దేవుడికి భక్తులు తమకు నచ్చిన పదార్థాలను లేదా వస్తువులను సమర్పించి తమ భక్తిని చాటుకుంటారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఒక్కో ఆలయంలో ఒక్కో రకమైన ప్రసాదాన్ని అందిస్తారు. అయితే మన దేశంలో ఒక ఆలయంలో మాత్రం టీ అంటే ఛాయ్‌ని (Tea Prasad) ప్రసాదంగా ఇస్తారని మీకు తెలుసా? ఈ ఆలయం ఎక్కడుంది ఇక్కడికి ఎలా వెళ్లాలో ఈ పోస్టులో చూసేయండి.
ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని దేవ్ భూమీ ( Dev Bhoomi ) అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎన్నో పవిత్ర క్షేత్రాలు, పుణ్యనదులు, పౌరాణిక విశిష్టత ఉన్న స్థలాలు పర్వతాలు ఉన్నాయి. దీంతో పాటు ఉత్తరాఖండ్ పర్యాటకులకు ఫేవరిట్ డెస్టినేషన్ కూడా. ఇక్కడ ఎన్నో హిల్ స్టేషన్స్ కూడా ఉన్నాయి.
ముఖ్యాంశాలు
ఈ ఆలయం ఎక్కడ ఉంది ?
ఉత్తారాఖండ్‌లో ఉన్న ముస్సోరిని క్వీన్ ఇఫ్ హిల్‌స్టేషన్ ( Queen Of Hill Station) అంటారు.
ఈ క్వీన్‌ఆఫ్ హిల్ స్టేషన్‌కు వెళ్లే దారిలోనే ఉంటుంది శ్రీ ప్రకాశేశ్వర్ మహాదేవ్ ఆలయం. ఈ ఆలయం బయటి నుంచి చూడటానికి చాలా అందంగా ఉంటుంది.
Read Also: Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ
హిమాలయ పర్వతాల పాదభాగంలో ఉన్న డెహ్రూడూన్ నుంచి ముసోరి వెళ్లే దారిలో ఈ ఆలయం ఉంటుంది. శ్రీ ప్రకాశేశ్వర్ ఆలయ ( Sri Prakasheshwar Mahadev Temple) దర్శనం కోసం వెహికల్ నుంచి దిగగానే ఏదో ఫ్రిడ్జిలోకి ఎంటరైనంత చలిగా ఉంటుంది.
చెప్పులు విడిచి ఆలయం లోపలికి వెళ్లే సమయానికి కాళ్లు చలికి గడ్డకట్టుకుపోయినట్టు అవుతాయి. ఇంత చలిలో కూడా మహాశివుడిని దర్శనం చేసుకుని భక్తులు తరిస్తారు.
టీ ప్రసాదం గురించి | About Tea Prasada
మహాశివుడి దర్శనం చేసుకుని వెళ్లే భక్తులకు ఈ ఆలయంలో వేడి వేడి టీని ప్రసాదంగా అందిస్తారు. మొదటిసారి టీ ప్రసాదం అనగానే ఎలా ఇస్తారు? మన దగ్గర గ్లాస్ కూడా లేదు అని సిల్లీ థాట్స్ రావడం కామన్.
టీ కోసం ఒక్క పైసా కూడా తీసుకోరు
అయితే ఇక్కడ వాళ్లే గ్లాసు ఇస్తారు. వాళ్లే టీ ఇస్తారు. మనం టీ తీసుకుని ఆలయంలో ఒకసైడ్‌లో నిలబడి తాగేసి కడిగేసి తిరిగి ఇచ్చేయాలి. ప్రాసెస్ చాలా సింపుల్‌గా ఉంది కదా.
కానుకలు సమర్పించరాదు…
చాలా ఆలయాల్లో కానుకలు వేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. కానీ ఈ శివ మందిరంలో మాత్రం కానుకలను అస్సలు ప్రోత్సాహించరు. అక్కడ పెద్ద పెద్ద అక్షరాలతో క్లియర్‌గా రాస్తారు. మీరు ఎలాంటి కానుకలు సమర్పించకండి అని.
