51 Shakti Peethas List : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?

శక్తికి ప్రతీరూపంగా కొలిచే అమ్మవారిని కొలిచే వారికి శక్తి పీఠాలు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు. భారత దేశం దాని చుట్టు పక్కన మరిన్ని దేశాల్లో మొత్తం 51 శక్తి పీఠాలు ( 51 Shakti Peethas List) ఉన్నాయి. అయితే వీటిని 18,51,108 గా వేరు వేరు చోట్ల పేర్కొన్నారు. ఈ శక్తి పీఠాలకు ఆధ్యాత్మికంగానే కాదు సంప్రదాయాలు, , ఆచారాల పరకంగా కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది.

అందుకే భారతదేశం నుంచే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ శక్తి పీఠాలకు వెళ్తుంటారు భక్తులు. ఈ ఆలయా నిర్మాణం, శిల్ప కళ కూడా అత్యంత ప్రత్యేకంగా ఉంటుంది. భారతీయ కళలకు ఈ ఆలయాలు నిదర్శనం అని చెప్పవచ్చు.

శక్తి పీఠం పేరుప్రాంతం/ రాష్ట్రంశరీర భాగం
1. అమర్‌నాథ్ ( Amarnath )జమ్మూ & కాశ్మీర్ గొంతు
2. కాత్యాయని ( Kathyanani )మధుర, ఉత్తరప్రదేశ్ కేశం
3. విశాలాక్షి (Vishalakshi)వారణాసి, ఉత్తరప్రదేశ్ చెవిపోగులు
4..లలితా ( Lalita)అలహాబాద్, ఉత్తర ప్రదేశ్ వేళ్లు
5. జ్వాలా దేవి ( Jwala Devi)కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ నాలుక
6. త్రిపురమాలినీ (Tripuramalini) జలంధర్, పంజాబ్ ఎడమ రొమ్ము
7. సావిత్రి ( Savitri)కురుక్షేత్ర, హర్యానా కుడి చీలమండ
8. మగధ ( Magadha ) పాట్నా, బీహార్ శరీరం కుడి వైపు
9. దాక్షాయణి ( Drakshayani )బురాంగ్, టిబెట్ కుడి అరచేయి
10. మహిషాసురమర్దిని ( Mahishasura Mardiini)కొల్హాపూర్, మహారాష్ట్ర మూడవ కన్ను
11. భ్రమరీ ( Bhramani ) నాసిక్, మహారాష్ట్ర దవడ భాగం
12. అంబాజీ ( Ambaji ) అంబాజీ, గుజరాత్ గుండె
13. గాయత్రీ ( Gayantri )పుష్కర్, రాజస్థాన్ మణికట్టు
14. అంబికా ( ambica )భరత్‌పూర్, రాజస్థాన్ ఎడమ పాదం
15. సర్వశైలి (sarvashaili ) తూర్పుగోదావరి, ఆంధ్రప్రదేశ్ ఎడమ చెంప
16. శ్రావణి (sravani )కన్యాకుమారి, తమిళనాడు వీపు వెన్నెముక
17. భ్రమరాంబ (bramarambha ) కర్నూల్, ఆంధ్రప్రదేశ్ కుడి చీలమండ
18. నారాయణి ( narayani)కన్యాకుమారి, తమిళనాడు ఎగువ దంతాలు
19. ఫుల్లర ( phullara)పశ్చిమ బెంగాల్ దిగువ పెదవి
20. బహులా ( bahula)పశ్చిమ బెంగాల్ ఎడమ చేయి
21.మహిషమర్దిని ( mahishasura mardisni)బీర్భూమ్, పశ్చిమ బెంగాల్ కనుబొమ్మల మధ్య తల భాగం
22. దక్షిణ కాళి ( dakshina kali)కోల్‌కతా, పశ్చిమ బెంగాల్ కుడి కాలిభాగం
23. దేవగర్భ ( deva garbha )బీర్భూమ్, పశ్చిమ బెంగాల్ ఎముక
24. విమ్లా ( vimla )ముర్షిదాబాద్, పశ్చిమ బెంగాల్ తలపై మాడ భాగం
25. కుమారి శక్తి ( kumari shakti)హుగ్లీ, పశ్చిమ బెంగాల్కుడి భుజం
26. భ్రమరీ ( bhramari )జల్పైగురి, పశ్చిమ బెంగాల్ ఎడమ కాలు
27. నందిని ( nandini )బీర్భూమ్, పశ్చిమ బెంగాల్కంఠ హారం ( నెక్లెస్ )
28. మంగళ్ చండికా ( mangal chandika )పుర్బా బర్ధమాన్, పశ్చిమ బెంగాల్ కుడి మణికట్టు
29. కపాలిని (kapalini )పుర్బా మేదినీపూర్, పశ్చిమ బెంగాల్ఎడమ చీలమండ
30. కామాఖ్య ( kamakhya) గౌహతి, అస్సాం యోనిభాగం
31. జయంతి ( jayanti )వెస్ట్ జైంతియా హిల్స్, మేఘాలయ ఎడమ తొడ
32. త్రిపుర సుందరి ( tripura sundari ) గోమతి, త్రిపుర కుడి పాదం
33. బిరాజా ( birja )జాజ్‌పూర్, ఒడిషా నాభి
34. జై దుర్గా ( jai durga)డియోఘర్, జార్ఖండ్ చెవి
35. అవంతి (avanti )ఉజ్జయిని, మధ్యప్రదేశ్ పై పెదవులు/మోచేయి
36. నర్మదా ( narmada )అమర్‌కంటక్, మధ్యప్రదేశ్ కుడి పిరుదు
37. రత్నావళి ( ratnavali)చెన్నై, తమిళనాడు
38. కల్మాధవ్ ( kalmadhav )అన్నుప్పూర్, మధ్యప్రదేశ్ ఎడమ పిరుదు
39. జోగులాంబ ( jogulamba)ఆలంపూర్, తెలంగాణ ఊర్థ్వ దంతం
40. మిథిలా ( mithila )
41. పంచ సాగర్ ( pancha sagar )
42. శ్రీ పర్వత్ (sri Parvat)
భారత దేశం బయట ఉన్న శక్తి పీఠాలు \ Shakti Peethas Outside India

