ఇండియా మ్యాప్ చివరి అంచుల్లో ఉన్న ఈ 5 Places చూశారా? | Last Villages In India
Last Villages In India : భారత్ అంటే ఒక దేశం మాత్రమే కాదు విభిన్న ఆచారాలు, సంప్రదాయాలు, భౌగోళిక స్వరూపం ఉన్న ఒక ప్రపంచం.ఉత్తరాన హిమాలయాల నుంచి అరుణాచల్ ప్రదేశ్, దక్షిణాన సముద్ర తీరం వరకు కొన్ని ప్రదేశాలు దేశ వైభవాన్ని చాటి చెబుతాయి. మ్యాప్ మీద గీసిన గీతలు ఆగిపోయే చోట, పర్వతాలు, సముద్రం, నదులు కలిసి ఒక కొత్త భారతదేశాన్ని మనకు పరిచయం చేస్తాయి.
మానా, కిబితూ, చిట్కుల్, ధార్చులా, కన్యాకుమారి..వీటిలో ఎక్కడికి వెళ్లినా అది ప్రయాణం మాత్రమే కాదు…ఒక అనుభవం అది.
ముఖ్యాంశాలు
సందర్శనీయ ప్రదేశాలు
Places to Visit :ఉత్తరాఖండ్‌లోని మానా (Mana Village Near Badrinath) అనేది బద్రినాథ్‌కి దగ్గరగా సరస్వతీ నది జన్మించి.. భూ గర్భంలోకి ఇంకిపోయే ప్రదేశంలో ఉన్న చిన్నగ్రామం. ఇండో టిబెటెన్ బార్డర్ వైపు ఉన్న ఈ ప్రదేశంలో రాతి ఇల్లు, ఇరుకు వీధులు, చుట్టూ నిలబడి ఉన్న హిమాలయ కొండలు ఒక ప్రశాంతమైన దృశ్యాన్ని ఇస్తాయి.
సరస్వతీ నదీ ప్రవాహం, భీముడి వంతెన, వసుధారా జలపాతం వైపు సాగే పర్వత మార్గం మానా ప్రయాణాన్ని గుర్తుండిపోయేలా చేస్తాయి.
- ఇది కూడా చదవండి : Ziro Valley : సమ్మర్లో పచ్చని ప్రశాంతత
అరుణాచల్ ప్రదేశ్‌లోని కిబుతు (Kibuthu) దగ్గరికి చేరుకునే కొద్ది ప్రకృతి మరింత వైల్డ్‌గా మారిపోతుంది. లోహిత్ నది, ఎత్తైన పైన్ వృక్షాలు, మేఘాలతో కప్పబడిన కొండలు కలిసి తూర్పు హిమాలయ ప్రపంచాన్ని చూపిస్తాయి. డాంగ్ నుంచి కిబుతు వైపు సాగే మార్గం భారత దేశ ఈశాన్య భూభాగం వైభవాన్ని చూపిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ (Chitkul) అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉన్న గ్రామం. చుట్టూ బాస్పా నది, చెక్కతో నిర్మించిన ఇల్లు, మతి దేవీ ఆలయం అన్నీ కలిసి ఒక నిశ్శబ్దమైన హిమాలయ పెయింటింగ్‌లా అనిపిస్తాయి. ఇండో టిబెటన్ బార్డర్ వద్ద ఉన్న చిట్కుల్ హిమాచల్‌లోని చివరి గ్రామ వైభవాన్ని చూపిస్తుంది.
