Har Ki Pauri At Haridwar : శ్రీహరి పాదాలు మోపిన హరిద్వార్‌లోని హరికి పౌరీ ఘాట్ విశిష్టతలు
హరిద్వార్ అనగానే చాలా మందికి ముందుగా గుర్తుకు వచ్చే ప్రాంతాల్లో హరికి పౌరీ ( Har Ki Pauri ) ఘాట్ తప్పకుండా ఉంటుంది. ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. హరీకి పౌరీ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన ఫీలింగ్ కలుగుతుంది.
ముఖ్యాంశాలు
కైలాసనాథుడు మహాశివుడి ( Lord Shiva ) జటాజూటం నుంచి వెలువడి, భారత భూభాగంలో గంగానది అడుగుపెట్టిన పుణ్య క్షేత్రం హరిద్వార్. ఇక్కడి నుంచే హిమాలయాలు ( Himalayas ) ప్రారంభం అవుతాయి. ఇక్కడే గంగానది హిమాలయలను వీడి నేలపై తన ప్రయాణం మొదలుపెడుతుంది. మోక్షాన్ని ప్రసాదించే ఏడు క్షేత్రాల్లో ఇదీ ఒకటి. పురాణాల్లో హరిద్వార్‌ను మాయా నగరి అని కూడా అనే వాళ్లు.
హరిద్వార్ విశిష్టత | Significance Of Haridwar
ఉత్తరాఖండ్ ( Uttarakhand ) రాష్ట్రంలోని హరిద్వార్‌లో 12 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా ( Maha Kumbh Mela 2025 ) జరుగుతుంది. ఈ సమయంలో లక్షలాదిమంది భక్తులు ఈ ఉత్సవంలో పాల్గొంటారు. బృహస్పతి కుంభంలోకి ప్రవేశించిన తరువాత, సూర్యుడు మేషంలోకి వచ్చినప్పుడు ఈ మేళా జరుగుతుంది. కుంభ మేళాలో పవిత్ర స్నానం ఆచరించడానికి చాలా మంది హరిద్వార్ చేరుకుంటారు. ఇక్కడ హరికి పౌరీ అనే ఘాట్‌లో చాలా మంది గంగానదిలో స్నానం ఆచరిస్తారు.
హరీకి పౌరీ | Har Ki Pauri

హరిద్వార్ అనగానే చాలా మందికి గుర్తుకు వచ్చేది హరికి పౌరీ ప్రాంతమే. ఈ ప్రాంతం నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ప్రాంతంలోకి ఎంటర్ అవ్వగానే ఒక ఆధ్మాత్మిక ప్రపంచంలోకి ఎంటర్ అయిన అనుభూతి కలుగుతుంది. హరికి పౌరిని చాలా మంది చాలా పేర్లతో పిలుస్తారు. కొంత మంది హరీకి పౌడీ, హర్ కి పౌరీ, హర్ కి పౌడీ అని కూడా పిలుస్తారు.
హరికి పౌరీ అంటే ఏంటి ? | Meaning Of Har Ki Pauri
హరికి పౌరీ అనే పదానికి అర్థం గురించి చాలా మంది చాలా విషయాలు చెప్పారు. అయితే చాలా మంది చెప్పిన దాని ప్రకారం హరీకి పౌరీ అంటే శ్రీ హరి పాదాలు అని అర్థం వస్తుంది. శ్రీ మహావిష్ణువు ( Lord Vishnu ) ఈ ప్రాంతంలో అడుగుపెట్టారు అని, ఆయన ఇక్కడికి వచ్చారు అని చెబుతారు. అందుకే ఈ ప్రాంతాన్ని హరికి పౌరీ అని పిలుస్తారట.

