చైనాలో మంచుతో నిర్మించిన నగరం | అక్కడి Harbin Ice Festival 2025 విశేషాలు

షేర్ చేయండి

China : ప్రపంచంలో తొలి సారి పూర్తిగా మంచుతో మనుషులు కట్టిన నగరం
| Harbin Ice Festival 2025 విశేషాలు

చైనాలో ప్రతీ ఏటా వేల కోట్లతో 10,000 మంది మంచు కళాకారులు కలిసి ఒక మంచు ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. దీని కోసం కూలీలు నది నుంచి మంచును తీసుకొస్తారు. తరువాత ఇక్కడ ఒక మంచు పండగ జరుగుతుంది. అదే హార్బిన్ ఐస్ ఫెస్టివల్ ( Harbin Ice Festival 2025 ). మరిన్ని విశేషాలు మీ కోసం

హార్బిన్ ఐస్ ఫెస్టివల్ అంటే | About Harbin Ice Festival

హార్బిన్ ఐస్ ఫెస్టివల్‌ను 1963 లో ప్రారంభించారు. మధ్యలో గ్యాప్ వస్తే మళ్లీ 1985 లో పున: ప్రారంభించారు. దీని ప్రతీ ఏడాది జనవరిలో సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ ఐస్ ఫెస్టివల్ నిర్వహించేందుకు దగ్గర్లోని షాంగువా నది ( Songhua River ) నుంచి ఐస్ బ్లాక్స్‌ను తీసుకువస్తారు.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి | If You Want to Get Travel & Tourism Updates On Your WhatsApp Click Here |

హార్బిన్ ఐస్ అండ్ స్నో వరల్డ్ హైలైట్స్ | Harbin Ice and Snow World  

ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా చైనాలోని హర్బిన్‌లో మంచు ఫెస్టివల్ జరుగుతుంది. మొత్తం ఐస్ బ్లాక్స్‌తో నిర్మించే ఈ మంచు నగరం విశేషాలు.

అద్భుతమై మంచు శిల్పాలు

a snow sculpture of a dragon
Harbin Ice Festival 2025 లో మంచుతో చెక్కిన డ్రాగన్

హార్బిన్ ఫెస్టివల్‌లో ( Ice Festival ) మంచు శిల్పాలే హైలైట్‌. ప్రతీ టూరిస్టును ఇవి ఆకర్షిస్తాయి. ఎత్తైన కోటల నుంచి వన్య ప్రాణుల థీమ్‌ వరకు ప్రతీ మంచు శిల్పం మంచి శిల్పంగానే కనిపిస్తుంది. మనుషుల క్రియేటివిటీ ఏంటో ఈ ఫెస్టివల్‌కు వెళ్తే అర్థం అవుతుంది.

ఐస్ లాంతర్న్ గార్డెన్ పార్టీ : ఈ పెస్టివల్‌లో (Harbin Ice Festival 2025 ) మరో హైలైట్ ఇదే. ఇక్కడ వీక్షకులు జిగేలు మని మెరుస్తున్న మంచు శిల్పాల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్లిపోవచ్చు. ఇదొక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు.

harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (8)
మంచు నిర్మించిన కోట

వింటర్ స్పోర్ట్స్ : సాహసాన్ని ఇష్టపడేవాళ్ల కోసం హార్బిన్ ఐస్ ఫెస్టివల్ మంచి ఛాయిస్ అవుతుంది. ఇక్కడ ఐస్ స్కేటింగ్, ఐస్ స్లైడ్స్, ఐస్ సైక్లింగ్ వంటి ఎన్నో వింటర్ యాక్టివిటీస్ చేయవచ్చు. 

కల్చరల్ పెర్ఫార్మెన్స్ :  ఈ మంచు వేడుకలో లోకల్ కల్చర్, అండ్ ట్రెడిషన్స్‌ గురించి అక్కడి పెర్పార్మెన్స్‌లను చూసి తెలుసుకోవచ్చు. ఇక్కడ డ్యాన్స్ పెర్ఫార్మెన్సే కాదు మంచులో కుస్తీ పోటీలు కూడా జరుగుతుంటాయి.

చైనా రుచులు : చైనా అంటే మనకు నూడిల్స్, మంచూరియా, సూప్, ఫ్రైడ్ రైసే గుర్తుకు వస్తాయి. ఇక్కడ మీరు మరెన్నో వెరైట్ రెసెపీస్ ట్రై చేయవచ్చు. అయితే తినే ముందు ఏం తింటున్నారో తెలుసుకోండి. ఇక్కడ మీకు రష్యాన్ వంటకాలు కూడా లభిస్తాయి.

హార్బిన్ ఐస్ ఫెస్టివల్‌‌కు ఎప్పుడు, ఎలా వెళ్లాలి ?

Harbin Ice Festival 2025
హార్బిన్ మంచు నగరం

Best Time To Visit Harbin Ice Festival : హార్బిన్ ఐస్ ఫెస్టివల్ సాధారణంగా జనవరిలో మొదలై ఫిబ్రవరి చివరి వరకు కొనసాగుతుంది. ఇక్కడికి జనవరి మధ్యలో వెళ్తే బాగుంటుంది. ఈ సమయంలో ఐస్ ఫెస్టివల్ ఫుల్ స్వింగ్‌లో ఉంటుంది. ఇక్కడి శిల్పాలు కూడా మంచి షేప్‌లో ఉంటాయి

ఎలా వెళ్లాలి ? | How to Reach the Harbin Ice Festival ?

