Azerbaijan : అజర్ బైజాన్‌ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? టాప్ 5 ప్రదేశాలు ! 

ఈ మధ్య కాలంలో భారతీయ పర్యాటకులు ఎక్కువగా వెళ్తున్న టూరిస్ట్ డెస్టినేషన్‌లో అజర్‌బైజాన్ ( azerbaijan) కూడా ఒకటి. ఈ దేశ సంప్రదాయాలు ఆచారాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఆధునాతన నిర్మాణాలు, భవనాలు అన్నీ పర్యటకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మీరు కూడా అజర్‌బైజాన్ ప్లాన్ చేస్తోంటే ఈ పోస్టు మీకు పెద్దబాలశిక్షలా సహాయపడుతుంది. 

అజర్ బైజాన్ చరిత్ర | Azerbaijan History

అజర్ బైజాన్‌ చరిత్ర చాలా విశిష్టమైనది. పురాతనమైనది. ఇక్కడ పర్షియా నుంచి ఓట్టోమన్ వరకు ఎంతో మంది రాజ్యాల రాజులు రాజ్యం చేశారు. 20వ శతాబ్దంలో అంటే సరిగ్గా చెప్పాలి అంటే 1918 లో రష్యా నుంచి విడిపోయి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుంది ఈ దేశం.

Baku-Pixabay-Prayanikudu
ఆధునికతకు నిదర్శనంగా బాకులోని కట్టడాలు | PC: Pixabay

స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకున్న తొలి ముస్లిం మెజారిటీ ఉన్న ప్రజాస్వామ్య దేశం అజర్ బైజాన్.అయితే 1920 లో ఈ దేశంలో యూఎస్‌ఎస్సార్ ( USSR) లో విలీనం అయింది. 1991 లో సోవియట్ యూనియన్ పతనం అవడంతో అజర్ బైజాన్ స్వాతంత్క్రం పొందింది. ఈ దేశం ఎన్నో సంక్లిష్ట పరిస్థితులను తట్టుకుని తిరిగి నిలబడింది.  

Read Also: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

ప్రస్తుతం అజర్ బైజాన్ ఆర్థికంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం తన వద్ద ఉన్న చమురు, సహజ వాయువు నిక్షేపాలను సమర్థవంతంగా వినియోగిస్తోంది. పశ్చిమాది, తూర్పు దేశాలతో స్నేహంగా ఉంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటోంది .

అజర్ బైజాన్ ఎక్కడుంది? 

అజర్ బైజాన్ భౌగోళిక స్వరూపం అత్యంత విశిష్టమైనది. అజర్ బైజాన్ ఇటు ఆసియా, అటు ఐరోపా రెండు ఖండాల మధ్య ఉన్న దేశం. దేశానికి ఉత్తరాన రష్యా ఉంది. వాయువ్యం ( North west) వైపున ఐరాపాలోని జార్జియా దేశం ఉంది. దక్షిణాన ఇరాన్, పశ్చిమాన టర్కీ ఉంది. ఈ దేశం రాజధాని పేరు బాకు ( Baku City).

అజర్ బైజాన్ ఎప్పుడు వెళ్లాలి ?

అజర్ బైజాన్‌కు వెళ్లడానికి బెస్ట్ సీజన్ ఏంటి అని చాలా ది సెర్చ్ చేస్తుంటారు. నిజానికి ఈ దేశానికి ఎప్పుడు వెళ్లినా మీరు డిస్సపాయింట్ అవ్వరు.  ఎందుకంటే ప్రతీ సీజన్‌లో మీరు ఎంజాయ్ చేయడానికి ఒక రీజన్ దొరుకుతుంది. అయితే ఏ సీజన్‌లో ఎలా ఉంటుందో మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు వెళ్లాలో మీరు నిర్ణయించుకోండి.

