Best Tourist Spot : ఆంధ్ర ఊటీకి క్యూ కడుతున్న పర్యాటకులు.. రాయలసీమలో ఎత్తైన ప్రాంతం.. విశేషాలేంటో తెలుసా ?
Best Tourist Spot : ఆంధ్రప్రదేశ్‌లోని పర్యాటక ప్రాంతాల్లోకెల్లా ఎత్తైన ప్రదేశంగా పేరుగాంచింది హార్సిలీ హిల్స్. తూర్పు కనుమల దక్షిణ భాగంలో ఉన్న ఈ కొండల శ్రేణిని పర్యాటకులు ఆంధ్ర ఊటీగా, రాయలసీమ వేసవి విడిదిగా పొగుడుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ఇక్కడి వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారింది. రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాలతో పాటు చెన్నై, బెంగళూరు నగరాల నుంచి పర్యాటకులు సులభంగా ఇక్కడికి చేరుకుంటున్నారు.
ప్రకృతి అందాల నిలయం హార్సిలీ హిల్స్
సముద్ర మట్టానికి 1,265 అడుగుల ఎత్తులో ఉన్న హార్సిలీ హిల్స్‌లో ప్రకృతి అందాలకు కొదవ లేదు. ఆహ్లాదకరమైన వాతావరణంతో కూడిన ఈ కొండ మార్గంలో ప్రయాణిస్తుంటే, దారికి ఇరువైపులా నీలగిరి చెట్లు, సంపెంగ తోటలు స్వాగతం పలుకుతాయి. ముఖ్యంగా సంపెంగ పూల సువాసనతో ఈ ప్రాంతం పర్యాటకులను కొత్త లోకానికి తీసుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడి కొండ వాలుల్లో స్థానికంగా నివసించే చెంఛులు సంపెంగ పూల మొక్కలను పెంచారు. వీటితో పాటు చందనం, ఎర్ర చందనం, ఉడుగ, రీటా, షీకకాయ, యూకలిప్టస్, ఆల్మండా, పనస, అడవిమొగ్గ చెట్లు ఇక్కడ పుష్కలంగా కనిపిస్తాయి.

ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
ఉష్ణోగ్రతలు, వన్యప్రాణుల సందడి
హార్సిలీ హిల్స్‌లో చలికాలంలో ఉష్ణోగ్రత కేవలం 3 డిగ్రీల వరకు ఉంటుంది. వేసవిలో కూడా సుమారు 32 డిగ్రీల సెల్సియస్ వద్ద చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని అడవులు, ఔషధ మొక్కలతో నిండిన ఈ హార్సిలీ హిల్స్‌లో చూడదగిన ప్రదేశాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఇక్కడి చల్లని వాతావరణమే పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతంలో జింకలు, చిరుతపులుల వంటి వన్యప్రాణులు కూడా తిరుగుతూ పర్యాటకులను కనువిందు చేస్తాయి.
ఇది కూడా చదవండి : Vanuatu: వనవాటు దేశం ఎక్కడుంది ? ఎలా వెళ్లాలి ? కంప్లీట్ ట్రావెల్ గైడ్
హార్సిలీ హిల్స్ అసలు పేరు, ప్రత్యేక ఆకర్షణలు
ఈ ప్రాంతానికి అసలు పేరు ఏనుగు మల్లమ్మ కొండ. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడే ప్రసిద్ధి చెందిన ఋషి వ్యాలీ స్కూల్ స్థాపించబడింది. దేశంలోని వివిధ ప్రాంతాల విద్యార్థులు ఈ పాఠశాలలో ఉంటూ చదువుకుంటున్నారు. అంతేకాకుండా, సమీపంలోనే మీట్స్ ఇంజనీరింగ్ కాలేజీ, విశ్వం ఇంజనీరింగ్ కాలేజీలు ఉండటంతో సెలవు రోజుల్లో, ఆదివారాలలో విద్యార్థుల సందడితో హార్సిలీ హిల్స్ చాలా అద్భుతంగా ఉంటుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
