Dubai Travel Alert : దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. ఈ 7 రూల్స్ తెలుసుకోకపోతే జైలుకు వెళ్తారు జాగ్రత్త
Dubai Travel Alert : ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో దుబాయ్ ఒకటి. మెరిసే ఆకాశహర్మ్యాలు, లగ్జరీ లైఫ్ స్టైల్, ఎడారి సఫారీలు, షాపింగ్ మాల్స్, బీచ్‌లు.. ఇవన్నీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే ఈ నగరం ఎంత ఆధునికంగా, అద్భుతంగా ఉంటాయో.. ఇక్కడి చట్టాలు కూడా అంతే కఠినంగా ఉంటాయి. చిన్న పొరపాటు చేసినా కూడా పెద్ద చిక్కుల్లో పడతారు. ముఖ్యంగా దుబాయ్‌కి వెళ్లే జంటలు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ట్రిప్ పాడు కాకుండా ఉండాలంటే ఈ 7 ముఖ్యమైన విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి.
వివాహం కాని జంటలకు హోటల్ రూల్స్
దుబాయ్‌లో వివాహం కాని జంటలను ఒకే గదిలో ఉండటానికి అనుమతించరు. పెళ్లికాని భాగస్వామితో హోటల్లో చెక్-ఇన్ చేయడానికి ప్రయత్నిస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది అక్కడి చట్టం. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధించవచ్చు. కాబట్టి, దుబాయ్ ట్రిప్ ప్లాన్ చేసే జంటలు ఈ నియమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.
ఇది కూడా చదవండి : Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా

బహిరంగ ప్రదేశాల్లో ప్రవర్తన, డ్రెస్ కోడ్
భారతదేశంలో లేదా ఇతర దేశాలలో మాదిరిగా బహిరంగ ప్రదేశాల్లో చేతులు పట్టుకోవడం, కౌగిలించుకోవడం లేదా ముద్దు పెట్టుకోవడం అక్కడ నేరంగా పరిగణిస్తారు. పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ నిషేధించబడింది. అలా చేస్తే జైలు శిక్ష లేదా భారీ జరిమానా పడవచ్చు. అలాగే, రోడ్లపై పాటలు పాడుతూ లేదా డ్యాన్స్ చేస్తూ ప్రవర్తించినా జరిమానా విధిస్తారు. డ్రెస్ కోడ్ విషయానికి వస్తే, దుబాయ్ ఆధునిక నగరమైనప్పటికీ, అక్కడి సంస్కృతిని గౌరవించాలి. బీచ్ లేదా పూల్ ప్రాంతాలు మినహా బహిరంగ ప్రదేశాల్లో చిన్న, పారదర్శక లేదా అసభ్యకరమైన దుస్తులు ధరించడం పూర్తిగా నిషేధం.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రాజకుటుంబం, డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినం
దుబాయ్ రాజకుటుంబాన్ని లేదా ప్రభుత్వాన్ని విమర్శించడం లేదా అపహాస్యం చేయడం చాలా తీవ్రమైన నేరం. సోషల్ మీడియాలో లేదా బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేసినా, కఠిన శిక్ష తప్పదు. అసభ్య పదజాలం వాడినా జైలు శిక్ష పడవచ్చు. ఇక డ్రగ్స్ విషయంలో దుబాయ్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుంది. అక్రమ డ్రగ్స్‌తో పట్టుబడితే జీవిత ఖైదు కూడా పడవచ్చు. అంతేకాక, భారతదేశంలో సాధారణంగా లభించే కొన్ని మందులు కూడా దుబాయ్‌లో నిషేధించబడ్డాయి. కాబట్టి, మీరు తీసుకువెళుతున్న మందుల గురించి ముందుగానే తనిఖీ చేసుకోవాలి, లేకపోతే పెద్ద సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది.
ట్రిప్ సంతోషంగా సాగాలంటే..
దుబాయ్ ఒక కలల నగరం అయినప్పటికీ, అక్కడి చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయో గుర్తుంచుకోవాలి. చిన్న పొరపాటు కూడా మీ టూర్ పాడుచేయవచ్చు. కాబట్టి, అక్కడి నియమాలు, సంస్కృతి, చట్టాలను గౌరవిస్తూ ప్రవర్తిస్తేనే మీ ప్రయాణం సంతోషంగా, ఆహ్లాదకరంగా సాగుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.