నేపాల్ సమ్మర్ ట్రిప్ 2026: హిమాలయాల మధ్య చల్లని స్వర్గం | Nepal Summer Trip
Nepal Summer Trip : ఎండాకాలంలో చల్లని గాలి తాకితే ఎంత బాగుంటుందో కదా…నేపాల్‌లో అడుగు పెడితే ఆ అనుభూతితోనే మొదలు అవుతుంది. హిమాలయాల మౌనం మనల్ని కొత్త లోకానికి తీసుకువెళ్తుంది.
నేపాల్ అంటే కేవలం పర్వత శ్రేణులు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం.నేపాల్ అంటే కేవలం పర్వత శ్రేణులు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం.
Nepal Summer Trip : ఎండాకాలంలో చల్లని గాలి తాకితే ఎంత బాగుంటుందో కదా…నేపాల్‌లో అడుగు పెడితే ఆ అనుభూతితోనే మొదలు అవుతుంది. హిమాలయాల మౌనం మనల్ని కొత్త లోకానికి తీసుకువెళ్తుంది.
నేపాల్ అంటే కేవలం పర్వత శ్రేణులు మాత్రమే కాదు, అది ఒక జీవన విధానం.
మంచు పర్వతాలతో మొదలు అయ్యి, ప్రశాంతమైన బుద్ధిస్ట్ ఆలయం వరకు ప్రతీ ఒక్కటి మనకు ఒక కొత్త దృష్టిని ఇస్తుంది. ఎండాకాలంలో ఇక్కడ ఉన్న వాతావరణం మన మనసుకు ప్రశాంతతనిస్తుంది. ప్రతీ క్షణం ఒక జ్ఞాపకంలా మిగిలిపోతుంది. ఖాట్మాండులోని గంట చప్పుడు నుంచి పోఖరాలోని సరస్సు వరకు ప్రతీ అడుగు ఒక కొత్త కథలోకి ఎంటరైన ఫీలింగ్‌ను అందిస్తుంది.
ప్రకృతి పరవశంలో నేపాల్
నేపాల్ అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది హిమాలయాలు. ఎండాకాలంలో మిగితా చోట్ల ఎండ ఎక్కువ ఉన్నా, ఇక్కడ వాతావరణం మాత్రం చాలా హాయిగా ఉంటుంది. ఖాట్మాండులోని ప్రాచీన కట్టడాలు, కొత్తగా అనిపించే వీధులు మన ప్రయాణాన్ని చాలా ప్రత్యేకంగా మార్చుతాయి.
- ఇది కూడా చదవండి : Bhutan Travel Guide 2025 🇧🇹 : భూటాన్ ఎలా వెళ్లాలి? ఖర్చు, ఫుడ్, టిప్స్ | Exploring Bhutan
ఇక్కడ ఉండే మనుషులు, వారి ఆత్మీయత మనకు దూరమైన ప్రాంతంలో ఉన్నాము అనే ఫీలింగ్ రానివ్వవు. ప్రతీ చిన్న గుడిలో ఉండే శాంతి మనల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ప్రతీ క్షణం కొత్త జ్ఞాపకంలా అనిపిస్తుంది.
ఎండాకాలంలో మన దగ్గర వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, ఇక్కడ ఉండే మబ్బుల ఆట చాలా ప్రశాంతతనిస్తుంది.
సందర్శనీయ ప్రదేశాలు | Places To Visit
ఖాట్మాండు సిటీలో ఉండే పశుపతినాథ్ ఆలయం ఒక ఆధ్యాత్మిక అనుభూతి. అక్కడ జరిగే హారతి, వాతావరణం మనసుకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ఇది కేవలం ఒక గుడి కాదు, ఇక్కడ ప్రతీ రాయి ఒక కథ చెబుతుంది.
ఇంకా బౌద్ధనాథ్ స్తూపం వద్ద ఉండే ఆ శాంతి, అక్కడికి వచ్చిన భక్తుల మౌనం మనల్ని క్షణం పాటు స్థంభింపచేస్తాయి. ఆ పెద్ద కళ్లతో ఉన్న స్థూపం చూస్తుంటే మనసులో ఏదో తెలియని పరవశం కలుగుతుంది.