అయితే ఉత్తరాఖండ్‌లోని (Uttarakhand) పితోర్ఘడ్ జిల్లాలో ఉన్న ధార్చులా (Darchula) అనేది కాస్త భిన్నమైన గ్రామం. ఇది ఒక చివరి గ్రామం మాత్రమే కాదు కాళీ నది ఒడ్డున నిలిచిన సరిహద్దు పట్టణం కూడా. ఒకవైపు భారత్, మరో వైపు నేపాల్ మధ్యలో ప్రవహించే కాళి నదీ రెండూ ప్రపంచాలను కలుపుతుంది. జాల్జిబి మార్కెట్ (Jauljibi Market), నారాయణ్ ఆశ్రమం, పంచచులి దృశ్యాలు ఈ ప్రదేశాలకు మరింత రంగులు జోడిస్తాయి.
దక్షిణాన కన్యాకుమారి (Kanyakumari) దగ్గరికి చేరుకుంటే హిమాలయాల నిశ్శబ్దం కాస్త ఇక్కడ సముద్ర గాలిగా మారిపోతుంది. భారత దేశ దక్షిణాదిలో చివరి భాగం అయిన కన్యాకుమారి వద్ద అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రం కలిసే దృశ్యం ఒక సినిమాలో హ్యాపీ ఎండింగ్‌లా ఉంటుంది.
ఇక్కడ వివేకానందా రాక్ మెమోరియల్, తిరువళ్లూరు స్టాట్యూ, కుమారి అమ్మన్ ఆలయం ఈ తీర చరిత్ర, సంస్కృతిని రెండింటిని అందిస్తాయి.
ఎలా వెళ్లాలి ? | How To Travel
హైదరాబాద్ నుంచి ఈ ఐదు చివరి గ్రామాలను ఒకే ట్రిప్‌లో చూడటం కన్నా వేరు వేరు వేరుగా ప్లాన్ చేయడం బెటర్. మానా కోసం హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ వైపు ఫ్లైట్ జర్నీ అక్కడి నుంచి జోషిమఠ్, బద్రినాథ్ మార్గంలో సాగే రోడ్డు జర్నీ ఒక మంచి ట్రాన్సిషన్లా ఉంటుంది. బద్రినాథ్ నుంచి మానా వైపు పర్వతాల మధ్య ప్రయాణం మొదలు అవుతుంది. మీరు నడుస్తూ కూడా వెళ్లవచ్చు.
కిబుతు కోసం హైదరాబాద్ నుంచి అస్సాం లేదా అరుణాచల్ ప్రదేశ్‌కి (Arunachal Pradesh ) ఎయిర్ జర్నీ తరువాత రోడ్డు జర్నీ చేయవచ్చు. చిట్కుల్ కోసం చండిగఢ్ లేదా షిమ్లావైపు వెళ్లాలి. అక్కడి నుంచి కిన్నౌర్ కొండల మధ్య సాగే రోడ్ జర్నీ సూపర్ మెమోరీగా మిగిలిపోతుంది. ధార్చులా కోసం ఉత్తరాఖండ్‌లోని తానక్‌పూర్ లేదా పితోర్‌గఢ్ వైపు సాగే ప్రయాణం హిమాలయల మరో ముఖాన్ని చూపిస్తుంది.
కన్యాకుమారి అనేది హైదరాబాద్ నుంచి రైలు, రోడ్డుమార్గంలో ఈజీగా రీచ్ అవ్వగల డెస్టినేషన్.తమిళనాడులోని ఈ ప్రాంతానికి వెళ్లే సమయంలో మీకు పర్వతాలకు బదులు సముద్రం కనిపించడం ఈ ప్రయాణంలో ఒక బ్యూటిఫుల్ ఛేంజ్‌లా కనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Arunachalam: అరుణాచల పర్వతంపైకి వెళ్లొచ్చా? గిరి ప్రదక్షిణ ఏ సమయంలో చేయాలి? పూర్తి గైడ్
ఎక్కడ ఉండాలి ? | Stay Options
మన ప్రయాణంలో బద్రినాథ్ లేదా జోషిమఠ్‌లో సింపుల్ హోటల్స్, గెస్ట్ హౌజ్‌ల మధ్య ఒక హిమాలయన్ స్టే అనుభవం లభిస్తుంది. చిట్కుల్, సాంగ్లా (Sangla) ప్రాంతాల్లో హోమ్‌స్టేస్, చిన్న హోటల్స్, గ్రామీణ జీవనాన్ని దగ్గరగా చూపిస్తాయి.
