మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఎక్కడ ఉండాలి, ఏం చూడాలి | Top 10 Tips To Visit Manali
మనాలి అంటే Snow, Adventure, Budget Travel. ఈ గైడ్లో Manali trip cost, stay, food, best time, Solang Valley, Atal Tunnel, Sissu Valley వివరాలు, గైడెన్స్ అన్నీ ఈ పోస్టులో ఉన్నాయి.
మానవజాతి నిర్మాత మను పేరిట | How Manali Got Its Name
మనును మానవ జాతి నిర్మాత అని చెబుతారు. అతని పేరు మీదే మనాలి (Manali) కి ఆ పేరు వచ్చింది. ఇండియాలో ఉన్న అత్యంత బ్యూటిఫుల్ హిల్ స్టేషన్లో మనాలి ఒకటి. 4000 మీటర్ల ఎత్తులో ఉంటుంది కాబట్టి స్నో ఎక్కువ పడుతుంది. అందుకే చల్లగా ఉంటుంది.
Manali Travel Guide
మనాలి అనేది ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా నుంచి 40 కిమీ దూరంలో ఉంటుంది.
- ఇది షిమ్లా నుంచి 270 కమీ దూరం
- ఢిల్లీ నుంచి 540 కిమీ దూరం
- హైదరాబాద్ (Hyderabad) నుంచి 2068 కిమీ దూరం
- విజయవాడ నుంచి 2314 కీమ దూరంలో ఉంటుంది.
- ఇది కూడా చదవండి : 3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary
1. మనాలి ఎలా వెళ్లాలి ? | Hyderabad To Manali Plan
నిజానికి మనాలికి డైరెక్టుగా విమానం సర్వీసు లేదా రైల్వే స్టేషన్ లేదు. కాబట్టి మీరు బైరోడ్ ప్లాన్ చేసుకుంటే బెస్టు. మీరు దేశంలో ఏ భాగంలో ఉన్నా మీరు ముందు ఢిల్లీ (Delhi) లేదా చంఢిగడ్ చేరుకోవాలి. అక్కడి నుంచి మీరు ప్రైవేట్ బస్సులో లేదా హెచ్చార్టీసి (HRTC) బస్సులో మనాలికి చేరుకోవచ్చు.
నేను ఢిల్లీ నుంచి వోల్వో బస్సులో వచ్చాను చార్జీ వచ్చేసి రూ. 800 నుంచి -రూ.1200 వరకు ఉంటుంది. ఢిల్లీ నుంచి 12 గంటల్లో ఛంఢిగడ్ నుంచి 8 గంటల్లో మనాలికి తీసుకొచ్చేస్తుంది బస్సు.
ఫ్లైట్‌లోనే రావాలి అనుకుంటే మాత్రం కులులో ఉన్న భుంటర్ ఎయిర్‌పోర్టు (Bhuntar Airport) వరకు రావచ్చు. ఇది మనాలికి 50 కీమీ దూరంలో ఉంటుంది. కులు ఎయిర్పోర్ట్ నుంచి లిమిటెడ్ విమానాలు నడుస్తాయి.
- ఇది కూడా చదవండి : మన దేశంలో ఈ 5 ఆలయాలు దర్శనం చేసుకోవాంటే లక్కుండాలి
- టికెట్ కాస్ట్ కూడా ఎక్కువే 15 వేలు పైమాటే ఉంటుంది.
- అందుకే చాలా మంది బస్సు జర్నీనే ఫ్రిఫర్ చేస్తారు.
- ఎందుకంటే జర్నీలో ఎన్నో అందమైన లొకేషన్స్ చూసేయొచ్చు.
2.మనాలి వెళ్లే బెస్ట్ టైమ్ ఏంటి ? | Manali Best Time
మనాలి సంవత్సరం మొత్తం అందంగానే కనిపిస్తుంది. కానీ అక్టోబర్ నుంచి జులై మధ్య కాలంలో దీని బ్యూటి, గుండెను లూటీ చేస్తుంది. డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో మీరు స్నో ఫాల్ కూడా చూడొచ్చు. మార్చి నుంచి ఈ స్నో కరగడం మొదలవుతుంది.

