Winter Travel Tips : చలికాలం ప్రయాణం..ఇలా అవ్వాలి సిద్ధం | Travel Tip 42
Winter Travel Tips : చలికాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారిలో చాలా మందికి ఎలా సిద్ధం అవ్వాలో అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ విషయాలపై ఫోకస్ చేస్తే మీ ప్రయాణం సాఫీగా, ఎంజాయబుల్‌గా సాగుతుంది.
ఇతర సీజన్లతో పోల్చితే చలికాలంలో ప్రయాణాలు ఎక్కువగానే ఉంటాయి. ఎండా, వానలు లేని ఈ సీజన్లో పర్యాటక ప్రాంతాలు సందర్శకులతో కిటకిటలాడుతాయి.
అయితే చలికాలంలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నవారిలో చాలా మందికి ఎలా సిద్ధం అవ్వాలో అనే విషయంలో కాస్త కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ కొన్ని సింపుల్ విషయాలపై ఫోకస్ చేస్తే మీ ప్రయాణం సాఫీగా, ఎంజాయబుల్‌గా సాగుతుంది.
దుస్తువులను ఇలా ప్యాక్ చేసుకోండి | Winter Travel Tips
Layering In Winter : చలికాలంలో దుస్తువులు ధరించడం అనేది కళ. అయితే వాటిని ఎలా వేసుకోవాలో తెలుసుకోవడం అనేది ట్యాలెంట్.
- చలికాలంలో దుస్తువులను లేయరింగ్ విధానంలో ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
- ఒక లావు జాకెట్ కంటే 2–3 లేయర్స్ మెరుగైనవి.
- టీ-షర్ట్ లేదా థర్మర్, దాని మీద విండ్చీటర్ లేదా ఫ్లీస్ వేసుకుని మేనేజ్ చేయవచ్చు.
ఇంకా చలి ఎక్కువగా అనిపిస్తే హెవీ జాకెట్ లేదా లాంగ్ కోట్స్ వేసుకోవ్చు.ఇలా చేస్తే బయట ఉష్ణోగ్రతను బట్టి డ్రెస్సింగ్‌ను సులభంగా మేనేజ్ చేసుకోవచ్చు.
వీటిని మిస్ చేసుకోవచ్చు | Winter Packing
మఫ్లర్, చేతి తొడుగులు లాంటి చిన్న యాక్సెసరీస్‌ను అస్సలు మిస్ చేయకండి. చలి ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు థర్మల్ వేర్ తీసుకెళ్లడం కూడా చాలా అవసరం.
- అలాగే ఒక వార్మ్ వాటర్ బాటిల్లోని వేడి నీటితో ఉంటే శరీర ఉష్ణోగ్రతను కాపాడుకోవచ్చు.
- దీంతో పాటు ఒక వీలైతే ఒక కెటిల్ తీసుకెళ్లండి. దీని వల్ల మీకు అవకాశం ఉన్నప్పుడు వేడి నీళ్లు సిద్ధం చేసుకోవచ్చు.
- ఈ కెటిల్లో టీ, కాఫీ, నూడిల్స్ లాంటివి చేసుకోవచ్చు.
- అయితే ట్రైనులో ఎట్టిపరిస్థితిలో కెటిల్ లాంటివి వినియోగించడం చేయకండి. ఇది నేరం కూడా
ఫాస్ట్ ఎనర్జీ కోసం | Quick Energy Snacks
బ్యాగ్‌లో డ్రై ఫ్రూట్స్, చాకొలెట్స్ లాంటి వెంటనే శక్తిని ఇచ్చే చిరుతిళ్లు ఉంచుకోవడం మంచిది. ఇవి చలికాలం ప్రయాణాల్లో నిజంగా లైఫ్ సేవర్స్లా పనిచేస్తాయి.
చిరుతిళ్లు అని ప్యాకేజ్డ్ చిప్ప్ లాంటివి కాకుండా ఎనర్జీ బార్స్, బాయిల్డ్ ఎగ్స్ (రెండు మూడు గంటల ప్రయాణం అయితే) ఇలా ప్లాన్ చేసుకోండి.
చిన్న ప్లానింగ్, కరెక్ట్ ప్యాకింగ్ ఉంటే చలికాలంలో ఒత్తిడి లేకుండా ప్రయాణాలను ఫుల్‌గా ఎంజాయ్ చేయవచ్చు. ఈ Winter Travel Tips మీకు ఉపయోగపడితే షేర్ చేయండి.
- మరిన్ని ట్రావెల్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