ధార్చులాలో కాళీ నది వైపు ఉండే హాస్టల్స్, లాడ్జిలు బార్డర్ ప్రాంతంలో లైఫ్‌ను ఆస్వాదించేందుకు అవకాశాన్ని అందిస్తాయి. కన్యాకుమారిలో సముద్రం దగ్గర హోటల్స్‌లో సూర్యోదయం, సన్‌సెట్ రెండూ ఆస్వాదించడం ప్రయాణంలో ప్రత్యేక జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
ఏం చూడాలి ? | Visiting Places
మానాలో సరస్వతి నది శబ్దాన్ని వినడం, భీమ్ పుల్ దగ్గర నిలబడి సరస్వతీ నదీ పర్వతాల మధ్యలోంచి జారిపడే సమయంలో ఏర్పడే ఇంద్రధనస్సును చూడటం, వసుధారా జలపాతం వెళ్లే దారిలో హిమాలయ వైభవాన్ని వీక్షించడం ఇవన్నీ జీవితకాలం గుర్తుంటాయి.
అలాగే చిట్కుల్లో బాస్పా నది పక్కనే నడవటం, మతి దేవీ ఆలయం శిల్పకళ వైభవాన్ని గమనించడం, గ్రామాల్లో వుడెన్ హౌసెస్ మధ్య సమయం గడపటం మరొక అనుభవం.
కిబుతులో లోహిత్ వ్యాలీ దృశ్యాలు, ధార్చులాలో కాళీ నది వైపు కనిపించే బార్డర్ ల్యాండ్‌స్కేప్, కన్యాకుమారిలో సముద్ర సంగమం, వివేకానంద రాక్…ఇలా ప్రతీ చోటు భారత దేశం చివరి భాగం వరకు ఎంత అందమైనదో, ఎంత విభిన్నమైనదో చూపిస్తుంది.
ఏం తినాలి | Food
హిమాలయన్ గ్రామాల్లో లోకల్‌గా దొరికే సింపుల్ భోజనం ఆ ప్రదేశ జీవన విధానాన్ని చూపిస్తుంది. మానాలో రాజ్మా, పొటాటో లాంటివి స్థానికంగా పండిస్తారు. చిట్కుల్, కిన్నోర్ ప్రాంతాల్లో సిద్దు, చనా మాద్రా లాంటివి స్థానిక రుచులను ఆస్వాదించవచ్చు.
- ఇది కూడా చదవండి : Key Monastery Spiti: ఓవర్ టూరిజం కాకముందే చూసేయండి… స్పితీ వ్యాలీ!
కన్యాకుమారి చేరుకున్నప్పుడు ప్లేట్లో వడ్డించే ఫుడ్ కడుపునే కాదు మనసును కూడా నింపేస్తాయి. తీర ప్రాంతంలో సౌత్ ఇండియన్ మీల్, కొబ్బరితో చేసిన వంటకాలు, సీ ఫుడ్ ఎంజాయ్ చేయవచ్చు.
యాత్రా, బడ్జెట్ వివరాలు | Travel Budget
ఈ ఐదు డెస్టినేషన్స్‌ను ఒకటే ట్రిప్‌లో లేదా 5 రోజుల్లో కవర్ చేయడం లేదా చేయాలి అనుకోవడం అంత మంచి ఐడియా కాదు. సో, 5 రోజుల ట్రిప్‌ను మానా, చిట్కుల్, కిబుత్ లాంటి దగ్గరగా ఉన్నహిమాలయన్ డెస్టినేషన్స్ కవర్ చేసేలా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ప్లాన్ చేస్తే హైదరాబాద్ నుంచి విమానాలు, తరువాత లోకల్ ట్రాన్స్పోర్ట్, స్టే కలిపి బడ్జెట్ రేంజ్ సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు అవుతుంది.