చాలా మంది ఢిల్లీ ఎండలను తట్టుకోలేక మార్చి నుంచి జులై మధ్యలో మనాలికి వస్తుంటారు. ఇలాంటి సమయంలో కూడా మీకు కొన్ని ప్రాంతాల్లో అంటే సొలాంగ్, అటల్ టన్నెల్, రోహ్తాంగ్ పాస్, సిసులో మంచు కనిపిస్తుంది.
ఇలాంటి ప్రాంతాల్లో మీరు ఎన్నో యాక్టివిటీస్ చేయొచ్చు. నేను సొలాంగ్లో స్కీయింగ్ ప్రాక్టిస్ చేశాను.ఎన్ని సార్లు ప్రయత్నించినా నేను స్కీయింగ్ చేయలేకపోయాను. మేబీ ఒకటికి రెండు నెలలు ప్రాక్టిస్ చేస్తే నేను కూడా సినిమా హీరోల్లా స్కీయింగ్ చేయగలనేమో.
సొలాంగ్ వ్యాలీలో చాలా మంది అడ్బెంచర్స్ (Adventure) చేయడానికి ఇష్టపడతారు. నేను కూడా ఇలా రాక్ క్రాసింగ్ చేశాను.
- ఇది కూడా చదవండి : : విజయవాడకు దగ్గర్లో కుటుంబ సమేతంగా వెళ్లగలిగే 7 డెస్టినేషన్స్
3.మనాలిలో ఎక్కడ ఉండాలి ? | Hotels in Manali ?
చాలా మంది మనాలికి (Manali) 30 కిమీ దూరం నుంచే హోటల్స్‌లో చెకింగ్ చేయడం ప్రారంభిస్తారు. కానీ నేను మాత్రం ఎక్కడికి వెళ్లినా అక్కడి మాల్ రోడ్ అంటే మెయిన్ మార్కెట్ కి దగ్గరగా ఉండేలా చూసుకుంటాను.
రేటు అటూ ఇటు అయినా ట్రావెల్ చార్జెస్ మిగులుతాయి కదా అక్కడ సేవ్ చేసుకుంటాను.

మనాలీలో మీకు 800 నుంచి 10 వేల వరకు చార్జ్ చేసే హోటల్స్ రూమ్స్ దొరుకుతాయి. అయితే మీరు ట్రావెల్ ఏజెంట్స్‌తో డిస్కస్ చేసి మొత్తం టూరుకు ప్యాకేజీ మాట్లాడితే మీకు బడ్జెట్ అండ్ టైమ్ రెండూ సేవ్ అవుతాయి.
- ఇది కూడా చదవండి : Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్
4.బైక్ రెంటుపై దొరుకుతుంది | Bike on Rent In Manali
ఇక్కడ మంచుకొండల్లో ఘాట్ రోడ్డులో బైక్‌పై తిరగాలి అనుకునే వారికి బైకులు రెంటుపై కూడా లభిస్తాయి. వీటి ప్రైస్ రూ.500 నుంచి రూ.1800 వరకు ఉంటుంది.
లోకల్ ట్యాక్సీలో వెళ్లాలి అనుకుంటే మాత్రం రూ.4500 చార్జ్ చేస్తారు. మనాలీలో ఉన్న సైట్స్ అన్నీ చూపిస్తారు. అయితే రోహ్తాంగ్ పాస్ వెళ్లాలి అనుకుంటే మాత్రం ఎక్స్ట్రా రూ.3000 ఇవ్వాల్సి ఉంటుంది. ట్యాక్సీలు ముందు బుక్ చేయడం కన్నా అక్కడికి వెళ్లి బేరం చేసుకుంటేనే బెస్ట్.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
5.మనాలి వెళ్లే ముందు ఇవి ప్యాక్ చేసుకోండి
Essential Thing To Pack for Manali ? | ఇక మనాలికి వస్తే ఎలాంటి బట్టలు ప్యాక్ చేసుకోవాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు మీరు ఫుల్ వార్మర్, థర్మల్ వేర్ జాకెట్స్ వులెన్ క్యాప్స్ తీసుకెళ్లండి. మిగితా నెలల్లో జాకెట్స్ సరిపోతాయి.
