Travel Point: వర్షాకాలంలో షిమ్లా (Shimla), మనాలి లాంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని అనుకుంటున్నారా ? లేదా లేదా ఛార్ ధామ్ యాత్రకు బయల్దేరాలి అనుకుంటున్నారా ? అయితే మీ ఈ ఆలోచనలకు బ్రేకులు వేయండి.
ఎందుకంటే ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్(himachal pradesh), ఉత్తరాఖండ్‌లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో పర్యాటకానికి అంత సేఫ్ కానీ సమయం అని చెప్పగలను.
ముఖ్యాంశాలు
అసలేం జరుగుతోంది ? | Travel Point
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు (kullu), మండి, షిమ్లా, కాంగ్రా, మనాలి (Manali) ప్రాంతాల్లో…ఉత్తరాఖండ్‌లోని ఛమోలి జిల్లాల్లో (Chamoli) భారీ, కుండపోత వర్షాలతో పాటు కొండ చరియలు విరిగి పడుతున్నాయి.

- దీంతో ప్రతిష్టాత్మక కాల్కా-షిమ్లా ట్రైనును (Kalka-Shimla Train) ను రద్దు చేశారు.
- కేదార్‌నాథ్ , బద్రినాథ్ (Badrinath), యమునోత్రి, గంగోత్రిలకు వెళ్లే ఛార్‌ధామ్ (Char Dham Yatra) యాత్రికులను ముందుకు వెళ్లకుండా 24 గంటల పాటు యాత్రను నిలిపివేశారు. అనంతరం యాత్రను పున: ప్రారంభించారు.
- వర్షాల వల్ల పర్యాటరక రంగం (Tourism) నెమ్మదించింది. దాదాపు 5 శాతం మేరా బుకింగ్స్ తగ్గాయి అని తెలుస్తోంది.
- వర్షాలకు భయపడి చాలా మంది తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకుంటున్నారు.
📍 ఇక స్థానిక అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. వాతావరణం మారేంత వరకు ప్రయాణాలు పెట్టుకోవద్దని ప్రయాణికులను అధికారులు కోరారు.
మరి ప్రయాణికుల పరిస్థితి ? | North India Travel Plan In Monsoon
- రోడ్డు ప్రయాణం రిస్కీగా మారడంతో హిమాచల్‌కు వెళ్లే అనేక హైవేలను మూసి వేశారు. ఇది గమనించాలి.

- ఈ సమయంలో ప్రయాణాలు అంత సేఫ్ కాదు. అందుకే పరిస్థితి అదుపులోకి వచ్చి సాధారణ స్థితి ఏర్పడే వరకు వేచి చూడాలి.
- ఇప్పటికే బుకింగ్ చేసుకున్నట్టయితే రద్దు చేసుకోవడానికి ప్రయత్నించండి. అనేక హోమ్ స్టేలు, రిసార్టులు, హోటల్లు రిఫండ్ చేయడానికి లేదా రీషెడ్యూల్ చేయడానికి అంగీకరించాయి.
నార్త్‌లో (North India) వాతావరణం ఎప్పడు ఎలా మారిపోతుందో తెలియని పరిస్థితి. అందుకే తరచూ ప్రయాణాలు చేసే వాళ్లు, ట్రావెల్ వ్లాగర్లు (Travel Vloggers) కూడా తమ బుకింగ్స్ రద్దు చేసుకుంటున్నారు
మీరు ప్రయాణాలు చేయాలి అనుకుంటే…
ఈ టైమ్‌లో ప్రయాణాలు ( Traveling In Monsoon) అనేవి అంత సేఫ్ కాదు. అది మీక్కూడా తెలుసు. అయినా కూడా మీరు ట్రావెల్ చేయాలి అనుకుంటే మాత్రం…రిస్కు తక్కువగా ఉన్న కొన్ని డెస్టినేషన్స్‌ను మాత్రం మీకు సూచించగలను.

- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
- ఇది కూడా చదవండి : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి.
- ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?
- మీరు దక్షిణాదిలో (South India) ఉన్న అరకు (Araku), కూర్గ్, వయనాడ్ లేదా చిక్‌మగ్‌లూరుకు వెళ్లేందుకు ప్లాన్ చేయవచ్చు. అయితే వెళ్లే ముందు అక్కడి పరిస్థితుల గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాతావరణం అనుకూలంగా లేకపోతే నిర్మోహమాటంగా ట్రిప్ కేన్సిల్ చేసుకోండి.
ఇక మీరు ఉత్తర భారత దేశానికి మాత్రమే వెళ్లాలి అనుకుంటే మీ ప్రయాణాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌కు వాయిదా వేసుకోండి. వర్షాలు తగ్గుతాయి. అయితే నేను గత సెప్టెంబర్‌లో ఉత్తరాఖండ్ వెళ్లాను..అక్కడ కొండ చరియలు విరిగిపడటం కళ్లారా, లైవ్‌లో చూశాను.
నా ట్రావెల్ వ్లాగ్‌లో మీరు చూడవచ్చు…( సమయం : 13:11)
సో నార్త్ టూర్ ప్లాన్ చేస్తే సెప్టెంబర్ సెకండ్ హాఫ్ అయితే కాస్త బెటర్. అక్టోబర్ అయితే మరీ మంచిది.
- మీరు ఇక ప్రాంతానికి వెళ్లే ముందు ఆ ప్రాంతానికి సంబంధించి వాతావరణ శాఖ జారీ చేసే సూచనల గురించి తెలుసుకోండి. దీంతో పాటు స్థానిక టూరిజం బోర్డు ఏమైనా అప్డేట్స్ విడుదల చేసిందా అనేది కూడా చెక్ చేయండి.
ప్రయాణికుడు సలహా | Prayanikudu Travel Tip
- మీ ట్రావెల్ ప్లాన్ (travel plan) ఫ్లెక్సిబుల్‌లా మార్చుకునే విధంగా ఉండేలా చూసుకోండి. దీంతో పాటు ఉచిత కేన్సెలేషన్ పాలసి ఉన్న హోటల్స్, హోమ్‌స్టేస్‌లోనే బుకింగ్ చేసుకోండి.
🔔 ప్రయాణాల్లో కాస్త భద్రం గురూ
రియల్ టైమ్ ట్రావెల్ అలెర్ట్స్ కోసం, లేదా భారత దేశంలో ఈ సమయంలో సందర్శించాల్సిన ప్రదేశాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే రెగ్యులర్‌గా Prayanikudu.com ను విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.