బ్రహ్మకుండ్ విశిష్టత | Brahmakund At Har Ki Pauri

హర్కి పౌరి ఘాట్ సమీపంలోనే బ్రహ్మకుండ్ ( Brahmakund ) ఉంటుంది. ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలగి ఆత్మ పవిత్రంగా మారుతుంది అని భక్తులు నమ్ముతారు. అయితే బ్రహ్మకుండం అనేది సెపరేట్‌గా ఉండదు. ఇది హరీకి పౌరీ ఘాట్‌లోనే ఒక భాగం. మీరు అది ఎక్కడ ఉందో హరికి పౌరి వెళ్లి కనుక్కోవచ్చు. లేదా పైన ఫోటో చూసి కూడా వెళ్లవచ్చు.
చాలా మంది ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి మీకు సులభంగా మీరు కనుక్కోవచ్చు. కుంభమేళా సమయంలో ఈ ఘాట్‌లో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు కనిపిస్తారు. లక్షలాది మంది ఇక్కడ గంగానదిలో ( Ganga River ) మునకవేస్తారు. దీని వల్ల మోక్షం కలిగి పునర్జన్మ కలగకుండా ఉంటుంది అని భక్తులు నమ్ముతారు.
హరికి పౌరి ఎవరు నిర్మించారు ? | who Constructed Har Ki Pauri
హరీకి పౌరి ఘాట్‌కు చారిత్రాత్మకంగా, ఆధ్యాత్మికంగా అత్యధిక ప్రాధాన్యత ఉంది. దీనిని 1వ శతాబ్దంలో రాజా విక్రమాదిత్య తన తమ్ముడు భర్తరి ( Bharthari ) గౌరవార్ధం నిర్మించారట. ఈ ఘాట్‌కు సమీపంలోనే గంగాదేవి ఆలయం ( Temples Near Har Ki Pauri ) , ఆంజనేయుడి ఆలయం, వాల్మికి ఆలయం, లక్ష్మీ నారాయణుడి ఆలయంతో పాటు చాలా ఆలయాలు ఉంటాయి.
గంగమ్మ హారతి విశేషాలు

How Ganga Aarti Is Performed ? : మన దేశంలో గంగా నది తీరం గుండా ఉన్న పవిత్ర క్షేత్రాల్లో నిత్యం గంగా హారతి వైభవంగా జరుగుతుంది. హరిద్వార్‌లోనే కాదు రిషికేష్ ( Rishikesh ) , కాశీ ఇలా పవిత్ర నదీ తీరాల్లో గంగమ్మకు గౌరవంగా, వందనం సమర్పిస్తూ ఉదయం సాయంత్రం హారతి ఇస్తారు. అయితే సీజన్‌ను బట్టి ఈ టైమింగ్ మారుతూ ఉంటుంది కాబట్టి మీరు ముందే టైమింగ్ చెక్ చేసుకుని వెళ్లడం ఉత్తమం.
గంగా హారతి విధానం | Process Of Ganga Aarti at Har Ki Pauri

గంగా హారతి జరిగే విధానం నేను గమనించిన దాన్ని బట్టి మీకు వివరిస్తాను. ఏమైనా సవరింపు ఉంటే కామెంట్ చేయండి. ముందుగా గంగా నదీ తీరానికి గంగమ్మ ఉత్సవ విగ్రహాన్ని తీసుకొస్తారు. గంగమ్మ విగ్రహానికి పూజలు చేస్తూ అమ్మ సమక్షంలో నదీ నీటిని పూజిస్తారు. తరువాత హారతి ఇవ్వడం చేస్తారు. అనంతరం ఇక్కడి పుజారి గంగానదిని కలుషితం చేయము అనే ప్రమాణాన్ని భక్తులతో తీసుకుంటారు. ఈ ప్రమాణం చేసే సమయంలో వేలాది మంది గొంతుకలను మీరు వినవచ్చు. నాకు ఇది కొంచెం కొత్తగా అనిపించింది.
అక్కడే ఉన్న పండితులు పవిత్రమైన దీపాలను వెలిగించి గంగా హారతి మొదలు పెడతారు. భక్తులు అందరూ హర్ హర్ గంగే ( Har Har Gange ) అంటూ గంగా హారతిలో పాల్గొంటారు. ఈ సమయంతో గంగమ్మను నమస్కరిస్తూ భక్తులు హారతిలో పాల్గొంటారు. జై గంగే మయ్యా అంటూ ఆధ్మాత్మిక పాటలను ప్లే చేస్తుంటారు.

