Floating Post Office : నీటిపై తేలే పోస్టాఫీస్‌…ఎక్కడ ఉందో తెలుసా?

కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న అందమైన డాల్ సరస్సు మధ్యలో ఒక ప్రభుత్వ కార్యాలయం ప్రశాంతంగా ముందుకు కదులుతుంది. అది మన దేశంలో ఉన్న ఏకైక Floating Post Office, అంటే నీటిపై తేలే పోస్టాఫీస్.

2011లో ప్రారంభమైన ఈ పోస్టాఫీస్ కోసం కశ్మీరీ హౌస్‌బోటును వినియోగిస్తున్నారు. భూమిపై ఉన్న పోస్టాఫీస్‌లాగానే ఇక్కడ కూడా లెటర్లు, పార్సెల్స్, స్టాంపులు వంటి అన్ని పోస్టల్ సేవలు అందుబాటులో ఉంటాయి.

Floating Post office 2
Floating Post office | Image Source : X

ఈ నీటిపై తేలే పోస్టాఫీస్‌లో ఒక చిన్న Philately Section కూడా ఉంది. ఇక్కడ పాత స్టాంపులు, సంస్మారక కవర్లు (Commemorative Covers), కశ్మీర్ పోస్టల్ విభాగానికి చెందిన చరిత్ర, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు ప్రదర్శనకు ఉంచారు.

చాలా మంది సందర్శకులకు ఇది ఒక డిఫరెంట్ అనుభూతిని కల్పిస్తుంది. పిల్లలు, స్టాంపులు సేకరించేవారు ఈ ప్రదేశాన్ని ఎంతో ఆసక్తిగా చూస్తారు.

ఈ కాన్సెప్ట్‌ను డాల్ లేక్ పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేశారు. కొత్త బిల్డింగులు నిర్మించకుండా, ఇప్పటికే ఉన్న హౌస్‌బోటును వినియోగించడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా పోస్టల్ సేవలు అందుతున్నాయి.

శ్రీనగర్ వెళ్లే పర్యాటకులకు ఇది పెద్దగా ప్రచారం పొందిన హాట్‌స్పాట్ కాకపోయినా, డాల్ లేక్‌కు వెళ్లేవారు మాత్రం ఈ పోస్టాఫీస్‌ను చూడాలని ఆసక్తి చూపిస్తారు.

స్థానిక పరిస్థితులను బట్టి ప్రజాసేవలను అందుబాటులోకి తీసుకువచ్చే విధానం చాలా మందికి నచ్చుతుంది. ఐడియా చిన్నదైనా, దీర్ఘకాలంలో ఉపయోగపడే ఇలాంటి సింపుల్ ఆలోచనలు ఎన్నో జీవితాలను మార్చేస్తాయి.

📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.

▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో

Leave a Comment

error: Content is protected !!