హిమాలయాలను 360 డిగ్రీస్‌లో చూపించే సీక్రెట్ హిల్ స్టేషన్ | Auli Mini Travel Guide
Auli Mini Travel Guide : బయటి ప్రపంచానికి తెలియని అద్భుతమైన ప్రదేశాలు భారతదేశంలో ఎన్నో ఇక్కడ ఉన్నాయి. అందులో ఉత్తరాఖండ్‌లోని ఔలి ఒకటి. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారికి ఈ హిల్ స్టేషన్ గురించి తప్పకుండా తెలిసే ఉంటుంది.
ఎక్కడ ఉంది? | Auli Location
దేవ్ భూమిగా పిలుచుకునే ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఛమోలి జిల్లాలో ఉంది ఔలి. రిషికేష్ నుంచి బద్రినాథ్‌కు వెళ్లే మార్గంలో ఉన్న జ్యోషిమఠం (జ్యోతిర్మఠం) నుంచి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన హిల్ స్టేషన్ ఉంటుంది. మీరు జ్యోషిమఠం లేదా గోవింద్ ఘాట్‌లో ఎక్కడైనా స్టే చేయవచ్చు.
వింటర్ అడ్వెంచర్ | Winter Adventure
చలికాలంలో అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇష్టపడే వారికి ఔలికంటే బెస్ట్ డెస్టినేషన్ ఉండదనే చెప్పాలి. ముఖ్యంగా స్కీయింగ్ కోసం ఔలి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి నుంచి నందాదేవి, కామెట్ (Kamet) వంటి హిమాలయ పర్వత శ్రేణులు అద్భుతంగా దర్శనమిస్తాయి.
వీటిని చూసేందుకైనా సరే వెళ్లాలి అనుకుని చాలా మంది ఇక్కడికి వస్తారు. ఔలిలో ఉన్న వసతి సదుపాయాలు తక్కువే అయినా… రూమ్ నుంచే హిమాలయాలను ఫిల్టర్ లేకుండా చూసేయవచ్చు.

ఔలిలో ఒక ఆర్టిఫిషియల్ లేక్ కూడా ఉంది. చలికాలంలో ఈ సరస్సు చుట్టూ మొత్తం మంచు పేరుకుపోయి, ఈ ప్రదేశం నిజంగా ఒక మంచు స్వర్గంలా మారిపోతుంది.
జ్యోషిమఠం నుంచి ఔలికి రోప్‌వే ప్రయాణం కూడా చేయవచ్చు. ఈ ప్రయాణం మొత్తం హిమాలయాల అందాలను ఆస్వాదించేలా ఉంటుంది.
ఆది శంకరాచార్యులు స్థాపించిన మఠం | Jyotirmath Importance
కుటుంబంతో కలిసి ఒక మంచి హిమాలయన్ అడ్వెంచర్ ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే, మీ లిస్టులో ఔలిని తప్పకుండా టాప్ 3 డెస్టినేషన్లలో చేర్చుకోవచ్చు.

అలాగే జ్యోషిమఠంలో ఉన్న పాలరాయితో నిర్మించిన నరసింహ స్వామి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. ఇక్కడే ఆది శంకరాచార్యులు స్థాపించిన నాలుగు పీఠాల్లో ఒకటైన జ్యోతిర్మఠం కూడా ఉంది. సో మీరు బద్రినాథుడి దర్శనానికి ముందు, లేదా దర్శనం అనంతరం ఇక్కడ స్టే చేయవచ్చు. ప్రశాంతంగా ఇక్కడి స్లో లైఫ్‌ను ఆస్వాదించవచ్చు.
Vlog Watch : బద్రినాథ్ ఆలయం గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.
Watch : భారత దేశంలో చివరి గ్రామం మానా దర్శనం
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
Watch : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు చిట్ చాట్