ఇక్కడ స్నోలో అడ్వెంచర్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు స్నో డ్రెస్ తప్పుకుండా తీసుకోండి. మనాలిలో అడుగడుగున వీటిని 250 పర్డే రెంటుకు ఇస్తారు. ఇందులో స్నో షూస్ కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
6. సోలాంగ్ వ్యాలీ | SOLANG VALLEY
SOLANG VALLEY, Kullu District, Himachal Pradesh: మనాలి నుంచి 13 కిమీ దూరంలో సొలాంగ్ వాలీ ఉంది. ఇక్కడికి వెళ్లే దారులు చాలా బాగుంటాయి. మార్చి నుంచి జులై వరకు ఇక్కడ స్నో ఉంటుంది. చుట్టూ అందమైన కొండలు, సాహసయాత్రికులకు ఎన్నో యాక్టివిటీస్ ఉండటం వల్ల చాలా మంది మనాలి వచ్చేందుకు ఇష్టపడతారు.
ఇక్కడ మీరు ఎన్నో రకాల యాక్టివీటస్ చేయవచ్చు. ప్యారాగ్లైడింగ్, జార్బింగ్, స్కీయింగ్, రోప్ వే, స్నో మొబైలింగ్, క్వాడ్ బైకింగ్ చేయొచ్చు. కావాలంటే జడలబర్రెపై ఎక్కి రైడ్ చేయొచ్చు.రైల్వే క్రాసింగ్ వచ్చినప్పుడు ఇలాంటి లొకేషన్స్‌కి వచ్చినప్పుడు కాస్త ఆగి చూసి వెళ్లండి.
- ఇది కూడా చదవండి : Gallery : జీవింతంలో ఒక్కసారైనా చూడాల్సిన 7 అద్భుతమైన సన్‌రైజ్ పాయింట్స్
7.అటల్ టన్నెల్ | What Is Atal Tunnel
Atal Tunnel, Rohtang , Himachal Pradesh : గ్రేట్ హిమాలయల్లోని పిర్ పంజాల్ శ్రేణిలో ఉన్న అద్భుతమైన సొరంగ మార్గమే అటల్ టన్నెల్. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ టన్నెల్ మనాలి, లేహ్ లద్దాక్, స్పితీ వ్యాలిని కలుపుతుంది.

అటల్ టన్నెల్‌ను రోహ్తాంగ్ టన్నెల్ అని కూడా అంటారు. రోహ్తాంగ్ అనే పదానికి పార్సీలో గుట్ట అని అర్థం.
10 కిమీ పొడవైన ఈ టన్నెల్ రావడంతో ఇక్కడి వాళ్ల జీవితాలు శాశ్వతంగా మారిపోయాయి. ఎందుకంటే చలి కాలం వస్తే మనాలి నుంచి లేహ్ వెళ్లే దారి 6 నెలల పాటు మూసుకుపోయేది.
- ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
కానీ ఆ టన్నెల్ వచ్చాక ఈ దూరం 46 కిమీ తగ్గడంతో పాటు ఏడాది మొత్తం లేహ్ మనాలి మధ్య ప్రయాణాలు సాధ్యం అయ్యింది.
దీనిని నిర్మించే ఆలోచన మొట్టమొదటిసారిగా 1860 లో వచ్చిందట. తరువాత అటల్ బిహారీ వాజ్‌పేయ్ గారు ప్రధాని అయ్యాక 2000 సంవత్సరంలో రోహ్తాంగ్ టన్నెల్ కట్టనున్నాము అని ప్రకటించారు.
