Bhakra Nangal Train: ప్రపంచంలో, టికెట్ తీసుకోకుండా నడిచే ఒకే ఒక ట్రైన్ ఇదే

డబ్బు లేనిదే ఈ ప్రపంచంలో ఏమీ నడవదు అంటారు. కానీ 75 ఏళ్ల నుంచి ఒక ట్రైన్ నడుస్తోంది. అది కూడా ప్రయాణికుల నుంచి ఒక్క పైసా చార్జీ చేయకుండా నిర్విరామంగా సేవలు కొనసాగిస్తోంది. ఆ ట్రైనే భాక్రా నంగల్ ( Bhakra Nangal Train ) ట్రైన్. ఈ రైలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ? ఎందుకు ఫ్రీగా నడుపుతున్నారు ? ఇలాంటి మరెన్నో విశేషాలు మీకోసం…

ఇండియన్ రైల్వే కాదు

మీరు ఎప్పుడైనా నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడి అందాలను, కల్చర్‌ను చూసి మురిసిపోవచ్చు. వీలైతే ఈ సారి భాక్రా నంగల్ ట్రైనులో ప్రయాణించి చూడండి. మీరు పాతకాలంలోకి ప్రయాణిస్తున్న అనుభవం కలుగుతుంద. దీంతో పాటు ఇక్కడి ల్యాండ్ స్కేప్ మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుంది. ఇలా 75 ఏళ్ల నుంచి ప్రయాణికులు మనసు కొల్లగొడుతున్న స్పెషల్ ట్రైన్ సర్వీస్ ఇది. ఇది ఇండియన్ రైల్వేస్‌ ( Indian Railways ) పరిధిలోకి రాదు. దీని లెక్క వేరు. దీని చరిత్ర వేరు.

Read Also : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts

ప్రయాణాలంటే తడిసి మోపెడు అయ్యే ఈ రోజుల్లో భాక్రా నంగల్ ట్రైన్ రూటే సెపరేటు అని చెప్పవచ్చు. 1948 లో ఈ సర్వీసును భాక్రా నంగల్ డ్యామ్ ( Bhakra Nangal Dam ) నిర్మించే సమయంలో కూలీలను, మెటీరియల్‌ను తరలించేందుకు నిర్మించారు. 1948 లో ఒక ఆవిరి ఇంజిన్ ( steam engine ) తో సర్వీసును మొదలు పెట్టారు. 

1953 లో స్టీమ్ ఇంజిన్ స్థానంలో అమెరికా నుంచి తీసుకొచ్చిన మూడు ఇంజిన్లను వినియోగించడం మొదలు పెట్టారు. ఇందులో రెండు ఇంజిన్లు ఇప్పటికీ పని చేస్తుండగా మరో ఇంజిన్ ప్రస్తుతం నంగల్ స్టేషన్‌లో మెయింటెనెన్స్‌లో ఉంది. ఈ ట్రైన్ నాటి ఇంజినీరింగ్ స్పిరిట్‌కు ఒక ఉదాహరణగా నిలుస్తోంది.  

ఈ సర్వీసును భాక్రా బియాస్ మేనేజెట్మెంట్ బోర్డు ( Bhakra Beas Management Board ) నిర్వహిస్తోంది. ఈ బోర్డు ఒకానొక సమయంలో ఈ సర్వీసుకు డబ్బులు వసూలు చేద్దాం అని కూడా అనుకుంది. కానీ ఈ ట్రైన్ చరిత్రను, స్థానికులతో దీనితో ఉన్న అనుబంధాన్ని గౌరవిస్తూ ఉచిత సర్వీసును కొనసాగిస్తోంది. 

Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ఏం చూడాలి ? 10 టిప్స్ !

