హిందూ మతం, ఆచారాలు పాటిస్తున్న 8 దేశాలు | Hinduism Abroad

షేర్ చేయండి

హిందూ మతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది (Hinduism Abroad) అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను అక్కడి ప్రజలు పాటిస్తున్నారని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?

ప్రపంచంలోనే మొట్టమొదట పుట్టిన (Oldest Religion On Earth),  అత్యంత పురాతనమైన మతం హిందూ మతం. భారతదేశంలో పుట్టి ప్రపంచానికి ఎలా జీవించాలో, ఎలా నడుచుకోవాలో నేర్పించిన మతం ఇది. హిందూ మతంలోని ఆచారాలు (Hinduism Culture), సంప్రదాయాలకు ఉన్న విశిష్టత గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. ఎందుకంటే హిందూ మతం అనేది కేవలం మతం మాత్రమే కాదు ఇది ఒక జీవన విధానం కూడా.

అయితే హిందుమతం భారత దేశంతో పాటు మరికొన్ని దేశాల్లో కూడా విస్తరించింది అని, నేటికీ ఆయా దేశాల్లో హిందూ మతంలోని ఆచారాలు, సంప్రదాయాలను (Hinduism Abroad) అక్కడి ప్రజలు పాటిస్తున్నారాని తెలుసా? ఆ దేశాలేంటో తెలుసుకుందామా మరి?

1. నేపాల్ : ప్రపంచ శిఖరాన హిందూ రాజ్యం

Nepal Hindu Country
నేపాల్

నేపాల్‌ (Nepal) జనాభాలో 81 శాతం హిందూ మతస్థులే ఉంటారు. భారత్ తరువాత హిందువులు మెజారిటీగా ఉన్న దేశం ఇది. నేపాల్‌లో దీపావళిలో పాటు దశైన్ (Dashain), తిహార్ అనే పండగలను అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ఇక్కడ హిమాలయ పర్వతాల (The Great Himalayas) సాక్షిగా ఉన్న అనేక ప్రాచీన మందిరాలు (Temples In Nepal), పవిత్ర క్షేత్రాలను చూడటానికి భారత దేశం నుంచి కూడా సందర్శకులు భారీ సంఖ్యలో వెళ్తుంటారు. 

2. ఇండోనేషియా | Indonesia

Hinduism Abroad
బాలి, ఉలువాటు ఆలయం

Hinduism In Bali:  ఇండోనేషియా రాజధాని బాలిని దేవుడి ద్వీపంగా (Island Of Gods) కూడా పిలుస్తుంటారు. బాలిలో సుమారు 80 శాతం జనాభా హిందు మతస్థులే. ఆ దేశ సంప్రదాయాలతో పాటు హిందూ మతం ఆచారాలను కూడా బాలి ప్రజలు పాటిస్తుంటారు. 

  • బాలి వెళ్తే ఇక్కడి అద్భుతమైన వేడుకలను సందర్శకులు వీక్షించే అవకాశం ఉంది.
  • దీంతో పాటు ఇక్కడి ఉలువాటు ఆలయం (Uluwatu Hindu Temple) కూడా సందర్శకులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ప్రకృతిలో మమేకం అయ్యేలా చేస్తుంది.
  • ఈ ఆలయం వెళ్తే బాలినీస్ హిందూ కల్చర్ (Balinese Hindu Culture) చూడవచ్చు.

3.  మారిషస్

mauritius
మారిషస్

Mauritius : మారిషస్‌లో దాదాపు 50 శాతం మంది హిందూ మతస్థులే ఉంటారు. ఇక్కడ మహా శివరాత్రి (Maha Shivaratri), దీపావళి వంటి అనేక హిందూ పండగలను ప్రజలు ఉత్సాహంగా సెలబ్రేట్ చేస్తారు.  

  • ఈ ఐలాండ్ దేశంలో అనేక ప్రాంతాల్లో హిందూ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. 
  • హిందూ మత ఆచారాలు, సంప్రదాయాలను ప్రజలు తమ జీవితంలో నిత్యం పాటిస్తూ ఉంటారు.

4. ఫిజీ

Fiji
ఫిజీ

Fiji : ఫిజీలో 30 శాతం మంది హిందూ మతాన్ని పాటిస్తారు. 19వ శతాబ్దంలో ఫిజికి పని కోసం వెళ్లిన కొంత మంది హిందువులు అక్కడే స్థిరపడ్డారు. నాటి నుంచి నేటి వరకు కూడా అక్కడ దీపావళి నుంచి హోలీ (Holi) వరకు ప్రధాన హిందు పండగలను స్థానికులు వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజలు కలిసికట్టుగా వేడుకలను నిర్వహిస్తుంటారు.

5. శ్రీలంక | Hinduism Abroad

Sri Lanka Hinduism
శ్రీలకం

Sri Lanka :  హిందూ దేవీ దేవతలకు సంబంధించిన అనేక మందిరాలకు నెలవు శ్రీలంక. రామాయణంలోని (Ramayan) అనేక ప్రధాన ఘట్టాలు చోటు చేసుకున్న ప్రాంతాలను ఇక్కడ మీరు రామాయణ ట్రెయిల్‌ (Ramayan Trail) అనే టూరిస్టు ప్రాంతాల్లో కవర్ చేయవచ్చు. ఇక్కడ తమిళ హిందూ ప్రజల (Tamil Hindu) జనాభా ఎక్కువగా ఉంటుంది.

6. ట్రినిడాడ్ అండ్ టొబాగో

Trinidad &  Tobago Hinduism
ట్రినిడాడ్ , టొబాగో

Trinidad & Tobago :  కరీబియన్ ద్వీపాల్లో ఉన్న ట్రినిడాడ్ అండ్ టొబాగో దశాల్లో హిందూ మతాన్ని, ఆచారాలను  పాటించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. భారతీయు సంప్రదాయాల ప్రభావాన్ని స్థానికుల జీవితాల్లో గమనించవచ్చు. 

  • ఇక్కడ దీపావళితో పాటు హోలీ పండగలను వేడుకగా నిర్వహిస్తారు. 
  • హోలిని ఇక్కడ ఫగ్వా (Phagwa) అనే పేరుతో నిర్వహిస్తారు. 

7. బంగ్లాదేష్ 

Bangladesh
బంగ్లాదేష్‌లోని ఒక ఆలయంలో ఉన్న శిల్పకళ

Bangladesh : బంగ్లాదేష్‌లో సుమారు 7.91 శాతం హిందువులు నివసిస్తుంటారు. ఆంజనేయుడి నుంచి నంద గోపాలుడు, దుర్గమ్మ వరకు అనేక హిందూ దేవీ దేవతల ఆలయాలకు నెలవు ఈ దేశం. నవరాత్రి సమయంలో దుర్గా పూజను (Navratri In Bangladesh) ఇక్కడ వేడుకగా నిర్వహిస్తారు.

8. కాంబోడియా 

angkor wat Temple Combodia
ఆంగ్‌కోర్ వాట్ ఆలయం

Cambodia: ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయం (Biggest Hindu Temple In World) ఉన్న దేశం కాంబోడియా. అదే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు కలిసి ఉన్న ఆలయమైన ఆంగ్‌కోర్ వట్ (Angkor Wat) ఆలయం అనేది కంబోడియాలో హిందూ మతం అస్థిత్వానికి సజీవ సాక్ష్యంగా చెప్పవచ్చు. 

  • ఈ ఆలయం ఎంత పురాతనమైనదో అంతే విశిష్టమైనది కూడా.
  • ప్రపంచంలోనే అనేక దేశాల నుంచి పర్యాటకులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!