2010 లో రోహ్తాంగ్ టన్నెల్ నిర్మాణం ప్రారంభం కాగా… 2020 లో ప్రధాని మోదీ జాతికి అంకితం చేశారు. మీకో విషయం తెలుసా…ఈ టన్నెల్ కింద ఇంకో టన్నెల్ ఉంది. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో వాడేందుకు మాత్రమే. ప్రతీ రోజు మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల మధ్యలో మెయింటెనెన్స్ కోసం టన్నెల్‌ను మూసేస్తారు.
8.సిసు | Sissu Valley Near Manali
SISSU Valley, Lahaul District, Himachal Pradesh : అటల్ టన్నెల్ దాటగానే లాహోల్ జిల్లాలోని సిసు అనే వ్యాలీ వస్తుంది. ఇక్కడ చంద్రా రివర్ పక్కనే స్నోలో కాసేపు ఎంజాయ్ చేయొచ్చు.

ఇక్కడ హోటల్స్, వాష్‌రూమ్స్, ఏటీఎమ్‌లు ఏమీ ఉండవు. సో ఇది గమనించి వెళ్లండి.
సిసు నుంచి మీరు ముందుకు వెళ్తే కాజా ( Kaza) , కీలాంగ్ (KeyLong Valley ), స్పితీ వ్యాలీ ( Spiti ), జిబి ( Jibi ), లే లధాక్ ( Leh Laddakh) కూడా వెళ్లొచ్చు.
9. తప్పకుండా చూాడాల్సిన ప్రదేశాలు | Places In Manali
హిడింబా ఆలయం | Hidimba Devi Temple temple
ఈ ఆలయాన్ని దుంగారి టెంపుల్ అని కూడా అంటారు . భీముడి సతీమణి హిడింబాకు అంకితం చేసిన మందిరం ఇది.

నేను వెళ్లాలి అనుకున్న రోజు అక్కడ ఏదో ప్రత్యేక పూజలు జరుగుతన్నాయి అని టూరిస్టులను వెళ్లనివ్వలేదు. కానీ మీరు వెళ్లినప్పుడ మాత్రం తప్పకుండా చూసే అవకాశం ఉంటుంది.
వశిష్ట్ ఆలయం | Vashisht Temple and Hot Water Springs
వశిష్ట మహర్షి తపస్సు చేసిన ఈ ప్రాంతంలో నిర్మించిన ఆలయం ఇది. వశిష్ట మహర్షి కోసం లక్ష్మణుడు తన బాణాలతో వేడి నీటి ఊట అంటే Hot Water Springs ఏర్పాటు చేశారట.
జోగినీ ఫాల్స్ | Jogini Falls
అడ్వెంచర్స్ అంటే ఇష్టపడేవారు ఎక్కువగా ఇష్టపడే ప్రదేశం జోగినీ ఫాల్స్. మార్చ్ నుంచి డిసెంబర్ లోపు ఎక్కువ మంది వెళ్తుంటారు.
మనాలీ మాల్ రోడ్ | Manali Mall Road
మనాలి మాల్ రోడ్డులో మీకు నచ్చింది మీరు కొనొచ్చు. నచ్చింది తినొచ్చు. చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న సరుకును ఇక్కడ ఎక్కువగా అమ్ముతుంటారు.
వైష్ణోదేవీ ఆలయం , కులు | Vaishno Devi Temple, Kullu
మనాలి నుంచి కులు వెళ్లే దారిలో వైష్ణో దేవీ అమ్మవారి ఆలయం ఉంటుంది.ఆలయ ప్రాంగణంలోకి వెళ్లగానే అమ్మవారి కరుణ మనపై కలిగి ఫీలింగ్ కలుగుతుంది. ఆలయం లోపల ఫోటోగ్రఫీకి అనుమతి లేదు. ఇక్కడి నుంచి చూస్తే బియాస్ నదీ అందం ఏంటో అర్థం అవుతుంది.