అందుకే మీరు ఈ ఆలయానికి వెళ్తే మాత్రం ఎలాంటి కానుకలు తీసుకెళ్లకండి. అలా తీసుకెళ్తే మాత్రం ఆలయంలో అయ్యగాారు మిమ్మల్ని ఏమన్నా అంటే మాత్రం అది మా రెస్పాన్సిబిలిటీ కాదు.
దానాలు, ప్రసాదాలు ఎందుకు తీసుకోవడం లేదు అని అడిగితే దేవుడిపై ఫోకస్ చేయండి కానుకలపై కాదు అన్నారు. నా ఆన్సర్ నాకు దొరికింది. మీక్కూడా మీ ఆన్సర్ దొరికింది అని ఆశిస్తున్నాను.
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
శ్రీ ప్రకాశేశ్వర్ ఆలయంలో శివరాత్రి, శ్రావణ మాసంలో ప్రత్యేక ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. అన్నదానాలు చేస్తారు. శివరాత్రికి భాంగ్ కూడా ఇస్తారు.
స్పెషల్ టీ ప్రసాదం
ఈ ఆలయానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మందికి టీ ప్రసాదం రుచి చూడాలని ఉంటుంది. డెహ్రాడూన్ టీ తోటల్లోంచి తీసుకొచ్చే టీ పొడితో ఈ ఛాయ్ తయారు చేస్తారు. ఈ టీ రంగు రుచీ వాసన మూడూ బాగుంటాయి.
చాలా మంది ఆలయం బయటికి వచ్చి వ్యూ చూస్తూ టీ తాగుతుంటారు. అయితే స్పెషల్ డేస్‌లో టీ ప్రసాదం కోసం మీరు లైన్లో నిలబడాల్సి ఉంటుంది. మీరు కప్పు తీసుకున్న తరువాత టీ తాగిన తరువాత రెండు సార్లూ టీ కప్పు లేదా గ్లాసును కడగటం మర్చిపోకండి.
కోతులతో జాగ్రత్త..
ఈ ఆలయం సమీపంలో మీకు లక్కీ స్టోన్స్, జ్యూయెల్లరీ అమ్మే చిన్న చిన్న స్టోర్స్ కూడా కనిపిస్తాయి. మీరు లక్కీ అయితే అక్కడే మీకు ఐస్ క్రీమ్ కూడా దొరుకుతుంది.
మీరు పరధ్యానంలో ఉంటే అదే ఐస్‌క్రీమ్ క్షణాల్లో ఒక కోతి చేతుల్లో ఉంటుంది. ఇక్కడ కోతులు కూడా ఉంటాయి జాగ్రత్త.
ఆలయంలో ఇచ్చే టీతో సరిపెట్టుకుంటే సరే సరీ, లేదూ కూడదు అంటే దగ్గర్లో మీకు మ్యాగీ పాయింట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అది ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. ఉంటే మ్యాగీ తినేసి ముసోరిలో మ్యాగీ తిన్నాం బ్రేక్‌లో ఆగి అని ఇన్‌స్టాలో పోస్ట్ చేయొచ్చు.
Read Also: Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
ఇవి కూడా చూడండి…
శ్రీ ప్రకాశేశ్వర్ ఆలయం డెహ్రాడూన్‌కు దగ్గర్లో ఉంటుంది. ముస్సోరికి వెళ్లే దారిలో అన్నమాట. మీకు టైమ్ ఉంటే ముస్సోరికి వెళ్లే ముందు దగ్గర్లో ఉన్న ఈ టూరిస్ట్ స్పాట్స్ ( Places Near Dehradun) కూడా కవర్ చేయండి.
