తిరుమల ప్లాన్ చేస్తున్నారా? అయితే తెప్పోత్సవం తేదీలు తెలుసుకోండి | Tirumala Teppotsavam 2026

Tirumala Teppotsavam 2026 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని ప్లాన్ చేస్తున్న భక్తులకు శుభవార్త. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక తెప్పోత్సవాలను 2026 ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు.

తిరుమలలో జరిగే ప్రముఖ వార్షికోత్సవాల్లో ఈ ఉత్సవం కూడా ఒకటి. భక్తులతో పాటు తీర్థయాత్రలు చేసేవారు ఈ తెప్పోత్సవం కోసం వేయి కన్నులతో వేచి చూస్తుంటారు.

తెప్పోత్సవం అంటే ఏంటి ? | What is Teppotsavam ?

తెప్పోత్సవం అంటే స్వామివారి ఉత్సవ మూర్తులు శ్రీ స్వామి పుష్కరిణిలో అలంకరించిన తెప్పల మీద విహరిస్తూ భక్తులకు దర్శనం ఇవ్వడం. ప్రతీ రోజూ రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు ఈ ఉత్సవం జరుగుతుంది. దీపాల వెలుగు, మంత్రాలు, పుష్కరిణి వైభవం ఇవన్నీ భక్తులను ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్తాయి.

రోజూవారిగా ఉత్సవం షెడ్యూల్ | Tirumala Teppotsavam 2026

ఫిబ్రవరి 26వ తేదీన శ్రీ రామచంద్ర స్వామి సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తారు.

  • ఫిబ్రవరి 27వ తేదీన శ్రీకృష్ణ స్వామి రుక్మిణీ దేవీ సమేతంగా మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తారు.
  • ఫిబ్రవరి 28వ తేదీన శ్రీ మలయప్ప స్వామి వారు శ్రీ భూదేవీ సమేతంగా మూడు సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.

చివరి రోజు హైలైట్స్ | Concluding Days Highlights

Tirumala Teppotsavam 2026
Tirumala Teppotsavam 2026

మార్చి 1వ తేదీన శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో ఐదు సార్లు విహరిస్తారు.
మార్చి 2వ తేదీన అంటే తెప్పోత్సవాల్లో చివరి రోజున శ్రీ మలయప్ప స్వామివారు తెప్పపై ఏడు సార్లు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చి అనుగ్రహిస్తారు.

ఈ రోజుల్లో తిరుమలలో భక్తుల రద్దీ బాగా ఉంటుంది అని అధికారులు చెబుతున్నారు. అందువల్ల భక్తులు ముందుగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్జిత సేవలు రద్దు | Arjitha Seva Cancellation

తెప్పోత్సవం కారణంగా ఫిబ్రవరి 26, 27వ తేదీల్లో సహస్ర దీపాలంకార సేవ, అలాగే ఫిబ్రవరి 28, మార్చి 1, 2వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలు రద్దు చేశారు.

తిరుమల యాత్ర ప్లాన్ చేస్తున్న భక్తులు ముందుగా ప్లాన్ చేసుకుంటే బెటర్. లేదంటే రద్దీ కారణంగా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

  • తిరుమల తిరుపతి, టిటిడి అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి. అధికారిక సమాచారం, పరిశోధన చేసిన కంటెంట్ , కచ్చితత్వంతో అందిస్తాము.

 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో

Leave a Comment

error: Content is protected !!