Medaram Rare Video : 30 ఏళ్ల క్రితం మేడారం జాతర ఎలా జరిగేదో చూపించే అరుదైన వీడియో

Medaram Rare Video : ఈ వీడియో ఒక ప్రయాణం లాంటిది. 1996 సంవత్సరంలో రికార్డు చేసిన మేడారం జాతర రోడ్-లెవల్ ఫుటేజ్ ఇది.

ఇప్పుడు దొరకడం చాలా కష్టమైన ఈ విజువల్స్, తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం జాతర ఒకప్పుడు ఎలా జరిగేదో ఈ వీడియోలో చూడవచ్చు.

సమ్మక్క సారాలమ్మ మేడారం జాతర ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఆసియాలో అతిపెద్ద గిరిజన జాతరల్లో (Biggest Tribal Mela) ఇది కూడా ఒకటి అని చెబుతారు. కుంభమేళా తరువాత మన దేశంలో అతిపెద్ద గిరిజన మేళా ఇదేనని అంటారు.

అయితే 30 ఏళ్ల క్రితం ఈ మేడారంలో సందడి ఎలా ఉండేది? భక్తులు ఎలా వచ్చేవారు? ఎలాంటి బస్సుల్లో వచ్చేవారు? గద్దెలు, ఆలయ ప్రాంగణం ఎలా ఉండేదో ఈ వీడియోలో మీరు చూడవచ్చు.

అడవి మార్గాల్లో భక్తుల నడక, భక్తుల రద్దీ అన్నీ నేచురల్‌గా కనిపిస్తాయి. భక్తులు సమ్మక్క, సారాలమ్మ తల్లులకు తమ మొక్కులు చెప్పుకోవడం, బంగారం అంటే బెల్లం సమర్పించడం, జంపన్న వాగులో స్నానం చేసి మేడారం వైపు కదలడం కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

ఈ వీడియోను టేప్ కెమెరాలో రికార్డు చేసి తరువాత డిజిటల్‌గా సంరక్షించారు. ఆధునిక సాంకేతికత లేకుండా క్యాప్చర్ అయిన ఈ విజువల్స్‌లో గిరిజన జీవనం, భక్తి, జాతర ఆత్మ నిజంగా కనిపిస్తుంది. చరిత్ర, సంస్కృతి, డాక్యుమెంటేషన్ కోసం ఇది ఒక విలువైన రికార్డు.

ఈ వీడియోని కేవలం చారిత్రక, సాంస్కృతిక రిఫరెన్స్ కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో

Leave a Comment

error: Content is protected !!