1.వసంతకాలం (Spring) | మార్చి నుంచి మే  )

అజర్ బైజాన్ అనేది చక్కని ల్యాండ్ స్కేప్ ఉన్న దేశం. దూర దూరం వరకు మీకు అందమైన సీనరీస్ కనిపిస్తాయి. మార్చి నెలలో కూడా చాలా మంది ఈ దేశానికి వెళ్తుంటారు. ఎందుకంటే వాతావరణం అంత వేడిగా ఉండదు. అంత చలిగా కూడా ఉండదు. దీంతో పాటు అప్పుడే మంచును వీడిన పర్వతాలు, లోయలు, మైదానాలు అన్నీ కూడా అందంగా కనిపిస్తాయి.

Azerbaijan-pixabay-prayanikudu
అజర్ బైజాన్‌ | Pixabay
2.ఎండాకాలం ( జూన్ – ఆగస్టు)

ఎండాకాలం ఇక్కడ కాస్త వేడిగానే ఉంటుంది. అజర్ బైజాన్ రాజధాని అయిన బాకులో సూర్యకిరణాలు చాకులా గుచ్చుకుంటాయి. ఎండాకాలం ఇక్కడ ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. అయితే ఈ సమయంలో బీచ్ యాక్టివిటీస్ కోరుకుంటే మాత్రం కాస్పియన్ తీర ప్రాంతానికి ( Caspian Sea Coast) వెళ్లవచ్చు.

3.శరదృతువు ( Autumn- సెప్టెంబర్-నవంబర్)

వసంత  కాలం లాగే శరదృతువులో కూడా అజర్ బైజాన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఈ సమయంలో వాతావరణం బాగుంటుంది. హసాన్ని ఇష్టపడే వాళ్లు ఇక్కడ హైకింగ్ కోసం వస్తుంటారు. నచ్చినవారి సావాసాన్ని ఇష్టపడేవారు కంట్రీసైడ్‌లో తమ భాగస్వామితో కలిసి ఎక్స్‌ప్లోర్ చేస్తుంటారు.

Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

4. చలికాలం ( డిసెంబర్  నుంచి ఫిబ్రవరి )

చాల గ్యాప్ తరువాత బిర్యానీ తింటే వచ్చే కిక్ ఉంటుంది చూడండి అలాంటి కిక్కే అజర్ బైజాన్‌‌కు వింటర్లో వస్తే కలుగుతుంది. ఈ సమయంలో కొత్త పెళ్లికూతురు అలంకరణతో ఎంత చక్కగా ఉంటుందో అంతే చక్కగా ఉంటుంది ఈ దేశం. షాదాగ్ ( Shahdag), కూబా ( Quba ) వంటి పర్వత ప్రాంతాల్లో స్కీయింగ్, స్నో బోర్డింగ్ ఎంజాయ్ చేయవచ్చు. 


Shahdag Mountain - Azerbaijan-unsplash-prayanikudu
షాదాగ్‌లో మంచుతో కప్పబడిన పర్వతం | PC: Unsplash

ఈ ప్రాంతాలకు వెళ్లే సమయంలో కనిపించే సీన్స్ ఉంటాయి చూడండి వాటి అందాన్ని మాటలతో వర్ణించాలి అంటే అనంత్ శ్రీరామ్ నుంచి కొంత సాహిత్యాన్ని అరువు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ టైమ్‌లో సముద్ర తీరాల్లోకి వెళ్లే వారు చాలా తక్కువ. అంత చల్లని నీటిలో స్విమ్ ఎవరు చేస్తారు చెప్పండి. 

అజర్ బైజాన్‌ ఎలా వెళ్లాలి ? | How to Go To Azerbaijan

అజర్ బైజాన్‌కు హైదరాబాద్ డైరక్ట్ ఫ్లైట్స్ ( Hyderabad to Azerbaijan Flight)  ఇప్పటికైతే లేవు. మీరు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కి ఈ దేశ రాజధాని బాకు ఎయిర్‌పోర్టుకు చేరుకోవచ్చు. అయితే మీరు హైదరాబాద్ నుంచి అజర్ బైజాన్‌కు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మధ్యలో డిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కాల్సి ఉంటుంది. 