పోఖరకి వెళ్తే అక్కడ ఫేవా లేక్‌లో బోట్ రైడింగ్ చేస్తున్నప్పుడు కనిపించే మచ్ఛపుచ్చ్రే పర్వతం (Machhapuchhre Mountain) రిఫ్లెక్షన్ చూసేందుకు రెండు కళ్లు సరిపోవు.
#Bouddhanath #Nepal pic.twitter.com/0QSN7QUiCl
— North (@nirojsedhai) August 8, 2017
సరస్సు నుంచి వచ్చే చల్లని గాలి మన శరీరాన్నే కాదు మనసును కూడా హత్తుకుంటుంది. సారంగ్‌కోట్ నుంచి (Sarangkot) సూర్యోదయం చూడటం ఒక మరువలేని అనుభవంగా మిగిలిపోతుంది.
ఎలా వెళ్లాలి? | How To Reach Nepal
హైదరాబాద్ నుంచి నేపాల్‌కి ప్రయాణం చాలా సులభం. హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకి డైరెక్ట్ ఫ్లైట్స్ లాంటి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఫ్లైట్‌లో వెళ్తున్నప్పుడు మబ్బుల మధ్య కనిపించే హిమాలయ శిఖరాలు చూడటం ఒక గొప్ప అనుభూతి ఇస్తుంది.
విమానాశ్రయం నుంచి సిటీకి వెళ్తున్నప్పుడు మొదలయ్యే ఆ జర్నీ మనకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. ఇంకా అడ్వెంచర్ కావాలి అనుకుంటే, హైదరాబాద్ నుంచి ట్రైన్లో గోరఖ్‌పుర్ వరకు వెళ్లి, అక్కడి నుంచి రోడ్ మార్గం ద్వారా నేపాల్ బార్డర్స్ దాటాల్సి ఉంటుంది.

రోడ్డు ప్రయాణంలో ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ వెళ్లడం ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. విజయవాడ నుంచి వచ్చే వారు ముందుగా హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఫ్లైట్స్ తీసుకోవడం చాలా హాయిగా ఉంటుంది.
ఎక్కడ ఉండాలి? | Accommodation
నేపాల్‌లో స్టే చేయడం అంటే ఒక ప్రకృతి ఒడిలో నిద్రపోవడం లానే ఉంటుంది. ఖాట్మాండులోని థామెల్ ఏరియాలో ఉన్న హాస్టల్స్‌లో ఉంటే అక్కడుండే వైబ్రెంట్ లైఫ్‌ని దగ్గరగా చూడవచ్చు. ఇక్కడ స్ట్రీట్స్ అన్ని కొత్త పరిమళాలతో నిండి ఉంటాయి.
పోఖరాలో సరస్సు పక్కనే ఉండే రిసార్ట్స్‌లో స్టే చేస్తే, పొద్దున్నే లేచే సరికి కనిపించే మౌంటెన్ వ్యూస్ మనసును ఉల్లాసపరుస్తాయి. ఇక్కడ రిసార్ట్స్‌లో ఉండే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. అక్కడుండే చెట్ల మధ్య, చల్లని గాలి మధ్య స్పెండ్ చేయడం చాలా బాగుంటుంది.
Heaven is a myth
— iamsayedul (@Beingsayedul) May 15, 2026
Nepal is unreal ❤🫶
📌 Dhampus, Pokhara, Nepal 🇳🇵 pic.twitter.com/cPhYfbdGvd
స్టాండర్డ్ హోటల్స్ నుంచి ప్రీమియం రిసార్ట్స్ వరకు అన్ని టైప్స్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రతీ హోటల్ రూమ్ విండో నుంచి కనిపించే వ్యూస్ ఒక పెయింటింగ్‌లా అనిపిస్తాయి. మనసుకు ప్రశాంతత కోరుకునే వారికి ఇది ఒక స్వర్గంలాంటిది.