హిందూ మతంలో ( Hinduism ) అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో కొన్ని భారత దేశం బయట కూడా ఉన్నాయి. వీటిని చూసేందుకు భారతీయులు తరచూ వెళ్తుంటారు. అవి ఇవే..

ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి

అసలు శక్తి పీఠాలు ఎలా ఏర్పడ్డాయి ? Story Of Shakti Pithas

ఒకసారి సతీ దేవి ( Sati Devi )తండ్రి దక్ష ప్రజాపతి ఒక యాగాన్ని నిర్వహించాడు. అయితే ఈ యాగానికి అల్లుడైన పరమశివుడిని, కూతురైన సతీదేవిని తప్పా అందరినీ ఆహ్వానించాడు దక్ష ప్రజాపతి. కానీ తండ్రి ఇంట్లో అంత పెద్ద యాగం ఉంటే కూతురికి వెళ్లాలి అనిపించగా చెప్పండి ? సతీదేవికి కూడా యాగంలో భాగం అవ్వాలని ఉంటుంది.

మహాశివుడికి ( Lord Shiva ) మాత్రం అక్కడికి వెళ్లడం ఇష్టం ఉండదు. కానీ సతీదేవి తన భర్త అయిన భోళా శంకరుడితో కలిసి వెళ్తుంది. అది చూసిన దక్ష ప్రజాపతి శివుడిని తీవ్రంగా అవమానిస్తాడు. తన భర్తను తన తండ్రే అవమానించడం చూసిన సతీ దేవి బాధతో యగ్న కుండంలో ఉన్న అగ్నిలో ప్రవేశిస్తుంది.

తన భార్న అగ్ని ప్రవేశం చేసి మృతిచెందడం చూసిన మహామృత్యుంజయుడు అయిన రుద్రుడికి కోపం కోపం వస్తుంది. వెంటనే వీరభద్రుడిని ( Veera Bhadra ) సృష్టించి యాగాన్ని ధ్వంసం చేయించి… తక్షణం దక్షుడి తల నరికేస్తాడు. అక్కడే ఉన్న వారు దయచూపండి మహాదేవ అని ప్రాధేయపడంతో మేకతల అతికించి దక్ష ప్రజాపతికి ( Daksha Prajapati ) ప్రాణం పోస్తాడు. 

List of 51 Shakti Pithas In The World

తన బాధను అణచుకోలేక శివుడు సతీదేవి శరీరాన్ని ఎత్తుకుని ప్రళయ తాండవం చేస్తాడు. మహాశివుడి ప్రకోపం నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి వెంటనే శ్రీ మహావిష్ణువు ( Lord Vishnu ) రంగంలోకి దిగుతాడు. వెంటనే సతీ దేవి శరీరం నుండి మహాదేవుడిని వేరు చేస్తాడు. సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని అనేక భాగాలుగా చేస్తాడు.

అప్పుడు ఈ భాగాలు పడిపోయిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి. అనంతరం సతీదేవి హిమవంతుడి పుత్రిక అయిన పార్వతిగా ( Parvati ) జన్మించి పరమేశ్వరుడిని పూజించి ఆయన మనసు గెలుచుకుని వివాహం చేసుకుంటుంది.

ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts

సతీదేవి శరీర భాగాలు పడిన చోట్ల ఏర్పడిన ఆలయాలు కావడంతో ఆయా భాగాలకు సంబంధించిన వ్యాధులు వస్తే ఆ ఆలయాన్ని సందర్శిస్తే తగ్గుతుంది అని భక్తులు, మరీ ముఖ్యంగా మహిళలు నమ్ముతారు.

నేను గతంలో అసోంలోని గౌహతీలో ఉన్న 51 శక్తిపీఠాలలో ఒకటైన కామాఖ్య అమ్మవారి ఆలయం గురించి ఒక వీడియో చేశాను. ఈ శక్తి పీఠం తంత్ర విద్యలకు ఫేమస్. ఈ ఆలయం గురించి పూర్తిగా వీడియోలో వివరించారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ స్టోరీ కూడా చూడండి. నేను లింక్ ప్రొవైడ్ చేశాను చూడండి : కామాఖ్య దేవీ కథ

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!