Mana Mitra తో వాట్సాప్‌లో APSRTC Bus Ticket Booking ఎలా చేయాలి ?
Mana Mitra : ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ రోజు లక్షల మంది ఏపీఆర్టీసి బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. దూర ప్రయాణాల కోసం అడ్వాన్స్ రిజర్వేషన్ అనే వ్యవస్థ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు RedBus, AbhiBus, Paytm వంటి యాప్స్‌తో పాటు ఏటీబీ ఏజెంట్స్ ద్వారా టికెట్లను ప్రయాణికులు బుక్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు గేమ్ ఛేంజర్ అప్డేట్ వచ్చింది..ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే మీరు.
ఏపీఆర్టీసి బస్ టికెట్స్ ఇప్పుడు డైరక్ట్‌గా వాట్సాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు.
Mana Mitra | వాట్సాప్ గవర్నెన్స్ ఇనిషియేటీవ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన Mana Mitra- WhatsApp Governance అనే ప్లాట్‌ఫామ్ ద్వారా ఇక ప్రయాణికులు ఏపిఆర్టీసి అడ్వాన్స్‌గా రిజర్వేషన్ టికెట్ సర్వీస్ ఉపయోగించుకోవచ్చు..
వాట్సాప్ నెంబర్ వచ్చేసి : 95523 00009
ప్లాట్‌ఫామ్ పేరు : మన మిత్ర
- ఇది కూడా చదవండి : భారత ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనం కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి | 10 ఆసక్తికరమైన విషయాలు | New Pamban Railway Bridge
దీని వల్ల ప్రయోజనాలేంటి? | Benefits
వాట్సాప్ ద్వారా టికెట్ బుకింగ్ చేయడం వల్ల ప్రయోజనాలేంటో తెలుసుకుందామా…
- దీని వల్ల మీకు అదనపు యాప్స్ డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు
- ఏజెంట్స్ దగ్గర్ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదు
- మీ మొబైల్లో వాట్సాప్ ఉంటే చాలు
- తెలుగు, ఇంగ్లీష్ భాషలో అందుబాటులో
- వాట్సాప్‌లోనే టికెట్ కన్ఫర్మ్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : ఇది కూడా చదవండి : IRCTC Pay Later : ఇక జేబులో డబ్బులు లేకున్నా ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసా ?
గవర్నమెంట్ అబ్జర్వేషన్ ప్రకారం చాలా మంది ఈ ఫీచర్ గురించి తెలుసుకోలేదు. అందుకే ఏపీఆర్టిసి అండ్ ఏపీ ప్రభుత్వం దీని గురించి బాగా ప్రమోట్ చేయడం ప్రారంభించాయి.
ఎలా బుక్ చేయాలి ? | Step by Step Guide

వాట్సాప్‌లో ఏపీఆర్టీసి బస్ టికెట్‌ను బుక్ చేసుకునే విధానాన్ని సులభంగా అందరికి అర్థం అయ్యే విధంగా స్టెప్‌బై స్టెప్ వివరిస్తున్నాను…
1. ముందుగా మీరు 95523 00009 అనే నెంబర్‌ను సేవ్ చేయండి
(లేదా మీరు QR Code స్కాన్ చేయండి)
2. వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపండి.
3. తరువాత Choose Service అనే ఆప్షన్ ఎంచుకోండి.
4. APSRTC Service ని ఎంచుకోండి.
5. Ticket Booking ఆప్షన్ ఎంచుకోండి.
6. మీ ప్రయాణ వివరాలు, ప్యాసెంజెర్ సమాచారం ఎంటర్ చేయండి
7. ఆన్లైన్ పేమెంట్ విధానాన్ని ఎంచుకుని డబ్బు చెల్లించండి.
8. మీ టికెట్ కన్ఫర్మ్ అయ్యాక వాట్సాప్‌లోకే వచ్చేస్తుంది.
- ఇది కూడా చదవండి : ఈ రాష్ట్రంలో ఒక్క రైల్వే స్టేషన్ కూడా లేదు..ఏ రాష్ట్రమో తెలుసా?
ఇలా ఏపీఆర్టీసి బస్ వాట్సాప్ టికెట్ బుకింగ్ అనేది ప్రయాణికులకు చాలా సులభం, యూజర్ ఫ్రెండ్లీ కూడా. మరీ ముఖ్యంగా వయసులో పెద్దవాళ్లకు, గ్రామీణ ప్రయాణికులకు, యాప్ యూజ్ తెలియని వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది.
నెక్ట్స్ టైమ్ మీకు ఏపీఆర్టీసి బస్ టికెట్ కావాలి అంటే యాప్ ఓపెన్ చేయకండి.
జస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయండి.
గుర్తుందిగా వాట్సాప్ నెంబర్ : 95523 00009..సేవ్ చేసుకోండి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