Azerbaijan telugu travel Information Prayanikudu

వన్ వే రూట్ టికెట్ వచ్చేసి మీకు రూ.22000 నుంచి రూ.25000 వరకు పడవచ్చు ( సీజన్ అండ్ డిమాండ్‌ను బట్టి తగ్గొచ్చు పెరగొచ్చు. అప్ అండ్ డౌన్ టికెట్స్ ( Azerbaijan Flight Ticket Cost)  మీకు రూ.46000 వరకు పడుతుంది. 

Prayanikudu WhatsApp2
ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here

ఇది ఎకానమీ క్లాస్‌లో అడల్డ్‌ టికెట్ కాస్ట్. బుకింగ్ క్లాస్‌ను బట్టి ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఢిల్లీలో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం వేచి చూడాల్సి ఉంటుంది. మొత్తంగా 11 గంటల వరకు సమయం పడుతుంది హైదరాబాద్ నుంచి అజర్ బైజాన్ వెళ్లాలి అంటే. ఇక గన్నవరం విషయానికి వస్తే ఇక్కడి నుంచి అజర్ బైజాన్‌కు డైరెక్ట్ లేదా వన్ స్టాప్ సర్వీసులు లేవు. మీరు హైదరాాబాద్ లేదా ఢిల్లీ నుంచి వెళ్లేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది

Read Also:Also Read : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది

అజర్ బైజాన్‌‌లో చూడాల్సిన 5 ప్రదేశాలు

Top 5 Places to Visit In Azerbaijan | అజర్ బైజాన్‌లో ఎన్నో పర్యటక స్థలాలు ఉన్నాయి. అయితే అందులో 5 ప్రాంతాల గురించి మీకు నేను వివరిస్తాను. మీ టైమ్ అండ్ ప్లానింగ్ ప్రకారం మీరు స్థానికంగా మరికొన్ని ప్రాంతాలను సందర్శించవచ్చు.

1. బాకు | Baku City

బాకు అనేది అజర్ బైజాన్‌ దేశానికి రాజధాని. ఈ నగరం అనేక చారిత్రాత్మక కట్టడాలకు, స్థలాలకు నెలవు. దాంతో పాటు ఆధునిక నిర్మాణాలకు కూడా బాకు సిటీ చాలా పాపులర్. 

Baku City At Night Azerbaijan Prayanikudu Pexels
రాత్రి సమంలో అజర్ బైజాన్ రాజధాని బాకు | Photo : Pexels

చాలా మంది బాకు వెళ్తే ముందు ఈ నగరానికి ఐకాన్‌గా నిలిచిన ఫ్లేమ్ టవర్స్‌ను ( Flame Towrs Baku) చూడాలని కోరుకుంటారు. ఆధునిక అజర్ బైజాన్‌‌కు ఇది ఒక ఉదాహరణగా చెబుతుంటారు.

Prayanikudu

దీంతో పాటు బాకు బోలోవర్డ్  (baku boulevard) అనే ఇక్కడి నేషనల్ పార్క్ అండ్ కాస్పియన్ సీను చూడటానికి వెళ్లవచ్చు.

మనకు ఇక్కడ కోఠి, చార్మినార్, ఆబిడ్స్ ఉన్నట్టే  బాకులో ఫౌంటేన్ స్వ్కేర్ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ ఎన్నో షాపులు, కేఫేలు, రెస్టారెంట్స్ ఉంటాయి. జాలీగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. దీంతో పాటు మీరు అజర్ బైజాన్ కార్పెట్ మ్యూజియం, అప్లాండ్ పార్క్, నిజామీ స్ట్రీట్ , అతేష్‌గా అనే ఫైర్ టెంపుల్, గోబుస్తాన్ నేషనల్ పార్క్, యనార్ డాగ్ ( ఇక్కడ నేచురల్ గ్యాస్ వల్ల నిత్యం నిప్పు వెలుగుతూనే ఉంటుంది) వంటి ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు.

