పుస్తకాల క్రేజ్…అసలు తగ్గదేలే | Hyderabad Book Fair 2025

Share This Story

పుస్తక ప్రియులను ఒకే చోట చేర్చే వేడుక హైదరాబాద్ బుక్ ఫెయిర్. పుస్తకాల వైభవం అస్సలు తగ్గలేదు…పైగా మరింత పెరిగింది అనడానికి ఉదాహరణే ఈ ఫెయిర్ ( Hyderabad Book Fair 2025 ). ప్రతీ స్టాల్ ముందు కిక్కిరిసిన జనం, కొత్త రచయితల కోలాహలం, తమ పుస్తకాలను బుక్ లవర్స్‌‌కు పరిచయం చేస్తున్న రచయితలు..మరెన్నో విశేషాలు ఈ పోస్టులో..

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి
1.ఒకే జాతి పక్షులు ఒకే కొమ్మపై వాలడం అంటే ఇదేనేమో. పుస్తక ప్రియులు అంతా కలిసి ఈ వేడుకను హిట్ చేశారు.
2. కొత్త తరానికి తగిన విధంగా అందమైన కవర్ పేజీలతో ఆకట్టుకున్న తెలుగు పుస్తకాలు
3. సినీ ప్రేమికుల కోసం కూడా ఒక ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేశారు. ఇందులో లక్ష్మీ కటాక్షం అనే పుస్తకం నాకు బాగా నచ్చింది. ప్రజాధరణ పొందిన ప్రముఖ నటీనటులకు లక్ష్మీ కటాక్షం ఉన్నా కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేకపోవడం ఇలా ఎన్నో కారణాల ఏలా ఇబ్బంది పడ్డారో...వారు ఎవరో ఈ పుస్తకంలో ఉంటుంది.
4.ఈ బు‌క్‌ ఫెయిర్లో ఎంతో మంది యంగ్ రైటర్స్ అండ్ అథర్స్ కనిపించారు. జీబీ సుష్మిత మానస అనే ఒక యువ రచయిత్రి ఏంజిల్ అనే తన పుస్తకాన్ని బుక్ లవర్స్‌కు పరిచయం చేసింది. వైజాగ్‌కు చెందిన మానస తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, సాహిత్యాన్ని తన సాహిత్యంలో కొత్తగా ఇందులో పరిచయం చేసింది. ఈ పుస్తక ప్రపంచ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మానస లాంటి యువ ఆథర్స్ పాత్ర కీలకమైనది.
5.ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాల్లో ది గాడ్‌ఫాదర్ కూడా ఒకటి. ఈ నవలపై ఇదే పేరుతో సినిమాలు కూడా వచ్చాయి. ఈ సినిమా ప్రపంచ సినిమాను ఎంతగానో ప్రభావితం చేసింది.చేస్తుంది. చేయునుంది కూడా.
6. గుర్రం జాషువా రచించిన గబ్బిలం అనే పద్య రచనకి నేటికీ మంచి ఆదరణ లభిస్తోంది
7. చిలకమర్తి గారి హాస్యం, చతురత ఆయన రైటింగ్ స్టైల్ గురించి ఈ జనరేషన్‌ కూడా తెలుసుకుంటోంది. ఆయన గణపతి పుస్తకాన్ని చాలా మంది ఇష్టపడి కొంటున్నారు.
8.నాకు తెలిసిన తొలి వరల్డ్ ట్రావెలర్ ఎవరంటే బారిస్టర్ పార్వతీశం అనే అంటాను. మొగల్తూరు నుంచి లండన్ వరకు ఒక పల్లెటూరి అమాయకుడి ప్రయాణం ఎలా సాగుతుంతో అత్యంత హాస్యంగా రచించారు మొక్కపాటి నరసింహా శాస్త్రీ గారు. ఈ పుస్తకంలో అతను లండన్ వెళ్లడం, అక్కడ లా చదవడం, అక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం...తిరిగి తన సొంత ఊరికి వెళ్లడం వరకు ఉంటుంది.
9. ప్రపంచ ముబైల్ రంగాన్ని శాసించి తరువాత శాంతించిన సంస్థ నోకియా. అయితే ఈ పుస్తకంలో నోకియా ఎందుకు నెంబర్ వన్ అయిందో చదవవచ్చు.
10. మాజీ భారత ప్రధానమంత్రి ఇందిరా గాంధి రచించిన పుస్తకం ఎటర్నల్ ఇండియా. ఇందులో అమె భారత దేశ ఔన్నత్యం , వారసత్వం, భిన్నత్వం గురించి వివరించారు. ఈ పుస్తకాల్లో ఫోటోలు బాగుంటాయి. పాత కాలంలో భారత దేశం ఎలా ఉంటుందో ఈ ఫోటోల్లో చూడవచ్చు.
11. లక్షలాది పుస్తకాల్లో తమకు ఏ పుస్తకం కావాలో నిర్ణయించే క్రమంలో అలసి ఆకలేసిన వారి కోసం కేఫటేరియా..
12. స్పైడర్ మ్యాన్ ఇండియన్ వర్షన్ ఉంటే ఎలా ఉంటాడో తెలుసా ? ధోతి ధరించిన స్పైడర్ మ్యాన్ కామిక బుక్ ఒకటి నాకు ఫెయిర్లో కనిపించింది.
13. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బుక్ ఫెయిర్‌లో పిల్లల కోసం చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. మొబైల్స్‌కు దూరంగా క్రియేటీవిటీ, నాలెడ్జిని పెంచే పుస్తకాల మధ్య కాసేపు గడిపారు పిల్లలు.
14. ఈ మేళాలో నాకు కనిపించిన అతి పెద్ద పుస్తకం లేదా పుస్తకాల ప్యాక్ ఇదే. వేదాలకు సంబంధించిన పుస్తకాల ప్యాక్ ఇది. ఋగ్వేదం,యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదం అనేవి భగవంతుడి ముఖారవిందం నుంచి వెలువడినవని అంటారు.ప్రపంచానికి అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్న మహా గ్రంథాలు. ఇవి
హైదరాబాద్ బుక్ ఫెయిర్ తేదీలు | Hyderabad book Fair 2025 Dates

ప్రతీ ఏడాది చలికాలం పుస్తక ప్రియుల కోసం హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ( Hyderabad Book Fair 2025 ) జరుగుతుంది. ఇక్కడికి హైదరాబాద్ నుంచే కాకుండా తెలుగు రాష్ట్రా నుంచి కూడా బుక్ లవర్స్ వస్తూ ఉంటారు. ఈ ఏడాది పది రోజలు పాటు జరుగుతోన్న ఈ ఫెయిర్ డిసెంబర్ 29 తో ముగియనుంది.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

Share This Story

Leave a Comment

error: Content is protected !!