దారి మొత్తం దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, మంచు పర్వతాలతో నిండి ఉంటుంది.
ప్రముఖ పర్యాటక క్షేత్రాలు | Places In Pahalgam
ఇటీవలే జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తరువాత పహల్గాం లేదా జమ్మూ కశ్మీరుకు వెళ్లేందుకు చాలా మంది భయపడుతున్నారు. “పహల్గాం నిజంగా చాలా అందమైన ప్రాంతం. కానీ ప్రాణాలు పణంగా పెట్టి కశ్మీరుకు వెళ్లాల్సిన అవసరం లేదు” అని స్నాప్ డీల్ కో ఫౌండర్ కునాల్ బల్ (Kunal Bahl) ట్వీట్ చేశారు.
పహల్గాంకు నేను వెళ్లలేదు కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్లండి లేదా వెళ్లకండి అని చెప్పే అధికారం నాకు లేదు. కానీ కునాల్ లాంటి ఒక తెలివైన వ్యాపారి ఉచిత సలహా ఇచ్చినప్పుడు దాన్ని మనం లటుక్కుమని తీసుకుని పటుక్కున పాటిస్తే బెటర్.
- బీహార్‌లో దోపిడి దొంగలతో జాగ్రత్తగా ఉండాలి. నా ట్రావెల్ ప్లాన్‌లో ఈ స్టేట్ పేరు లేనేలేదు.
- ఢిల్లీలో రోడ్డుపై జాగ్రత్తగా నడవాలి. కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి.
- ఓల్డ్ డిల్లీ (Old Delhi) లో ఎదురుగా వచ్చి మనకు డ్యాష్ ఇచ్చే అమ్మాయిలు ఉంటారు. వాళ్లే గుద్ది వాళ్లే అరుస్తారు. పోలిస్ కంప్లెయింట్ ఇస్తానంటారు. బ్లాక్ మెయిల్ చేసి డబ్బు తీసుకుని వెళ్లిపోతారు. 10 నిమిషాల్లో వేలకు వేలు సంపాదిస్తారు.
- మరీ ముఖ్యంగా హజ్రత్ నిజాముద్దిన్ రైల్వే స్టేషన్ (Hazrat Nizamuddin Railway Station) వద్ద ఇంకా జాగ్రతగా ఉండాలి
- నోయిడాలో కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి. రోడ్డుపై ఎట్టిపరిస్థితిలో నడవకూడదు. కార్లు డ్యాష్ ఇచ్చి క్షణాల్లో వెళ్లిపోతాయి.
గుర్‌గావ్‌లో (Gurgaon) పనీ పాట లేకుండా తిరిగే పెద్దింటి ముద్దు బిడ్డలతో దూరంగా ఉండాలి. రాత్రి 9 తరువాత బయటికి వెళ్లకపోవడం బెటర్.
ఇలా కొన్ని నగరాల గురించి సొంత అనుభవాలతో నేను కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. సో ఈ ప్రాంతాలకు వెళ్లినప్పుడు మరింత కేర్‌ఫుల్‌గా ఉంటాను. ఇక్కడ మనం డబ్బు, పర్సు, ఫోను ఇస్తేనో లేదా సారీ భాయ్ సాబ్ అని అంటేనో నడిచిపోతది. నాలుగు దెబ్బలు కొట్టడమో..నాలుగు తన్నులు తినడమో చేసి బయటపడొచ్చు.
కానీ కశ్మీరులో ఉగ్రవాదులు ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేసి వెళ్లిపోతారో తెలియదు. ఇక్కడ మనం ఎంత జాగ్రతలు తీసుకున్నా నెక్ట్స్ మూమెంట్ ఏం జరుగుతుందో చెప్పలేము. క్షణాల్లో దారుణం జరిగే అవకాశం ఉన్నప్పుడు అంత రిస్కు చేసి కశ్మీరుకు వెళ్లాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి.
అయితే పహల్గాంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాల గురించి చెప్పడం ప్రయాణికుడిగా నా బాధ్యత అని భావిస్తున్నాను. జస్ట్ ఐడియా కోసం చదవండి…
బైసారన్ లోయ (Baisaran Valley): ఈ ప్రాంతాన్ని మిని స్విట్జర్లాండ్ (Mini Switzerland) అని కూడా పిలుస్తారు. ఇక్కడ గడ్డిమైదానాలు, దూరంగా కనిపించే కొండలు ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని స్వర్గంలా కనిపించేలా చేస్తాయి. అందుకే చాలా మంది పర్యాటకులు వాహనాల్లో వెళ్లే అవకాశం లేకున్నా గుర్రాలు, పల్లకి ఎక్కి, నడచుకుంటూ ఇక్కడికి వెళ్లారు.
కష్టాల నుంచి దూరంగా ప్రశాంతత కోసం వచ్చిన పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవికంగా దాడి చేసి అమాయకులను పొట్టన పెట్టుకున్నారు.
మామ్లేశ్వర్ ఆలయం (Mamleshwar Temple) : కొన్ని శతాబ్దాల నుంచి మహా శివుడి భక్తులు ఈ ఆలయానికి వెళ్తుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు.
బేతాబ్ వ్యాలీ ( Betaab Valley) : 1983 లో విడుదలైన బేతాబ్ అనే ఒక హిందీ సినిమా తరువాత ఈ లోయకు వెళ్లే పర్యాటకుల సంఖ్య బాగా పెరిగింది.
లిడ్డర్ నది (Lidder River) : ఒక నది పర్వతాలను కోసుకుంటూ వెళ్లి లోయను క్రియేట్ చేస్తుంది. లిడ్డర్ నదీ కూడా అలాగే లోయల్లోంచి దూకుకుంటూ వెళ్తుంటుంది. అది చూసేందుకు చాలా మంది టూరిస్టులు ఇక్కడికి వెళ్తుంటారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.