ట్రైన్ ఎలా ఉంటుంది ? | Inside Bhakra Nangal Train 

ఈ ట్రైనులోని కోచ్‌లను కరాచీలో తయారు చేశారు. తరువాత ఇది భారత్‌ పరిధిలోకి వచ్చింది. భాక్రా నంగల‌్‌లో భాక్రా అనేది హిమాచల్ ప్రదేశ్‌లో ( Himachal Pradesh ) ఉంటుంది. నంగల్ అనేది పంజాబ్‌లో ( Punjab ) ఉంటుంది. ఈ ట్రైన్ బయట, లోపలి భాగం బ్రిటిష్ కాలంలో ఎలా ఉండేదో ఇప్పుడూ అలాగే ఉంది.

10 Facts About Bhakra -Nangal Train (1)
ప్రతీకాత్మక చిత్రం

ఈ ట్రైన్ లోపలి భాగాన్ని కూడా పూర్తిగా కలపతో నిర్మించారు. లోపల ఇప్పుడు మనం చూసే ట్రైన్లలో ఉన్నట్టు కాకుండా ఒక బోగీ ఇటు వైపు నుంచి అటువైపు వరకు ఒకే వరుసలో సీట్లు ఉంటాయి. ఇలా మూడు, లేదా రెండు వరుసల్లో సీట్లు ఉంటాయి. 70 ఏళ్ల క్రితం నాటి ఇంజిన్ ఉన్న రైలులో ప్రయాణించడం ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించండి.

కిటికీలు కూడా చాలా పెద్దగా ఉంటాయి. మధ్యలో గ్రిల్స్ ఉండవు. ఇందులో ఎక్కువ మంది ప్రయాణికులు కూడా ఉండరు. ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రయాణం. నేటికీ భాక్రా నంగల్ డ్యామ్ ఉద్యోగులు ఇదే ట్రైనులోనే ప్రయాణిస్తుంటారు. అమెరికన్ చగ్ ఇంజిన్‌తో నడిచే ఈ ట్రైన్ చాలా స్లోగా, ప్రశాంతంగా 40 కిమీ వేగంతో వెళ్తుంది. 

భాక్రా నంగల్ ప్రాజెక్టు గురించి 

Facts About Bhakra Nangal Project : భాక్రా నంగల్ ప్రాజెక్టును స్వాతంత్య్రం వచ్చిన వెంటనే ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఎత్తైన డ్యామ్. హిమాచల్ ప్రదేశ్ , పంజాబ్ , రాజస్థాన్ ( Rajasthan ) , ఢిల్లీకి నీటిని, విద్యుత్‌ను అందిస్తుంది. రాజస్థాన్‌లోని దూరప్రాంతాలకు కూడా నీటిని అందించేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు. దీని కోసం చాలా మంది తమ భూములను, ప్రాణాలను కూడా కోల్పోయారు. 

సర్వీసును ఆపేద్దాం అనుకున్నారు

ఈ ట్రైన్‌లో సుమారు 25 గ్రామాలకు చెందిన ప్రజలు ప్రయాణిస్తారు. వీళ్లందరూ ఉచితంగానే ప్రయాణిస్తారు. భాక్రా నంగల్ ట్రైన్ నిర్మాణం పూర్తయిన తరువాత ఈ ట్రైన్ సర్వీసులు నిలిపివేయాలని భావించాలట. కానీ ఈ ఐడియాను ప్రజలు వ్యతిరేకించడంతో విరమించుకున్నారట.

Read Also : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి

భారతీయ రైల్వే కాదు భాక్రా రైల్వే | Bhakra Railway

స్థానికులు త్యాగాలను గుర్తించి ఈ సర్వీసును ఎప్పుడూ ఆపకుండా, నిత్యం ఉచితంగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ట్రైనులో ప్రయాణించి ఈ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన వారిని గుర్తు తెచ్చుకోవాలి అని  ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందట. తరువాత ఈ సర్వీసును భాక్రా రైల్వే అనే పేరుతో నిర్వహిస్తోంది.

