2 గంటల్లో బెంగుళూరు, పుణె చేరుకోవచ్చు… | Railway Budget 2026-27
Railway Budget 2026-27 : రైల్వే ప్రాజెక్టుల కోసం రైల్వే ప్రభుత్వం రికార్డు స్థాయిలో నిధులను కేటాయించింది. ఏపీకి రూ.10,134 కోట్లు, తెలంగాణకు రూ5,454 కోట్లు కేటాయిస్తున్నట్టు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
11 రెట్లు అధిక నిధులు
రైల్వే మంత్రి ప్రకారం 2009-14 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇయర్లీ యావెరేజ్ రూ.886 కోట్ల మాత్రమే కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) 11 రెట్లు, తెలంగాణకు (Telangana) 6 రెట్లు అధికంగా కేటాయించారు. ఈ నిధుల వల్ల రైల్వే మౌలిక సదుపాయాలు, స్టేషన్లు, ట్రాకులు, బ్రిడ్జిల నిర్మాణం, నిర్వహణకు మరింత బలం చేకూరుతుంది.
- ఇది కూడా చదవండి : Amrit Bharat Express: తెలుగు ప్రయాణికులకు ఎప్పుడు, ఎలా ఉపయోగపడుతుంది ?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ.92,469 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. తెలంగాణలో (Telangana) రూ.47,984 కోట్ల ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయ. ఇందులో భాగంగా ఇరు రాష్ట్రాల రైల్వే నెట్వర్క్ నూటికి 100 శాతం విద్యుదీకరణ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.. దీని వల్ల ట్రైనులు వేగంగా పరుగెత్తుతాయి.ప్రయాణ సమయం తగ్గుతుంది.
హై స్పీడ్ రైల్వే కారిడార్ | High Speed Railway Corridors
ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 7 హై స్పీడ్ రైల్వే కారిడార్లను ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ కారిడార్లలో హైదరాబాద్-బెంగుళూరు, హైదరాబాద్ – చైన్నై ఉండగా, తెలంగాణకు హైదరాబాద్ నుంచి పుణె మధ్య ఒక కారిడార్‌ను చేర్చారు.
దీని వల్ల హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు కేవలం 2 గంటల్లోనే చేరుకునే అవకాశం లభిస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి చెన్నైకు 3 గంటల్లో, పుణెకు రెండు గంటల్లో చేరుకోవచ్చు. ఈ కారిడార్ల వల్ల వైద్య, ఆరోగ్య, విద్యా, ఆర్థిక రంగాలకు ఊతం అందుతుంది.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