2. బెస్ట్ బర్మాగ్ | Best Bermag

అజర్ బైజాన్ నేచర్‌తో పాటు ఆ దేశ ఆచారాలు, జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి మీరు బెస్ట్ బర్మాగ్  వెళ్లొచ్చు. ఇక్కడి ల్యాండ్ స్కేప్ చూసి పర్యటకులు మురిసిపోతుంటారు. చాలా మంది అడ్వెంచర్స్ చేయడానికి ఇక్కడికి వస్తుంటారు. దూరం నుంచి ఈ ప్రాంతాన్ని చూస్తూ ఎంత టైమ్ అయినా గడిపేయవచ్చు.  స్థానిక మార్కెట్‌లో ఎన్నో లోకల్ వెరైటీ ఉత్పత్తులను సావనీర్‌గా ( జ్ఞాపకార్థం )  కొనొచ్చు మీరు. 

Besh Barmag- azerbaijan-prayanikudu-unsplash
చలికాలం బెస్ట్ బెర్మాగ్ అందం | PC : Unsplash
3. ఇచేరీ షెహర్ | Icheri Sheher, Baku

ప్రతీ సిటీకి ఒక కథ ఉంటుంది. ఒక చరిత్ర ఉంటుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ దుబాయ్ వరకు ప్రతీ నగరంలో ఒక ఓల్డ్ సిటీ ఉంటుంది. అలాగే అజర్ బైజాన్ సిటీలో ఇచేరి షహర్ ( Icheri Sheher) అనేపేరుతో ఓల్డ్ సిటీ ఉంది. ఈ నగరాన్ని యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా (UNESCO) గుర్తించారు.  అజర్ బైజాన్ చరిత్రను, సంప్రదాయాలను ఈ ప్రాంతం కళ్లకు కట్టినట్టు చూపుతుంది.

Icheri Sheher-pexels-prayanikudu-azerbaijan
అజర్ బైజాన్ పాతబస్తి ఇచ్చేరి షహర్ | Pc: Pexels

మన పాత బస్తీలో ఉన్నట్టుగానే ఇక్కడ చిన్న చిన్న గల్లీలు ఉంటాయి. ప్రతీ గల్లీకి ఒక చరిత్ర ఉంటుంది. అజర్ బైజాన్ ఓల్డ్ సిటీలో మైదానీ టవర్ ( baku maidani tower), షిర్వాన్షా ప్యాలెస్‌ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. Read Also:  Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు

4. లహిజ్ | Lahij Village

ప్రతీ దేశంలో ఎన్నో చారిత్రాత్మక గ్రామాలు ఉంటాయి. ఇవి ఆ దేశ సంప్రదాయలు, ఆచారాలను తరువాతి తరానికి అందిస్తుంటాయి.  అజర్ బైజాన్‌లో అలాంటి ఒక గ్రామమే లహిజ్ గ్రామం ( Lahij Village).  కొండ ప్రాంతంలో ఉండే ఈ గ్రామం చాలా అందంగా ఉంటుంది. 

lahij Village-azerbaijan-pexels-prayanikudu
అజర్ బైజాన్ మూలాలను కాపాడుతున్న గ్రామం | PC: pexels

ఇక్కడ హ్యాండి క్రాఫ్ట్స్‌ చాలా పాపులర్. ఈ గ్రామంలో ఏ మూలన వెళ్లినా, ఏ వీధిలో తిరిగినా అజర్ బైజాన్ మూలాలు కనిపిస్తాయి. ఇక్కడ సిరిసిల్లా చేనేత అన్నల్లా, కొండపల్లి కళకారుల్లా రకరకాల కళాకారులు కనిపిస్తారు. రాగి పరికరాలతో పాటు సంప్రదాయ కార్పెట్లను తయారు చేసే గ్రామస్తులు చాలా మంది ఇక్కడ దర్శనం ఇస్తారు.