- మాల్సీ డీర్ పార్క్ | Malsi Deer Park : మాల్సీ డీర్ పార్కులో ఎన్నో రకాల జింకలను మనం చూడొచ్చు. పిల్లలు జింకలను చూసి చాలా ఎక్సైట్ అవుతారు. వాళ్లే జింకల్లా చెంగు చెంగుమని ఎగురుతారు.
- పాసిఫిక్ మాల్ | Pacific Mall : ఈ షాపింగ్‌మాల్‌లో మీరు లోకల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ వస్తువులు, దుస్తువులను కొనుగోలు చేయవచ్చు.
- టిబెటన్ మోనాస్టరీ | Tibetan Monastery : మోనాస్టరీ అనేది బౌద్ధ మతస్థులకు ఆలయం. ఇక్కడ మీరు టిబెటియన్ నిర్మాణ శైలిని, వారి సంప్రదాయాలు, ఆచారాల గురించి తెలుసుకోవచ్చు.
- భట్టా ఫాల్స్ | Bhatta Falls : నేచర్ లవర్స్ , జలపాతాలు ఇష్టపడే వారికి భట్టా ఫాల్స్ బాగా నచ్చుతుంది. ఇక్కడ మీరు రకరకాల రీల్స్ చేయొచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు. ఇవన్నీ కాదు అంటే కాసేపు సరదాగా టైమ్ స్పెండ్ చేయొచ్చు.
- రాబర్స్ కేవ్స్ | Roberts Caves : భారత్‌లో ఉన్న పాపులర్ గుహల్లో రాబర్స్ కేవ్స్ కూడా ఒకటి. రాబర్స్ అంటే దోపిడి దొంగలు. ఇక్కడ పాత కాలంలో దొంగలు తమ చోరీ సొత్తును దాచి పెట్టేవారట.
ఈ శివ మందిరానికి ఎలా చేరుకోవాలి ?
How To Reach Sri Prakasheshwar Shiv Mandir : టీని ప్రసాదంలో ఇచ్చే ఈ శివాలయానికి రావాలంటే ముందు మీరు ఎలా రావాలని అనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి.
- బస్సులో …| Dehradun , Mussoorie By Bus
బస్సులో రావాలి అనుకుంటే ఢిల్లీ నుంచి డెహ్రడూన్ చేరుకోవచ్చు. తరువాత డెహ్రాడూన్ నుంచి ముస్సోరికి వెళ్లే బస్సు ఎక్కేయండి. మీరు రిషికేష్, హరిద్వార్ నుంచి కూడా ముస్సోరి లేదా డెహ్రాడూన్ చేరుకోవచ్చు.
- ట్రైనులో | Dehradun , Mussoorie By Train
ఈ ఆలయానికి మీరు ట్రైన్‌లో రావాలి అనుకుంటే మీకు దగ్గర్లోనే డెహ్రాడూన్ రైల్వే స్టేషన్ ఉంటుంది. లేదా మీరు రిషికేష్ రైల్వే స్టేషన్‌కు వచ్చి అక్కడి నుంచి డెహ్రాడూన్ లేదా ముస్సోరి బస్ క్యాచ్ చేయొచ్చు.
- విమానంలో రావాలి అనుకుంటే…
లక్కీగా డెహ్రాడూన్‌లో ఒక ఎయిర్ పోర్టు ఉంది. దాని పేరు జాలీ గ్రాండ్ ఎయిర్‌పోర్టు ( Jolly Grand Airport). ఈ ఆలయం నుంచి జాలీ గ్రాండ్ ఎయిర్ పోర్టు కేవలం 41 కిమీ దూరంలోనే ఉంటుంది.
మీరు రిషికేష్, హరిద్వార్, కేదార్‌నాథ్, బద్రినాథ్ యాత్రలకు వెళ్లే సమయంలో కూడా ఈ ఆలయానికి వెళ్లవచ్చు. లేదా దగ్గర్లో ఉంటే ఈ ఆలయానికి వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.