ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారని మీ అందరికి తెలుసు. తన ఎక్స్ హ్యాండిల్లో నిత్యం ఆసక్తికరమైన వీడియో లేదా ఫోటోలు షేర్ చేస్తుంటారు. అయితే ఇటీవలే ఆయన పోస్ట్ చేసిన వీడియోను చూసి చాలా మంది ఆధ్మాత్మిక ఆనందంలో తేలియాడారు.
హిందువులకు అత్యంత పవిత్ర పర్వతం అయిన కైలాస పర్వతం ( Mount Kailash) వీడియో తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు Anand Mahindra.
Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
మౌంట్ కైలాష్‌ను ఇప్పటి వరకు ఎవరూ అధిరోహించలేదు అని. కానీ అందరి మనసు అక్కడికి వెళ్లాలని కోరుకుంటుంది. జీవిత లక్ష్యం ఏంటో చెప్పే సరైన విధానం ఇదే అని క్యాప్షన్ కూడా పెట్టారు ఆనంద్ మహీంద్రా.
మౌంట్ కైలాష్‌కు చెందిన ఈ వీడియోను క్రోనట్ అనే ఎకౌంట్ నుంచి షేర్ చేయగా అది ఆనంద్ మహీంద్రా షర్ చేశారు. మౌంట్ కైలాష్ చుట్టూ తెల్లని మేఘాలు ఏర్పాటు అవడాన్ని మీరు చూడవచ్చు.
ఈ వీడియో నిజం కాదట…
చాలా మంది ఈ వీడియోను ఇష్టపడుతున్నారు. అయితే ఇది నిజమైన వీడియో కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో క్రియేట్ చేసినది అని చాలా మంది కామెంట్ చేశారు.
కైలాస పర్వతం అనేది హిందువులకే కాదు బౌద్ధ మతస్థులకు, జైన మతస్థులకు అత్యంత పవిత్రమైన పర్వతం. కైలాస పర్వతాన్ని దర్శించుకోవాలని కోట్లాది మంది భారతీయులు కోరకుంటారు. అయితే ప్రస్తుతం ఈ పర్వతం చైనా ఆధీనంలో ఉండటంతో ఇక్కడికి వెళ్లడం సాధ్యం కాదు. Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
ముగింపు | This Story Ends Here
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
Photo Credit Notes :
- Screengrab from X Account
- I Don’t Claim Ownership Neither Intended To do so.
- Photos Used For Narrative Purpose