48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు
48 గంటల North East ట్రైన్ జర్నీ అనేది ఎంత కష్టమైనదో తెలిపే Nampally నుంచి Guwahati వరకు నిజమైన ట్రావెల్ అనుభవం.
8 AM – Day 1– 48 గంటలు ట్రైన్లోనే గడిపిన తర్వాత North East ట్రిప్ అంత వర్తా ? Telangana నుంచి Assam వరకు Via Odisha, West Bengal ప్రయాణంలో నిజాయితీగా చెప్పిన ట్రావెల్ రియాలిటీ.
నాంపల్లి రైల్వే స్టేషన్ (Nampally Railway Station)
నార్త్ ఈస్ట్ చాలా అందమైంది. Google లో Arunachal Pradesh లోని Tawang Monastery ఫోటోలు చూసి వెళ్లాలనే ఫీలింగ్, వెళ్లాల్సిందే అనే ఒక ఇమోషన్గా మారిపోయింది.

నాంపల్లి స్టేషన్ నుంచి ప్రయాణం ప్రారంభించాడు మీ ప్రయాణీకుడు.
ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో (Namappally Station) ఉన్నాం. నా సలహా ఏంటంటే మీరు 48 గంటలు ప్రయాణం కష్టం అని భావిస్తే ఫ్లైట్‌లో కూడా వెళ్లవచ్చు. కానీ నేను మాత్రం ప్యూర్ రైల్వే ట్రావేల అనుభవం కోసం ఈ ప్రయాణం స్టార్ట్ చేశాను.
ముందుగా నాంపల్లి స్టేషన్ నుంచి కలకత్తాలోని Shalimar Railway Station కు వెళ్లాలి. 1588 KM. మొదటి రోజు మార్నింగ్ 8 AM కి ట్రైన్ ఎక్కితే అక్కడికి చేరుకునే వరకు రెండవ రోజు మధ్యాహ్నం 2.40 PM అవుతుంది.
- రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు | Indian Railways New Luggage Rules
ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే Shalimar Station లో దిగి వెంటనే 7 KM దూరంలో ఉన్న Howrah Junction కి వెళ్లాలి. ఎందుకంటే 3.55 PM కి అక్కడి నుంచి Guwahati ట్రైన్ క్యాచ్ చేయాలి. అది నెక్ట్స్ డే మార్నింగ్ 10 AM కి మనల్ని గౌహతీలో దింపేస్తుంది. కలకత్తా నుంచి గౌహతీకి 1020 KM, సుమారు 18 గంటల జర్నీ. అంతే, మొత్తం కలిసి నాంపల్లి నుంచి కలకత్తాకు 30 గంటలు, కలకత్తా నుంచి గౌహతీకి 18 గంటలు. మొత్తం 48 గంటలు అంటే రెండు రోజులు ట్రైన్లోనే తిండి, స్నానం అన్నమాట.
ఇంత లెంగ్తీ కథ ఎందుకంటే మీరు నార్త్ ఈస్ట్ ప్లాన్ చేస్తే కనీసం కలకత్తా వరకు అయినా విమానం ప్లాన్ చేసుకోండి. గౌహతీలో కూడా ఎయిర్పోర్ట్ ఉంది. అక్కడికి కూడా వెళ్లొచ్చు.
Day 1 –9.33 AM
యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)
48 గంటల ప్రయాణంలో ఇబ్బందుల గురించి చెప్పాను కదా. ఈ జర్నీలో మంచి సీన్స్ కనిపించాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న Bhuvanagiri Fort చూసి ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. ఒకవైపు నుంచి పడుకున్న ఏనుగులా, మరోవైపు నుంచి తాబేలులా కనిపిస్తుంది ఈ కొండ.