స్టాండర్డ్ బడ్జెట్ వచ్చేసరికి రూ.30 వేల నుంచి రూ 50 వేల వరకు, ప్రీమియం అయితే రూ.60 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది.
కిబుత్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లేప్పుడు రోడ్డు ప్రయాణమే ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి బడ్జెట్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధార్చులా ట్రిప్‌ను అయితే రూ.18 వేల నుంచి రూ.35 వేల మధ్యలో ప్లాన్ చేసుకోవచ్చు.
కన్యాకుమారి 5 రోజుల ట్రిప్‌ను రూ.15 వేల నుంచి రూ.30 వేల రేంజిలో ప్లాన్ చేసుకోవచ్చు. అయితే ఇది మీ ట్రావెల్ క్లాస్, ఎంచుకునే హోటల్‌ను బట్టి మారుతుంది.
స్టే కోసం హిమాలయన్ డెస్టినేషన్‌లో రోజుకు సుమారు రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ప్రీమియం ప్రాపర్టీలలో దానికంటే ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ఫుడ్ కోసం ప్రతీ రోజు సుమారు రూ.500 నుంచి రూ.1,200 వరకు ఖర్చు అవుతుంది. అరుణాచల్ ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలకు వెళ్లేందుకు ముందస్తుగానే ఇన్నర్‌లైన్ పర్మిషన్ (Inner Line Permit) తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎంట్రీకి ముందు కావాల్సిన ఇతర రిక్వైర్మెంట్స్ కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ఈ 30 యాక్టివిటీస్ చేయకపోతే మనాలి వెళ్లినట్టే కాదు
ఏం చేయాలి ? | 5 Things To Do
- ఈ ప్రయాణంలో ఒకసారి అయినా మానాలో సరస్వతి నదిని చూడాలి.
- చిట్కుల్లో బాస్పా నది పక్కన నడవాలి.
- కిబుతూలో తూర్పు హిమాలయాల నిశ్శబ్దాన్ని ఆస్వాదించాలి.
- ధార్చులాలో కాళీ నది రెండు దేశాలను కలిపే సన్నివేశాన్ని చూడాలి.
- చివరగా కన్యాకుమారిలో సముద్రం ముందు నిలబడి భారత దేశ దక్షిణ అంచుని ఫీల్ అవ్వాలి.
ఆసక్తికరమైన విషయాలు | Quick Facts
- మానా అనేది ఉత్తరాఖండ్ ఇండో టిబెటన్ బార్డర్ వైపు ఉన్న చివరి గ్రామంగా ఫేమస్ అయింది.
- కిబుతు అరుణాచల్ ప్రదేశ్‌లో తూర్పు వైపున ఉన్న రిమోట్ బార్డర్ డెస్టినేషన్.
- చిట్కుల్ అనేది బాస్పా లోయలో 3,450 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
- ధార్చులా కాళీ నది ఒడ్డున భారత్ నేపాల్ బార్డర్ టౌన్.
- కన్యాకుమారి భారత ప్రధాన భూభాగానికి దక్షిణాది చివరి అంచు. ఇక్కడ అరేబియన్ సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం కలిసే దృశ్యాన్ని చూడొచ్చు.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
గమనిక
ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ అప్డేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోండి.
- ఈ కథనం సాక్షి దినపత్రిక ఈ-పేపర్ లో కూడా ప్రచురితమైంది. కంటెంట్ రచయిత: ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు పాఠకుల కోసం పునఃప్రచురణ చేశారు.
- ఈపేపర్ స్క్రీన్ షాట్ చూడండి.
- మరిన్ని మీడియా పబ్లిషింగ్ రికార్డుల కోసం క్లిక్ చేయండి.

ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
