New Mini Airports : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..హెలికాప్టర్లో శ్రీశైలం, అరకు వెళ్లొచ్చు!
New Mini Airports : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి ఒక కొత్త ప్లాన్ వేసింది. రాష్ట్రంలో మూడు కొత్త మినీ ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఎయిర్‌పోర్టుల ద్వారా హెలికాప్టర్ సర్వీసులు నడపాలని, తద్వారా పర్యాటకులను, భక్తులను ఆకర్షించాలని చూస్తోంది. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, అరకు, శ్రీశైలం వంటి ప్రాంతాల మధ్య ఈ హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం ప్రైవేట్ ఏజెన్సీల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఇది కూడా చదవండి : Travel Tips 15 : హిల్స్టేషన్లకు వెళ్తున్నారా? తక్కువ ఖర్చుతో తిరగాలంటే ఈ ట్రావెల్ టిప్స్ పాటించండి
హెలికాప్టర్లో శ్రీశైలం వెళ్తారా?
సాధారణంగా ఏదైనా పండుగలు, పర్యాటక ఉత్సవాలు ఉన్నప్పుడు మాత్రమే హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిరంతరం హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. భక్తులు ఎక్కువగా వెళ్ళే శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాలకు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయి అని ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా విజయవాడ-శ్రీశైలం, హైదరాబాద్-శ్రీశైలం మార్గాలలో హెలికాప్టర్ సర్వీసులకు చాలా డిమాండ్ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: International Travel : విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉండాలో తెలుసా?
కొత్త మినీ ఎయిర్‌పోర్టులు ఎక్కడ?
హెలికాప్టర్ టూరిజంను పెంచడం కోసం విశాఖపట్నం, అరకు, విజయవాడ, శ్రీశైలం వంటి కీలక ప్రాంతాలలో మినీ ఎయిర్‌పోర్టులు (చిన్న ఎయిర్‌పోర్టులు) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ ఎయిర్‌పోర్టులలో ఒక పెద్ద విమానాశ్రయంలో ఉండే కొన్ని సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయట. ప్రైవేట్ ఏజెన్సీలు ముందుకు వస్తే ఈ పనులు త్వరగా మొదలవుతాయి. ఇలాంటి హెలికాప్టర్ టూరిజం ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో అందుబాటులో ఉంది. ఇది ఏపీలో కూడా పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇస్తుందని ప్రభుత్వం ఆశిస్తోంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.