ఈ ట్రైన్ ఎన్నో సొరంగాల నుంచి, అందమైన లోయల నుంచి, సట్లెజ్ నది తీరం వైపు నుంచి వెళ్తుంది. దారి మధ్యలో లేబర్ హట్ ( Labour Hut ), బర్మలా ( Bharmala ) వంటి అనేక స్టేషన్స్ వస్తాయి. అయితే సాధారణ ప్రయాణికులు ఈ ట్రైనులో భాక్రా నంగల్ ప్రాజెక్టు వరకు వెళ్లలేరు. 

కేవలం 13 కిమీ మాత్రమే ఉచితంగా ప్రయాణించి నెహ్లా ( Nehla ) స్టేషన్ వరకు మాత్రమే సాధారణ ప్రజలు వెళ్లగలరు. సెక్యూరిటీ కారణాల వల్ల ప్రాజెక్టు వద్దకు కేవలం ఉద్యోగులు మాత్రమే వెళ్లగలరు.

ఈ డ్యామ్‌ వెళ్లే ముందు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. తిరిగి వచ్చే సమయంలో మీరు పంజాబ్‌లోని నంగల్‌లో ఉన్న లేబర్ హట్ వద్ద దిగాల్సి ఉంటుంది. మీరు దగ్గర్లోని నంగల్ డ్యామ్ రైల్వే స్టేషన్ ( Nangal Dam Railway Station ) నుంచి మీకు నచ్చిన చోటికి వెళ్లవచ్చు. గుర్తుంచుకోండి. తరువాత ప్రయాణాలు అన్నీ కూడా పెయిడ్ జర్నీలే .

ఆసక్తికరమైన విషయాలు | Bhakra- Nangal Train Facts
  • ఈ ట్రైను బోగీలను కరాచీలో 1923 లో నిర్మించారు
  • 1953 లో అమెరికాలో తయారైన జీఈ ఇంజిన్లను వినియోగిస్తారు
  • ఇందులో కరాచీలో తయారైన 5 బోగీలుంటాయి.
  • బ్రిటిష్ కాలం నాటి బెంచీలపై కూర్చుని ప్రయాణించాల్సి ఉంటుంది
  • నంగల్ నుంచి భాక్రా వరకు 13 కిమీ ప్రయాణిస్తుంది.
  • 400 హార్స్ పవర్స్ గల డీజిల్ ఇంజిన్లతో ఈ ట్రైన్ నడుస్తుంది.
  • ఇది కూడా చదవండి :  ఈ రాష్ట్రంలో  ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా? 
సట్లెజ్ నదీ తీరంలో…

Journey Through Sutlej River: పంజాబ్‌లోని నంగల్ నుంచి ఈ ట్రైన్ జర్నీ మొదలవుతుంది. ఇది ఒక అసాధారణమైన రైలు ప్రయాణం. ఉత్సాహంతో ప్రయాణికులు కిటికీలోంచి బయటికి తొంగి చూస్తుంటారు.

10 Facts About Bhakra -Nangal Train (2)
ప్రతీకాత్మక చిత్రం

కాలంతో పాటు ప్రయాణిస్తూ సట్లెజ్ నదీ అందాల్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ట్రైను ప్రయాణానికి శివాలిక్ పర్వత శ్రేణులు ఒక సూపర్ బ్యాగ్‌డ్రాప్‌లా పని చేస్తాయి.దారిలో కనిపించే సీన్స్, గ్రామాలు అనేవి జీవితాంతం గుర్తుంటాయి 

ప్రజల ట్రైను

భాక్రా నంగల్ ట్రైను అనేది ఒక ప్రయాణ మాధ్యమం మాత్రమే కాదు, ఇది వివిధ రకాల ప్రయాణికులు కలిసే చోటు. టికెట్లు కొనడం, టికెట్ చెకింగ్ అధికారులు లేకపోవడంతో చాలా మంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్రశాంతంగా ఈ ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తుంటారు. ఈ ట్రైను వెనక ఉన్న కథ గురించి కొత్త వాళ్లకు చెబుతూ సీనియర్ ట్రావెలర్స్ తమ గతంలోకి వెళ్తుంటారు.