10వ శతాబ్దంలో ఈ కోటను కట్టారంటారు. ఇంకొంత మంది అయితే 3000 ఏళ్ల నుంచి ఈ కోట ఉంది అంటారు. కొంత మంది Chalukyas కట్టారంటారు, ఇంకొంత మంది మరెవరో కట్టారంటారు.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
తెలంగాణలో సాధారణ కల్లు గీత కుటుంబంలో పుట్టిన Sarwai Papanna, 1708 లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తరువాత తన వద్ద ఉన్న సంపదని కొండ అంతర్భాగంలో ఉన్న Kalika Matha Temple లో దాచి ఉంచాడని అంటుంటారు. ఈ కోట గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
(Sarwai Papanna Images)
12.03 PM
వరంగల్, తెలంగాణ (Warangal, Telangana)
అలాగే నాకు వరంగల్ దగ్గర ఈ అందమైన చెరువు కనిపించింది. చాలా పెద్దగా ఉంది. మీకెవరికైనా దీని పేరు తెలిస్తే చెప్పండి. జ్ఞానం పెంచుకుంటాను.
జ్ఞానం టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాలి. నేను Tawang Monastery కి వెళ్లాలనుకుంటున్నా. మానస్టరీ అంటే బౌద్ధ మతాన్ని అభ్యసించే సన్యాసులు నివసించే చోటు. అక్కడ ప్రార్థనలు, పూజలు చేస్తుంటారు. హింసకు దూరంగా, సంతోషానికి చేరువగా ఉంటారు. మనకేమన్నా మంచి విషయాలు చెబుతారేమో నా ఆశ.
- ఇది కూడా చదవండి :“యూకే, భారత్ నుంచి నేర్చుకో”… ట్రైన్లో ఫుడ్ డిలివరీ..యూరోపియన్ ట్రావెల్ వ్లాగర్ | On-Train Food Delivery
నాలెడ్జ్ గూగుల్‌లో కూడా దొరుకుతుంది. కానీ Wisdom అన్ని చోట్ల దొరకదు. నాలెడ్జ్ & విస్డమ్ మధ్య తేడా సింపుల్‌గా చెబుతాను. టమాటో అనేది బేసిగ్గా ఒక ఫ్రూట్. ఇది నాలెడ్జ్. ఫ్రూట్ అని తెలిసినా దాన్ని ఫ్రూట్ సలాడ్‌లో వాడం. అది విస్డమ్. దాన్ని కూర చేసుకుని తింటాం. అది రియాలిటీ.
5.45 PM
రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్ (Rajahmundry, Andhra Pradesh)
ఇక వీడియోలో మీరు చూస్తున్నది రాజమండ్రిలోని 120 సంవత్సరాల నాటి Havelock Bridge. గోదావరి మీద ఉన్న ఈ బ్రిడ్జ్ ఒకప్పుడు చాలా బిజీగా ఉండేది. మద్రాస్, కలకత్తాను కలిపే బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఈ బ్రిడ్జ్ గురించి మీకు తెలిసిన విషయాలు కామెంట్ చేయండి.
Click on the Image and Watch

Day 2
9.53 AM
బాలాసోర్, ఒడిశా (Balasore, Odisha)
చీకటిని ఆహ్వానిస్తూ గుడ్ నైట్ చెప్పేసాం. పొద్దున లేచేసరికి ఒడిశా క్యాపిటల్ Bhubaneswar చేరుకున్నాం. స్టేషన్లో ఏదో తినేసి నేచర్ ఎంజాయ్ చేస్తుండగానే బాలాసోర్ స్టేషన్ చేరుకున్నాం. 2023 జూన్ లో జరిగిన భారీ రైలు ప్రమాదం ఈ స్టేషన్ దగ్గరే జరిగింది. పట్టాలు తప్పిన బోగీలను కవర్లతో కప్పి ఉంచడం చూశాం. కానీ రికార్డు చేసే టైమ్ దొరకలేదు.
