September Tour : ఇంట్లో కూర్చుని బోర్ కొడుతోందా? అయితే ఈ బీచ్‌లకు వెళ్లి ఎంజాయ్ చేయండి!
September Tour : ఈ సెప్టెంబర్ నెలలో వరుసగా సెలవులు ఉన్నాయి. వినాయక చవితి, గణేష్ నిమజ్జనం అయిపోయాయి. ఈ సమయంలో ఉద్యోగంలో నిరంతరం ఒత్తిడికి గురవుతున్నవారు కొన్ని రోజులు సెలవు తీసుకుని, ఎక్కడికైనా టూర్ ప్లాన్ చేసుకుంటారు. అలాంటి వారు ఈ సెప్టెంబర్‌లో ఈ 7 అద్భుతమైన బీచ్‌లను సందర్శించవచ్చు. వర్షాకాలం తర్వాత ఇవి మీకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
గోకర్ణ ఓమ్ బీచ్ (కర్ణాటక)
కర్ణాటకలోని ఈ బీచ్ వర్షాకాలం తర్వాత సందర్శించడానికి ఉత్తమమైనది. సెప్టెంబర్ నెలలో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. బీచ్ పక్కన ఉన్న కొండలలో ట్రెక్కింగ్ చేయవచ్చు. ఇక్కడ మీరు విశ్రాంతి తీసుకుంటూ, యోగా చేయవచ్చు. ఇవన్నీ మీకు మానసిక సంతృప్తిని ఇస్తాయి. ఇక్కడ లభించే రుచికరమైన భోజనం కూడా చాలా బాగుంటుంది.
పూరీ బీచ్ (ఒడిశా)
ఒడిశాలోని ఈ బీచ్ మీకు ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది. సెప్టెంబర్‌లో ఇక్కడ వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, జనసందోహం కూడా తక్కువగా ఉంటుంది. ఇక్కడ సూర్యాస్తమయం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు బీచ్‌తో పాటు ప్రసిద్ధ పూరీ జగన్నాథ దేవాలయాన్ని కూడా సందర్శించవచ్చు.

బాగా బీచ్ (గోవా)
గోవాలో టూరిస్ట్ సీజన్ సెప్టెంబర్‌లో మొదలవుతుంది. ఈ సమయంలో జనం తక్కువగా ఉంటారు, వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ మీరు వాటర్ స్పోర్ట్స్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. రాత్రిపూట పార్టీలు మీకు సరికొత్త అనుభూతిని ఇస్తాయి.
కోవళం బీచ్ (కేరళ)
కేరళలోని ఈ బీచ్ స్వర్గంలా ఉంటుంది. వర్షాకాలం తర్వాత ఈ బీచ్ అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో సేద తీరవచ్చు.
ఇది కూడా చదవండి : Indian License : భారతీయ లైసెన్స్ ఈ 15 దేశాల్లో కూడా చెల్లుతుంది
థీహా బీచ్ (పశ్చిమ బెంగాల్)
పశ్చిమ బెంగాల్‌లోని ఈ బీచ్‌లో సెప్టెంబర్‌లో అలలు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఇది బడ్జెట్లో టూర్ చేయాలనుకునే వారికి మంచి ఎంపిక. కుటుంబంతో కలిసి వెళ్లడానికి ఇది సరైన ప్రదేశం. ఇక్కడ లభించే వేయించిన చేపలు, వివిధ రకాల సీఫుడ్ చాలా రుచిగా ఉంటాయి.
వర్కల బీచ్ (కేరళ)
కేరళలోని ఈ బీచ్ వర్షాకాలం తర్వాత చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. యోగా మరియు ఆయుర్వేదిక్ మసాజ్లను ఆస్వాదించడానికి సెప్టెంబర్ ఉత్తమ సమయం. ఈ సెప్టెంబర్‌లో కేరళ టూర్ ప్లాన్ చేసుకుంటే, ఇక్కడి ప్రశాంతమైన వాతావరణం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.
ఇది కూడా చదవండి : Bhutan : భూటాన్ ఎలా వెళ్లాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
దర్గిర్లి బీచ్ (మహారాష్ట్ర)
మహారాష్ట్రలోని ఈ బీచ్ సెప్టెంబర్‌లో కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ఇక్కడ స్కూబా డైవింగ్ చాలా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.