 Read Also : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

నిర్వాహణ ఖర్చులు, మొదలైనవి

Who Maintains Bhakra- Nangal Train :  ఉచితంగా ట్రైను నడపడం అనేది సాధారణమైన విషయం కాదు. ఎన్నో సవాళ్లు ఉంటాయి. మీకు తెలుసా ఈ ట్రైను ప్రతీ గంటకు 18-20 లీటర్ల పెట్రోల్ వినియోగిస్తుంది. మొత్తం ఆరు స్టేషన్లలో ఆగే ఈ రైలులో ప్రతీ రోజు 800 మంది వరకు ప్రయాణిస్తుంటారు. ఇందులో ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులు ఉంటారు. 

నాటి త్యాగాలను గుర్తిస్తూ, ఖర్చుల గురించి ఆలోచించకుండా కమిట్మెంట్ గురించి ఆలోచిస్తూ భాక్రా నంగల్ రైల్వే బోర్డు ఈ సర్వీసును నిర్వహిస్తోంది. ఈ ట్రైన్ నడిచినంత కాలం లేదా బాగున్నంత కాలం ఈ సర్వీసు ఉచితంగా ఉంటుంది అని అక్కడి అధికారులు కొన్ని సందర్బాల్లో తెలిపారు. మీరు పంజాబ్ లేదా హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) టూరు ప్లాన్ చేస్తే ఈ రైల్వేలో ఉచితంగా ప్రయాణించడం గురించి ఆలోచించండి. 

2011 లో ఈ ట్రైను సర్వీసును ఆపేద్దాం అనుకున్నారు అధికారులు  ఎందుకంటే దీని నిర్వహణ అనేది ఆర్థికంగా భారంగా అనిపించింది వారికి. కానీ ఈ ట్రైన్ సర్వీసు అనేది లాభాపేక్షతో నడిపేది కాదు అని…ఇది ఒక అందమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సాధనం అని వారు అర్థం చేసుకున్నారు. అందుకే  ఆ ఆలోచనను వారు విరమించుకున్నారు.

వివక్షతకు చిరునామా కూడా…

ఈ ట్రైన్ వారసత్వానికే కాదు బ్రిటిష్ కాలం నాటి వివక్షతకు సజీవ సాక్ష్యం అని కూడా కొందరు అంటారు. ఎందుకంటే ఈ ట్రైనులో నేటికీ హెల్పర్లు, ఫిట్టర్లు, పంప్ ఆపరేటర్లు, కార్పెంటర్లు, పెయింటర్లు డ్యామ్‌లో పని చేసే కూలీలు మాత్రమే ఎక్కువగా ప్రయాణిస్తారు. ఉన్నత స్థాయి అధికారులు మాత్రం జీపుల్లో, బస్సుల్లో వెళ్తుంటారు.

భాక్ర నంగల్‌కు ఎలా చేరుకోవాలి ?

Hyderabad To Bhakra Nangal : భాక్రా నంగల్ ట్రైన్ ఎక్కాలంటే మీరు ఈ టిప్స్ పాటించండి.

  • ముందుగా మీరు ట్రైన్లో లైదా విమానంలో ఢిల్లీ లేదా చండీగఢ్ చేరుకోవాల్సి ఉంటుంది.
  • ఢిల్లీ నుంచి చండీగఢ్ బస్సులో లేదా ట్రైనులో చేరుకోవచ్చు.
  • చండీగఢ్ నుంచి నంగల్‌కు రెండు గంటల్లో చేరుకోవచ్చు.

ఒకవేళ మీరు గతంలో ఈ రైల్లో ప్రయాణించి ఉంటే ఆ విశేషాలు మాతో షేర్ చేసుకోండి. 

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!