5.షేకీ | Sheki
Sheki-Azerbaijan-prayanikudu-unsplash
షేకీ గ్రామం | Pc: Unsplash

అజర్ బైజాన్‌లో తప్పుకుండా చూాడాల్సిన ప్రాంతం షేకీ  ( Sheki). ఇది గ్రేటర్ కాకసన్ పర్వతాల పాదభాగంలో ఉంటుంది. ఈ ప్రాంతలో నిర్మాణాలు చాలా మందిని ఆకట్టుకుంటాయి. మరీ ముఖ్యంగా చాలా మంది షేకీ ఖాన్ ప్యాలెస్ చూడటానికి వస్తుంటారు. స్థానికంగా లభించే స్వీట్స్‌ని ఫుడ్ లవర్స్ చాలా ఇష్టంగా ఆరగిస్తారు. షేకీ హల్వా అయితే హాట్ కేకులా అమ్ముడుపోతుంది.

అజర్ బైజాన్ భోజనం | Azerbaijan Food 

అజర్ బైజాన్‌లో ఫుడ్ అనేది ఒక ఇమోషన్ అని చెప్పవచ్చు. ఇమోషన్ అనడం కూడా సరిపోదు. ఇక్కడ లభించే ఫుడ్ అనేది ఇక్కడి సంప్రదాయానికి, చరిత్రకు సాక్ష్యం అని చెప్పవచ్చు.

అజర్ బైజాన్‌లో ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ 
  • డోల్మా ( Dolma) :  ఇది అజర్ బైజాన్ నేషనల్ డిష్. ద్రాక్షాల ఆకుల్లో కొంచెం రైస్,  మాసం లేదా కూరగాయలు, డ్రై ఫ్రూట్స్‌లను చుట్టి ఉడకబెడతారు. 
  • ప్లావ్ (plov) :  ప్లావ్ ప్లావ్ ప్లావ్ ప్లావ్ అని ఐదు సార్లు అనండి..పులావ్‌లాగే వినిపిస్తోంది కదా. నిజానికి ప్లావ్ కూడా పులావ్ లాంటిదే. అజర్ బైజాన్ భోజనంలో ఇది ఖచ్చితంగా ఉంటుంది. 
  • కబాబ్స్ : మాసాబ్ ట్యాంకులోని ఆఫ్ఘానీ కబాబ్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆప్షానిస్తాన్‌ వరకు కబాబ్ చాలా కామన్. అజర్ బైజాన్ కూడా దీనికి మినహాయింపు కాదు
  • దీంతో పాటు దుష్బరా, ఖుతాబ్, పిటీ, సాఫ్రాన్ టీ, షేకుర్బురా, బక్లావా, వంటి ఎన్నో డిషెస్ మీరు ట్రై చేయొచ్చు.
  • Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

అజర్ బైజాన్ కరెన్సీ రేటు  

Indian Currency Exchange Rate In Azerbaijan : మన దగ్గర రూపాయి ఎలాగో అజర్ బైజాన్‌లో మనత్ (manat) అలాగ. ఈ దేశానికి వెళ్లే ముందు మీరు కొంత డబ్బును మనత్‌ రూపంలో కన్వర్ట్ చేసుకుంటే బెటర్. మీరు ఎయిర్‌పోర్టులో కూడా డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు లేదా కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే చార్జీలు వేరువేరుగా ఉంటాయి.ఒక్క మనత్ విలువ రూ.50. అంటే ఇక్కడి పదివేలు 200 మనత్‌లతో సమానం

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని లింక్స్ లేదా ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

Leave a Comment

error: Content is protected !!