- ఇది కూడా చదవండి :భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge
1.20 PM
బగ్నాన్, వెస్ట్ బెంగాల్ (Bagnan, West Bengal)
సెకండ్ డే మధ్యాహ్నం మేము వెస్ట్ బెంగాల్‌లోని బగ్నాన్ జిల్లాకు చేరుకున్నాం. మొత్తం బెంగాల్ నాకు ఒక Water World లా కనిపించింది. ప్రతీ ఊరిలో చిన్న చిన్న పాండ్స్ ఉన్నాయి.
2.15 PM
హౌరా, వెస్ట్ బెంగాల్ (Howrah, West Bengal)
Shalimar లో ట్రైన్ దిగి వెంటనే మెట్రో ఎక్కి Howrah వైపు బయల్దేరాం. Shalimar నుంచి Howrah 6 KM. Howrah చాలా పెద్ద రైల్వే స్టేషన్. రోజూ ఎన్నో రైళ్లు వస్తూ పోతుంటాయి. స్టేషన్ అంత పెద్దగా ఉండడంతో కొంత కన్ఫ్యూజ్ అయ్యాం. Howrah Station ప్రాధాన్యత గురించి మరో వీడియోలో వివరిస్తాను.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు | 10 Facts About Bhakra Nangal Train
స్టేషన్‌లోని రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసి వాష్‌రూమ్‌లో ఫ్రెష్ అయ్యాం. బిర్యానీ లాంటి బిర్యానీ తిని ఇంకా టైమ్ ఉండడంతో బయట టీ తాగాం.
4 PM
హౌరా నుంచి గౌహతీ (Howrah to Guwahati – Saraighat Express)
హౌరా నుంచి గౌహతీకి వెళ్లే Saraighat Express ఎక్కాం. గంట పాటు ప్లాట్‌ఫామ్ మీదే నిలబెట్టాడు. జులై అయినా కలకత్తాలో వేడి మామూలుగా లేదు. చివరకు 5 PM కి ట్రైన్ బయల్దేరింది.
7.20 PM
బోల్పూర్, వెస్ట్ బెంగాల్ (Bolpur – Shantiniketan)
రాత్రి 7.20 PM కి Bolpur Station చేరుకున్నాం. దీనిని Bolpur Shantiniketan Railway Station అని కూడా అంటారు. రెండు నిమిషాల స్టాప్ ఉన్నా వీడియో తీశాను. రిస్క్ లేకపోతే కిక్ లేదు కదా.
ఈ స్టేషన్ స్పెషాలిటీ ఏంటంటే భారత జాతీయ గీత రచయిత Rabindranath Tagore ఏర్పాటు చేసిన Shantiniketan ఇక్కడే ఉంది. ఇప్పుడు దీనిని Visva-Bharati University అంటారు. దగ్గర్లో Geetanjali Railway Museum కూడా ఉంది.
Day 3 | North East
అస్సాం (Assam)
8.25 AM Good Morning. అస్సాంలోకి వచ్చేశాం. ఫస్ట్ ఇంప్రెషన్ బాగుంది. ఎత్తైన కొండలు ఉంటాయనుకుంటే ఫ్లాట్ ల్యాండ్ కనిపించింది. మంచి గ్రీనరీ ఉంది. పెంకుటిల్లే ఎక్కువగా కనిపించాయి.
10 AM
గౌహతీ, అస్సాం (Guwahati, Assam) | North East
Gateway of North East అయిన గౌహతీకి చేరుకున్నాం. సిటీ వేడిగా ఉంది. ముందే బుక్ చేసుకున్న హాస్టల్లో దిగి రెస్ట్ తీసుకున్నాం. 48 గంటల ప్రయాణం తర్వాత అవసరమైనంత రెస్ట్ తీసుకున్నాం. తరువాత బ్రహ్మపుత్ర నదిలో బోటింగ్‌కి వెళ్లాం. దానికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది.
నిజానికి ఇంత పెద్ద ట్రైన్ జర్నీ అవసరం లేదు. గౌహతీ వస్తే ఫ్లైట్ ప్లాన్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
