World Tour on Cruise Ship: 135 దేశాలు, 7 ఖండాలు.. 3 ఏళ్ల ప్రపంచ పర్యటనకు ఎంత ఖర్చవుతుంది?
World Tour on Cruise Ship: ప్రపంచాన్ని స్వేచ్ఛగా చుట్టి రావాలని చాలా మంది కలలు కంటారు. కానీ అది అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అయితే ఇప్పుడు మీకో అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏకంగా 135 దేశాలు, 7 ఖండాలను చుట్టి వచ్చేలా ఒక ప్రపంచ పర్యటన (World Tour) అందుబాటులో ఉంది. ఈ భూమిపై ఉన్న అద్భుతమైన అందాలను వీక్షించవచ్చు. మరి ఈ సుదీర్ఘ టూర్‌ను ఎవరు నిర్వహిస్తున్నారు? టూర్ ప్యాకేజీ ధర ఎంత? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
3 ఏళ్ల పాటు ప్రపంచ పర్యటన (The Three-Year Global Voyage)
లైఫ్ ఎట్ సీ క్రూయిజెస్(Life at Sea Cruises) అనే కంపెనీ ఈ ప్రపంచ పర్యటన కోసం బుకింగ్స్ ఆహ్వానిస్తోంది. ఇది సుమారు మూడు సంవత్సరాల పాటు కొనసాగే సుదీర్ఘ ప్రయాణం. ఈ టూర్ ఎం.వి. జెమిని (MV Gemini) అనే క్రూయిజ్ షిప్లో జరుగుతుంది. ఈ ప్రపంచ పర్యటన నవంబర్ 1 న ఇస్తాంబుల్ (Istanbul) నుంచి మొదలైంది. ఈ టూర్లో ప్రయాణికులు మొత్తం 375 పోర్టులు సందర్శిస్తారు, సుమారు 135 దేశాలకు వెళతారు. భూమిపై ఉన్న అన్ని ఖండాలను (7 ఖండాలు) చుట్టి వస్తారు. ఈ షిప్ దాదాపు 1,30,000 మైళ్లు ప్రయాణిస్తుంది.
ప్రపంచంలోని అద్భుతాలు ఒకే ట్రిప్‌లో
ఈ మూడు సంవత్సరాల ప్రపంచ పర్యటనలో కస్టమర్లు ప్రపంచంలోని 14 అద్భుతాలలో దాదాపు 13 అద్భుతాలను చూడవచ్చు. ఇందులో భారతదేశంలోని తాజ్ మహల్ నుంచి రియో డి జనీరోలోని క్రైస్ట్ ది రిడీమర్ విగ్రహం, మెక్సికోలోని చిచెన్ ఇట్జా, చైనా గోడ (Great Wall of China), మాచు పిచ్చు, గిజా పిరమిడ్లు వంటివి ఉన్నాయి. దక్షిణాఫ్రికా, అంటార్కిటికా, కరేబియన్, మధ్య అమెరికా, ఉత్తర అమెరికా, హవాయి మినహా మిగిలిన ప్రాంతాలను సందర్శించవచ్చు. దేవాలయాలు, పర్వతాలు, లోయలు, బీచ్‌లు వంటి అనేక ప్రదేశాలను చూసే అవకాశం ఉంటుంది.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
ప్యాకేజీ ధర ఎంత?
ఈ అద్భుతమైన ప్రపంచ పర్యటన ధర మాత్రం చాలా ఎక్కువగానే ఉంది. ఈ టూర్ ధర సంవత్సరానికి సుమారు 30 వేల డాలర్లుగా నిర్ణయించారు. ఇది మన కరెన్సీలో దాదాపు రూ. 25 లక్షలు అవుతుంది. అంటే, మూడు సంవత్సరాల టూర్ కోసం మొత్తం రూ. 75 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
షిప్లో ఆఫీస్ సౌకర్యాలు
ఈ టూర్‌కు వెళ్లేవారి కోసం ఎం.వి. జెమిని షిప్లో ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఆఫీస్ విధులు ఉన్నవారు కూడా ఈ పర్యటనకు వెళ్లవచ్చు మరియు అక్కడి నుంచే తమ పనిని చేసుకోవచ్చు. షిప్లో 2 మీటింగ్ రూములు, 14 ఆఫీసులు, ఒక బిజినెస్ లైబ్రరీ, రిలాక్సింగ్ లాంజ్, ఒక కేఫ్‌తో పాటు మరెన్నో సౌకర్యాలు ఉన్నాయి. వీటితో పాటు స్పా, స్విమ్మింగ్ పూల్, ప్రపంచ స్థాయి డైనింగ్ వంటి విలాసవంతమైన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉంటాయి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