వీటితో పాటు మనాలిలో చూడాల్సిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా
- .మను ఆలయం ( Manu Temple )
- గౌరీ శంకర్ ఆలయం ( Gauri Shankar Temple),
- బిజ్లీ మహాదేవ్ ఆలయం (Bijli Mahadev Temple)
- అలాగే మాల్ రోడ్లో ఉండే ది గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ( The Great Himalayan National Park )
- హిమాచల్ కల్చర్ అండ్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం ( Himachal Culture and Folk Art )
ఇంకా ఏమైనా మిస్సయి ఉంటే కామెంట్ చేయండి.
10.మనాలికి వచ్చే ముందు గుర్తుంచుకోండి | Manali Tips
TIPS For Manali :
- ఇక్కడ టెంపరేచర్ చాలా చల్లాగా ఉంటుంది. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వస్తే గట్టి బందోబస్తుతో రండి. స్వెటర్స్, జాకెట్స్, చలి క్యాప్స్, గ్లవ్స్, బూటట్స్, మఫ్లర్ తప్పకుండా తెచ్చుకోండి. ఏదైనా మిస్ అయితే అక్కడే కొనుక్కోవచ్చు.
- .స్నోలో , లేదా మంచు ఉన్న ప్రాంతాల్లో వెళ్లడానికి ముందు గమ్ బూట్స్ వేసుకోండి. లోకల్‌గా అమ్ముతారు. లేదా రెంటుకు తీసుకోవచ్చ.
- .చలికాలంలో హోటల్ రూమ్స్ ధర ఆకాశాన్ని తాకుతాయి. సో మీరు కొంచెం ఔట్స్స్కర్ట్స్లో హోటల్స్ లేదా హోం స్టేస్‌లో దిగితే బెస్ట్.
- .ఎమర్జెన్సీలో వాడటానికి మీతో మెడికల్ కిట్ క్యారీ చేయండి.యాంటిబయాటిక్స్, జబ్బు, దగ్గు, యాంటిసెప్టిక్స్, జండూబామ్ లాంటివి క్యారీ చేయండి.
- వీలైతే సొంతం డ్రైవింగ్ చేయకుండా ట్యాక్సీలు మాట్లాడుకోండి.రాత్రిపూట ప్రయాణాలు పెట్టుకోకండి.
నేను ఎన్నో హిల్ స్టేషన్స్‌కు (Hill Stations) వెళ్లాను…కానీ మనాలీ విషయంలో పర్యటకులకు ఉన్న క్రేజ్ చాలా ఎక్కువ అని గమనించాను. చాలా మంది వింటర్లో ఖచ్చితంగా మనాలీ వెళ్లేలా ప్లాన్ చేస్తుంటారు. అందుకే అక్కడ వింటర్లో టూమచ్ ట్రాఫిక్ ఉంటుంది. ఏదో జాతరలా అనిపిస్తుంది నాకు అందుకే పీక్ సీజన్లో వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.
{ “@context”: “https://schema.org”, “@type”: “FAQPage”, “mainEntity”: [ { “@type”: “Question”, “name”: “Where is Manali located?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “Manali is located in Kullu district of Himachal Pradesh, India.” } }, { “@type”: “Question”, “name”: “What is the best time to visit Manali?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “The best time to visit Manali is from October to July. Snowfall can be seen from December to February.” } }, { “@type”: “Question”, “name”: “How to reach Manali?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “Manali has no direct railway station or airport. Travelers usually reach Delhi or Chandigarh first and then travel by bus or taxi.” } }, { “@type”: “Question”, “name”: “Does Manali have snowfall?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “Yes, Manali receives snowfall during December, January and February.” } }, { “@type”: “Question”, “name”: “What are the top places to visit in Manali?”, “acceptedAnswer”: { “@type”: “Answer”, “text”: “Top places include Solang Valley, Atal Tunnel, Sissu Valley, Hidimba Temple, Vashisht Temple, Jogini Falls and Mall Road.” } } ] }మనాలీపై ఒక వీడియోను చేశాను. మీరు కూడా చూడండి : మనాలీ కంప్లీట్ ట్రావెల్ గైడ్
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