- ఇది కూడా చదవండి : French Alps Travel : ఎండాకాలంలో చల్లని స్వర్గం
ఏం చూడాలి? | Best Places
నేపాల్‌లో చూడాల్సినవి (Nepal In Summer Trip) కేవలం కొంచెం దూరంలో ఉండే ప్లేసెస్ మాత్రమే కాదు. అక్కడుండే ప్రతీ మూమెంట్ స్పెషల్. భక్తుపూర్లోని ప్రాచీన వీధులు, అక్కడుండే ఆర్కిటెక్చర్ చూస్తే మనం కొన్ని వందల ఏళ్లు వెనక్కి వెళ్లామా అన్న ఫీలింగ్ కలుగుతుంది.
నాగర్‌కోట్ నుంచి కనిపించే ఎవరెస్ట్ రేంజ్ వ్యూస్ ట్రిప్‌కి ఒక హైపాయింట్లా ఉంటుంది. సమ్మర్లో అక్కడుండే గ్రీనరీ, మబ్బుల ఆట చూడటానికి చాలా బాగుంటాయి. పశుపతినాథ్ దగ్గర ఈవినింగ్ హారతి చూడటం, అక్కడి ఆట్మాస్ఫియర్ని ఫీల్ అవ్వడం ఒక గొప్ప ఎక్స్‌పీరియెన్స్.
ఇక్కడ ఉండే ప్రతీ క్షణం ఒక జ్ఞాపకం. లోకల్ మార్కెట్లో తిరుగుతూ, అక్కడుండే హ్యాండ్‌మేడ్ క్రాఫ్ట్స్‌ని చూడటం, వారి కలలకు ఇచ్చే గౌరవం చాలా గొప్పది.
ఏం తినాలి? | Food | Nepal In Summer Trip
నేపాల్‌లో ప్రతీ ముద్ద ఒక జ్ఞాపకం. ఇక్కడ మోమోస్ తినడం అంటే కేవలం ఆకలి తీర్చుకోవడం కాదు. అది ఒక యూనిక్ ఇమోషన్. మోమోస్ మాత్రమే కాదు, లోకల్ ఎక్స్‌పీరియెన్స్ ఆ రుచి మనసుకు హత్తుకుంటుంది. ట్రెడిషనల్ దాల్ భాట్ (Dal Bhat) మనం తినే థాలిని పోలి ఉంటుంది. హిమాలయన్ స్పైసెస్ వల్ల కొత్త రుచి ఇస్తుంది.
ఎండాకాలం బేవరేజెస్ అండ్ టీ వెరైటీలు రిఫ్రెషింగ్లా ఉంటాయి. వీటితో పాటు క్రిస్పీ సెల్ రోటీ, యోమారి (Yomari) లాంటి స్వీట్ డెలికసీస్ నేపాల్ ఆథెంటిక్ టేస్టును చూపిస్తాయి. స్ట్రీట్ ఫుడ్‌లో దొరికే చోయిలా (Choila) అండ్ చాటామరి (Chatamari) అనే నేపాల్ పిజ్జాను పర్యాటకులు బాగా ఇష్టపడతారు.
నేపాల్ సమ్మర్ ట్రిప్ వెళ్తే మాత్రం బ్రెతబుల్ కాటన్ క్లోత్స్, ఒక లైట్ జాకెట్ తీసుకెళ్లండి.
- ఇది కూడా చదవండి : సూర్యుడు అస్తమించని మంచురాజ్యం | Svalbard Arctic Travel
నేపాల్ యాత్ర బడ్జెట్ అండ్ వివరాలు | Yatra & Budget Details
నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు 5 డేస్ ప్లాన్ చాలా బాగుంటుంది. టోటల్ ట్రిప్ బడ్జెట్ పర్ పర్సన్ వచ్చేసి మినిమం రూ.20 వేల అనుకుంటే, మ్యాక్సిమమ్ అనేది మీ ట్రావెల్ స్టైల్, రూమ్ అండ్ ఫుడ్, ఇతర ఖర్చులను బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా చెప్పాలంటే ఒక వ్యక్తికి వారం రోజుల నేపాల్ యాత్రకు యావరేజ్ రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది.
