Halong Bay : హా లాంగ్ బే – మీ లైఫ్‌లో ఒకసారి తప్పక వెళ్లాల్సిన ప్రదేశం
Halong Bay : చాలా సార్లు మనం ఫోటోస్‌లో చూసే నేచర్ ఎంత నిజమో అని డౌట్ వస్తుంది. కానీ ఇక్కడ ఆ డౌట్ అక్కర్లేదు. వియత్నాంలో హా లాంగ్ బే (Vietnam Travel Guide) కి వెళ్లినప్పుడు ఫస్ట్ టైమ్ ట్రావెలర్స్‌కి ఒక వియర్డ్లీ ఫెమిలియర్ ఫీల్ వస్తుంది.
క్రూజ్ డెక్ పైన నిల్చొని చూస్తుంటే ఆ చుట్టూ ఉన్న కామ్ వాటర్ అండ్ ఎండ్లెస్ ఐలాండ్స్ మనల్ని వేరే వరల్డ్‌లోకి తీసుకువెళ్తాయి. డైరక్ట్‌గా మనసుకి హత్తుకునే ఒక ప్రశాంతమైన చోటు ఇది.
వియత్నాం స్ట్రీట్స్‌లో ఉన్న మాస్ వైబ్‌కి ఇక్కడి సెరీన్ నేచర్‌కి ఉన్న కాంట్రాస్ట్ చూడాలి. ఎమరాల్డ్ గ్రీన్ వాటర్‌లో క్రూజ్ స్లోగా మూవ్ అవుతుంటే చుట్టూ ఉన్న లైమ్‌స్టోన్ మౌంటెన్స్ ఒక గార్డ్‌లా అనిపిస్తాయి.
Ha Long Bay is a priceless gift that nature has bestowed upon Vietnam. If you cannot visit this place, it is truly a pity. 🍁🌿😍
— Lisa. (@Lilytran00002) April 12, 2026
Top 10 Natural Wonders Of The World To Visit This Year
Full video👉https://t.co/W9bsVmdfq1 pic.twitter.com/WGcrciqZJK
మార్నింగ్ టైమ్‌లో బే పైన ఉండే మిస్ట్ వల్ల చుట్టూ అంత ఒక డ్రీమీ అట్మాస్పియర్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏ వీధిలోకి వెళ్లినా నేచర్ మనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది.
ముఖ్యాంశాలు
సందర్శనీయ స్థలాలు | Places to Visit in Halong Bay
క్రూజ్‌లో తిరుగుతూ సంగ్ సాట్ కేవ్ (Sung Sot Cave) లోని మిస్టీరియస్ ఫార్మేషన్ చూడొచ్చు. టి టాప్ ఐలాండ్ (Ti Top Island) పైన నుంచి బే వ్యూ చూస్తుంటే అంతా ఒక మేజిక్‌లా ఉంటుంది. క్యూ వాన్ ఫ్లోటింగ్ విలేజ్ (Cua Van Floating Village) లో లోకల్స్ లైఫ్ చాలా సింపుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా అనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : వియత్నాం వెళ్లేందుకు భారతీయులు ఎందుకు ఇష్టపడుతున్నారు ?
ఏం తినాలి ? | Food to Eat

ఇక్కడ ఫ్రెష్ సీ ఫుడ్ తింటుంటే ఈ సముద్ర గాలితో కలిసి టేస్ట్ ఇంకా బాగుంటుంది. లోకల్ బాన్ మీ శాండ్విచ్ (Banh Mi Sandwich) క్రిస్పీగా ఉంటూ లోపల ఫ్లేవర్స్ చాలా రిచ్‌గా తిరుగుతుంటాయి. ట్రెడిషనల్ వియత్నమీస్ కాఫీ (Vietnamese Coffee) తాగుతూ సన్ సెట్ చూడటం స్పెషల్ ఫీలింగ్ కలుగుతుంది.
ఎప్పుడు వెళ్లాలి? | Best Time
మార్చి నుంచి మే నెల వరకు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. వియత్నాంలో ప్రజలు చాలా సింపుల్‌గా, సాయం అందించడానికి సిద్ధంగా ఉంటారు. ట్రావెలింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు మనం ఒక కొత్త ప్రదేశంలో ఉన్నామన్న ఫీలింగ్ కలగదు.
హైదరాబాద్ నుంచి ఎలా రీచ్ అవ్వాలి ? | How To Reach From Hyderabad
హైదరాబాద్ నుంచి హనోయ్ (Hanoi) కి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటాయి. హనోయ్ నుంచి రోడ్ జర్నీలో 3 గంటల్లో బే కి చేరుకోవచ్చు.ఇక్కడి నుంచి తిరిగి వస్తుంటే మనతో పాటు కొన్ని మెమోరీస్ అండ్ సైలెన్స్‌ని కూడా తీసుకుని వస్తాము. లైఫ్‌లో ఎప్పుడైనా కొంచెం పాజ్ కావాలి అనుకున్నప్పుడు ఇలాంటి ప్రదేశాల గురించి ఆలోచిస్తే చాలు…మంచి మెమోరీస్ ఎప్పటికీ మనతో ఉంటాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.







