ఎయిర్పోర్ట్ లేదు.. ఆర్మీ లేదు.. అయినా రిచెస్ట్ ఒకటి! అదే Liechtenstein
Liechtenstein: : ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఆస్ట్రియా మధ్య ఉన్న చిన్న దేశం లీచెన్‌స్టీన్ . ఈ దేశం సైజు హైదరాబాద్ నగరం కన్నా చిన్నదే. జనాభా కూడా 40 వేల వరకు ఉంటుంది.
అయినా తలసరి ఆదాయం విషయంలో మాత్రం ప్రపంచంలోని ఎన్నో పెద్ద దేశాలను వెనక్కి నెట్టేసింది. లిచీన్స్టీన్ మొత్తం విస్తీర్ణం సుమారు 160 చదరపు కిలోమీటర్లు మాత్రమే.
విమానాశ్రయం లేదు | No Airport
లీచెన్‌స్టీన్ గురించి ఆసక్తికరంగా చెప్పుకునే విషయాల్లో ఒకటి.. ఈ దేశానికి సొంత అంతర్జాతీయ విమానాశ్రయం లేదు. లీచెన్స్టీన్కు ప్రయాణించే వారు స్విట్జర్లాండ్‌లోని జ్యూరిక్ విమానాశ్రయం, జర్మనీలోని మ్యూనిక్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి ఇక్కడికి చేరుకుంటారు.
ప్రతీ దేశంలో ఒక్కటైనా విమానాశ్రయం ఉంటుంది కదా…దీనికి ఎందుకు లేదు అనే చాలా మంది సందేహం. దీనికి కారణం ఇక్కడ ఫ్లాట్ ల్యాండ్ తక్కువ. అంత పెద్ద విమానాశ్రయం కట్టడానికి సరైన చోటు కూడా లేదు. అందుకే పక్క దేశం ఎయిర్‌పోర్టును వినియోగిస్తారు.
సొంత సైన్యం లేదు | No Army
మరో ప్రత్యేకత.. లీచెన్స్టీన్కు సొంత సైన్యం లేదు. 1866లో జరిగిన ఆస్ట్రో-ప్రష్యన్ యుద్ధం సమయంలో లీచెన్‌స్టీన్ తన సైనిక దళాన్ని చివరిసారిగా ఉపయోగించింది. తరువాత సైన్యాన్ని శాశ్వతంగా ఉపసంహరించుకుంది. అయితే భూమిపై ఇలా ఆర్మీ లేని దేశాలు చాలా ఉన్నాయి.
స్విట్జర్లాండ్, ఆస్ట్రియా వంటి పొరుగు దేశాలతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఎప్పుడైనా ఆర్మీ అవసరం పడినా ఆ దేశాలు చూసుకుంటాయి. ఆర్మీ లేదు కానీ ఇక్కడి పోలిస్ వ్యవస్థ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.
సొంత కరెన్సీ లేదు | No Own Currency
కరెన్సీ విషయంలోనూ లీచెన్స్టీన్కు ప్రత్యేకత ఉంది. పొరుగుదేశం అయిన స్విట్జర్లాండ్‌తో ఒక ఒప్పందం చేసుకున్న ఈ చిన్ని దేశం వాళ్ల కరెన్సీనే తమ కరెన్సీగా చెలామణి చేస్తోంది.
1921 నుంచి స్విస్ ఫ్రాంక్ను ఉపయోగిస్తున్న ఈ దేశం, 1980లో స్విట్జర్లాండ్‌తో కరెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
- ఇది కూడా చదవండి :ప్రపంచ వింతలకు తక్కువ కాని 8 ప్రదేశాలు…చూస్తే వారెవ్వా అనాల్సిందే !
వజ్రంలాంటి ఎకానమీ | Lietchenstein Economy
వజ్రం సైజు చిన్నదే అయినా దాని వెల ఎక్కువగా ఉంటుంది కదా..అలాగే ఈ దేశం చిన్నదే అయినా దీని ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దది. ప్రపంచ బ్యాంకు గణాంకాల ప్రకారం ఈ దేశ జీడిపి 2,20,000 డాలర్లు. అదే మన భారత్ విషయానికి వస్తే జీడిపి 2,700 డాలర్లుగా ఉంది. అంటే మన దేశ జీడిపీ కన్నా ఈ దేశ జీడిపి 81 రెట్లు ఎక్కువ. అందుకే ఇది ప్రపంచ సంపన్న దేశాల్లో ఒకటిగా ఉంది.
బిజినెస్ సెంటర్ | Business in Lietchenstein
చిన్న దేశమైనప్పటికీ వ్యాపార రంగంలో లీచెన్స్టీన్కు మంచి పేరు ఉంది. దేశంలో వేలాది కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. మెడికల్, డెంటల్ టెక్నాలజీ, ప్రెసిషన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఇండస్ట్రియల్ ఉత్పత్తులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇక్కడి ఆర్థిక వ్యవస్థను దూసుకెళ్లేలా చేశాయి.
పొరుగుదేశం అయిన స్విట్జర్లాండ్, ఆస్ట్రియా నుంచి ప్రతిరోజూ చాలా మంది లీచెన్స్టీన్కు వచ్చి వెళ్తారు. 50 శాతం కన్నా ఎక్కువ ఉద్యోగాలు ఈ రెండు దేశాల ప్రజలవే.
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