కొంచెం వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నుంచి ఖాట్మాండుకు ఫ్లైట్ చార్జీలు సీజన్, ప్రయాణించే క్లాసును బట్టి రూ.35 వేల నుంచి రూ.51 వేల వరకు ఉండే అవకాశం ఉంటుంది. రూమ్స్ విషయానికి వస్తే రూ.500కు కూడా రూమ్స్ లభిస్తాయి. కానీ అందులో సేఫ్టీ ఇష్యూస్ అండ్ సదుపాయాల కొరత ఉండే అవకాశం ఉంది. బడ్జెట్ సమస్యే కాదు అనుకుంటే రూ.10 వేలకు కూడా రూమ్స్ లభిస్తాయి.
ఇక ఫుడ్ కాస్ట్ విషయానికి వస్తే యావరేజ్‌గా రోజుకు రూ.600 నుంచి రూ.1500 వరకు మీ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్‌ను బట్టి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ ట్రావెలర్స్ కోసం గెస్ట్ హౌజెస్ కూడా ఆప్షన్స్ ఉంటాయి.
ఎవరెస్ట్, కైలాస శిఖర దర్శనం | Everest, Mount Kailash
నేపాల్ నుంచి ఎవరెస్ట్ అండ్ పవిత్ర కైలాస పర్వత శిఖరాన్ని చూడటం ఒక తీయని అనుభూతిగా మిగిలిపోతుంది. ఖాట్మాండు నుంచి ఎర్లీగా మౌంటెన్ ఫ్లైట్ ఎక్కితే ఎవరెస్ట్‌ని చాలా దగ్గర నుంచి చూడొచ్చు. ఎవరెస్ట్‌ని చూసేందుకు ఫ్లైట్స్ ఉన్నా, కైలాస పర్వత దర్శనం కోసం హుమ్లాలోని లిమి లాప్చా (Limi Lapcha) వరకు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి చైనా వీసా లేకుండా దూరంగా ఉన్న కైలాస మానసరోవర్ని కళ్లారా చూడవచ్చు.
A beautiful view descending the summit of Mt #Everest (8848.86 m). Video ©: Gao Li. pic.twitter.com/HzbpGQpfyI
— Everest Today (@EverestToday) May 7, 2026
నేపాల్‌కు వెళ్లేందుకు వీసా అవసరమా? | Does Indians Need Visa to Visit Nepal
భారతీయులకు నేపాల్ వెళ్లడానికి వీసా అవసరం లేదు. ఓటర్ ఐడీ లేదా పాస్‌పోర్టు ఉంటే సరిపోతుంది. డిజిటల్ కాపీలను కాకుండా ఒరిజినల్ తీసుకెళ్లండి. డిజిటల్ కాపీలు, ప్రింటౌట్లు, డిజిలాకర్ వర్షన్లను బార్డర్స్ అండ్ ఎయిర్‌పోర్టుల్లో యాక్సెప్ట్ చేయరు. మరో విషయం ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సులను అధికారిక ట్రావెల్ డాక్యుమెంట్స్‌గా అంగీకరించరు.
తెలుసుకోవాల్సిన విషయాలు | Quick Facts
- ప్రపంచంలోని టాప్ 14 అత్యంత ఎత్తైన పర్వతాల్లో 8 నేపాల్‌లోనే ఉన్నాయి.
- గౌతమ బుద్ధుడు జన్మించిన ప్రాంతమైన లుంబిని నేపాల్‌లోనే ఉంది.
- నేపాల్ ఫ్లాగ్ ప్రపంచంలోనే యూనిక్ షేప్‌లో ఉంటుంది.
- ఇక్కడ నేపాలీ భాషతో పాటు చాలా మంది హిందీ, ఇంగ్లిష్ మాట్లాడుతారు.
- ఇండియన్ కరెన్సీని కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు.
ఎం.జి.కిశోర్, ప్రయాణికుడు
Note : ఇక్కడ ఇచ్చిన ట్రావెల్, బడ్జెట్ వివరాలు మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి ప్రయాణానికి ముందు లేటెస్ట్ అప్టేట్స్ స్వయంగా వెరిఫై చేసుకుని ప్లాన్ చేసుకోగలరు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
