Digital Travel Documents: ఫోన్లో ట్రావెల్ డాక్యుమెంట్స్ ఎక్కడ సేవ్ చేయాలి ?
Digital Travel Documents : ప్రయాణాల్లో డాక్యుమెంట్స్ చూపించమని అధికారులు కోరితే పేపర్లు వెతికే అవసరం లేదు. మీ ఫోన్లోనే అన్నీ సేవ్ చేసుకోండి. ఈ సింపుల్ టిప్స్ మీకోసం
ఈ రోజుల్లో చాలా మంది ప్రయాణికులు తమ డాక్యుమెంట్స్ అంటే ఐడీ ప్రూఫ్స్, హోటల్ బుకింగ్, ట్రైన్ వివరాలు అన్నీ కూడా ఫోన్లోనే సేవ్ చేసుకుని బయల్దేరుతున్నారు.
పేపర్ ఫైల్స్ క్యారీ చేయడం కన్నా స్క్రీన్‌పై డిపెండ్ అవ్వడం ఇప్పుడు సాధారణం అయింది.
దీని వల్ల ప్రింటులు తీసుకోవడం, వాటిని బ్యాగ్‌లోంచి బయటికి తీయడం, అవి ఎక్కడ మిస్ అవుతాయో అని టెన్షన్ పడటం ఉండదు.. ఇలా ఫోన్లో తీసుకెళ్లడం వల్ల ప్రశాంతంగా ప్రయాణం చేయవచ్చు.\
- ఇది కూడా చదవండి : Travel Tips 39 : గ్లేసియర్ వాటర్ తాగొచ్చా? అందులో బ్రెయిన్తినే అమీబా ఉంటుందా ? | Glacier Water
ఒక చిన్న అలవాటు | Digital Travel Documents
అయితే దీని కోసం ఒక చిన్న Digital Travel Habit ను మీరు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లౌడ్ స్టోరేజీలో (Google Drive లాంటివి) ఒక సెపరేట్ ఫోల్డర్ క్రియేట్ చేసి స్టోర్ చేసుకోండి.
ఇందులో..ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, టికెట్లు, కన్ఫర్మేషన్స్, వీసా… ఇలా అన్నీ స్టోర్ చేసుకోండి. ఫోన్ పోయినా లేదా బ్యాటరీ లో అయినా డ్రైవ్ నుంచి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు.
తరచూ ప్రయాణాలు చేసే వారికి ఈ టిప్స్ బాగా ఉపయోగపడతాయి. ఎయిర్‌పోర్టులో, రైల్వే కౌంటర్లో, హోటల్ రిసెప్షన్లో హఠాత్తుగా ఎవరైనా డాక్యుమెంట్స్ అడిగినప్పుడు బ్యాగ్‌లలో వెతకడం కన్నా ఫోన్లో క్షణాల్లో వారికి చూపించవచ్చు.
టెన్షన్ తగ్గుతుంది | Digital Travel Documents
డిజిటల్ డాక్యుమెంట్స్ వల్ల ప్రయాణ సమయాల్లో అనవసరమైన టెన్షన్ తగ్గుతుంది. క్లారిటీ ఉంటుంది. జస్ట్ ఫోల్డర్ పేరు, లొకేషన్ గుర్తుంటే సరిపోతుంది.
సాంకేతికతను సరిగ్గా వినియోగిస్తే ట్రావెల్ ఎక్స్‌పీరియెన్స్ బెటర్‌గా ఉంటుంది. ఈ చిన్న హ్యాబిట్ మీ ప్రయాణాలను మరింత స్మూత్‌గా మారుస్తుందని ఆశిస్తున్నాం.
Prayanikudu Tip :
ప్రయాణికుడు చెప్పే ఈ టిప్ పైన వివరించిన చిట్కాకు వ్యతిరేకంగా అనిపించవచ్చు. ఎంతకైనా మంచిది డాక్యుమెంట్స్‌ను ప్రింట్ చేసి క్యారీ చేయండి. తాతల కాలం పద్ధతి అనిపించినా… ఈ పద్ధతికి తిరుగులేదు. పేపర్ అండ్ డిజిటల్ రెండూ క్యారీ చేయండి. ఎందుకంటే అన్ని చోట్లా ఫోన్లను నమ్మలేము. అలాగే అన్ని చోట్లా పేపర్లు తీయలేము.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