హర్బిన్ అనేది చైనాలో జరిగే వేడుక. చలికాలంలో జరిగే ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్టులు వస్తుంటారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టెంపరేచర్ వచ్చేసి మైనస్ 20 వరకు ( Temperature In Harbin ) వెళ్తుంది. ఇక ఇక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందామా…

విమానంలో | Flights to Harin Ice Festival

హార్బిన్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఇక్కడి నుంచి ప్రపంచంలోనే ప్రముఖ నగరాలకు డైరక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.

harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (3)
ఐస్ బ్లాక్స్‌తో నిర్మించిన

హైదరాబాద్ నుంచి హార్బిన్‌కు ( Hyderabad To Harbin ) వెళ్లాలి అనుకుంటే డైరక్ట్ ఫ్లైట్స్ లేవు. మీరు రెండు మూడు ఫ్లైట్స్ మారాల్సి ఉంటుంది. వీటన్నింటికి కలిసి చీపెస్ట్ టికెట్ల ధర వచ్చేసి రూ.28,000 వరకు పడుతుంది. ఈ టికెట్ వివరాల ప్రకారం సుమారు ప్రయాణానికి 25 గంటల సమయం పడుతుంది ప్రయాణానికి. ముందు ఢిల్లీకి వెళ్లి, అక్కడి నుంచి బ్యాంకాక్, బ్యాంకాక్ నుంచి వుహాన్, వుహాన్ నుంచి హార్బిన్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

ఎక్కడ ఉండాలి ? | Accommodation in Harbin

ఐస్ ఫెస్టివల్ సమయంలో ఇక్కడ ఎన్నో హోటల్స్ అండ్ గెస్ట్ హౌజ్‌లు అందుబాటులో ఉంటాయి. అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఇబ్బంది తగ్గించుకోవచ్చు. మంచి హోటల్ వెతుకుతుంటే మాత్రం షాంగ్రీ లా హోటల్ , సాఫిటెల్ హార్బిన్ వంటలి ప్రముఖ హోటల్స్ కూడా అందుబాటులో  ఉన్నాయి.

కొన్ని టిప్స్ | Tips For Harbin Ice Festival 2025

వెచ్చని దుస్తులు : ఇది మంచు ప్రపంచం ( Harbin Ice Festival 2025 ). అందుకే మీరు థర్మల్ లోదుస్తువులు, వింటర్ జాకెట్స్, గ్లవ్స్, చలి క్యాప్ వంటివి ధరించండి. లేదంటే ఇబ్బంది పడిపోతారు.

harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (2)
ఒక మంచు శిల్పం

చక్కగా ప్లాన్ చేసుకోండి : మీ ప్రయాణం మొదలు పెట్టే ముందు ఈ ఫెస్టివల్ వారి అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయండి. ఏరోజు ఏఏ ఫెస్టివల్ జరగనుందో చెక్ చేయండి. కొన్ని ప్రత్యేక పెర్ఫార్మెన్స్‌ల వివరాలు కోసం వెతకండి.

నైట్ టూర్ | Harbin At Night : ఈ ఐస్ ఫెస్టివల్ వచ్చేసి రాత్రి సమయంలో అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మంచు శిల్పాల మధ్యలో లైటింగ్ ఉంటుంది. అందమైన లైటింగ్‌లో కోటలు, శిల్పాలు ఇవన్నీ ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్టు ఉంటుంది.

మంచి కెమెరా : ఇక్కడికి రావాలి అనుకుంటే డీఎస్‌ఎల్‌ ఆర్ లేదా మంచి కెమెరా తీసుకెళ్లండి. ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూస్ చాలా కనిపిస్తాయి మీకు.

harbin Ice Festival Facts, Travel Guide, Tips and Information (5)
మంచుతో చేసిన శిల్పం

స్థానికులతో మాట్లాడండి : హార్బిన్ వెళ్తే స్థానికులతో మాట్లాడండి. వారి అనుభవాలు తెలుసుకోండి. మంచు కళాకారులు అందుబాటులో ఉంటే వారిని పరిచయం చేసుకోండి. మీకు ఎన్నో విషయాలు తెలిసే అవకాశం ఉంది.

ముగింపు

చైనాలోని ( China ) హార్బిన్ ఫెస్టివల్ ( Harbin Ice Festival 2025 )అనేది మీకు సరికొత్త అనుభవాన్ని మిగుల్చుతుంది. ఇక్కడి ఐస్ ఆర్ట్, కల్చర్, వింటర్ యాక్టివిటీస్ ఇవన్నీ కలిపి మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి. కుటుంబంతో కలిసి వెళ్లేందుకు మంచి డెస్టినేషన్ ఇది. సాహసాన్ని ఇష్టపడే సోలో ట్రావెలర్స్ కూడా ఇక్కడికి వెళ్తే బగా ఎంజాయ్ చేస్తారు. అయితే కాస్త ముందస్తు ప్లానింగ్, బుకింగ్ చేసుకుంటే ఈ ప్రయాణం మీకు జీవితాంతం గుర్తుండిపోతుంది.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!