సుమారు 45 నిమిషాల పాటు జరిగే గంగాహారతి వైభవాన్ని మాటల్లో వర్ణించలేము. దాదాపు 25 నుంచి 30 వేల మంది భక్తులు ఈ హారతిలో పాల్గొంటారు. హారతి అందరి దగ్గరకి ఈ హారతిని తీసుకెళ్లి దండం పెట్టుకునే అవకాశం ఇస్తారు. ఈ సమయంలో కొంచెం హడావిడి ఉంటుంది కాబట్టి జాగ్రత్త. తరువాత భక్తులు ఎవరైనా గంగా నది పరిరక్షణకు, గంగా హారతి కార్యక్రమాన్ని కొనసాగించేందుకు ఏమైనా విరాళం ఇద్దాము అనుకుంటే వారికి ఆ అవకాశం ఇస్తారు. మీరు 100 రూపాయలు కూడా ఇవ్వొచ్చు.
గంగమ్మ హారతికి వెళ్లే ముందు | Ganga Aarti At Har Ki Pauri Tips

హరతి సమయంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ ఉంటుంది. అందుకే మీరు సాయంత్రం 5 గంటలలోపు ఇక్కడికి చేరుకోండి. మీకు ముందు వరసలో కూర్చుని చూసే అవకాశం లభిస్తుంది. అయితే మీరు ఆలయాలు ఉన్న భాగంలో కాకుండా ఎదురుగా ఉన్న ఘాట్ నుంచి చూస్తే హరతి ఇంకా అందంగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఆలయాలకు ఆపోజిట్ ఘాట్‌లో ఉండాలి. దీని కోసం మీరు సాయంత్రం 5 గంటలవరకు ఆ ఘాట్ వద్దకు చేరుకునేలా చూడండి. వీలైతే అంతకన్నా ముందే వెళ్లినా నష్టం ఏం లేదు. లేదంటే మీరు మంచి వ్యూను మిస్ అవుతారు.
హరీకి పౌరీ వద్ద ఆలయాలు | Temple At Hari Ki Pauri

హర్ కి పౌరీ ఘాట్‌లో మీకు గంగమ్మ ఆలయాలు చాలా కనిపిస్తాయి. ప్రతీ ఆలయం ప్రాచీన గంగా ఆలయం అని చెబుతారు. మీకు నచ్చిన ఆలయాన్ని మీరు దర్శించుకోవచ్చు. అయితే హరికి పౌరీ వెళ్లే ముందు చిల్లర డబ్బులు లేదా రూ.10 రూపాయల నోట్లు ఉంచుకోండి. లేదంటే పెద్ద నోట్లు ఖర్చు అవుతాయి. లేదా మోహమాటానికి మీరు యూపీఐ నుంచి చెల్లించాల్సి ఉంటుంది.
Also Read : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
అందమైన హరిద్వార్
హరిద్వార్ ఆధ్మాత్మికంగా ఎంత విశిష్టమైనదో అంతే అందమైనది కూడా. ఘాట్లలో కూర్చుని గంగానది వైభవాన్ని చూడవచ్చు. దీంతో పాటు నగరంలో మీరు ఎక్కడికి వెళ్లినా మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. దగ్గర్లో అనేేక సందర్శనీయ స్థలాలు ఉన్నాయి వాటిని కూడా మీరు చూడవచ్చు.
రుద్రాక్షలు | Rudraksha Seeds

హరిద్వార్‌లో ( Haridwar ) మీకు అడుగడుగున రుద్రాక్షలు కనిపిస్తాయి. అందులో ఏకముఖి, పంచముఖి రుద్రాక్షలు కూడా కనిపిస్తాయి. రుద్రాక్ష మాలలు, చేతికి ధరించే విధంగా రుద్రాక్ష కంకణాలు చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. హరికి పౌరీలో ( Har Ki Pauri ) ప్రాంతంలో ఇలా రుద్రాక్ష పండ్లను కూడా అమ్ముతారు. మీకు రూ.100 కు 5 పండ్లను అమ్ముతారు. మీరు బేరం కూడా చేయొచ్చు.
హరిద్వార్ ఎలా వెళ్లాలి ? | How To Reach Haridwar From Hyderabad
ఒక వేళ మీరు హరిద్వార్ రావాలి అనుకుంటే ముందుగా దేవ్ భూమి ( Dev Bhoomi ) ఉత్తరాఖండ్ రావాల్సి ఉంటుంది. ఎలా రావాలో చూడండి.
ట్రైను మార్గంలో | Hyderabad To Haridwar By Train
హైదరాబాద్ నుంచి హరిద్వార్‌కు డైరక్ట్ ట్రైన్లు లేవు. మీరు ముందు ఢిల్లీకి ( Delhi to Haridwar ) వచ్చి అక్కి నుంచి బస్సులు లేదా ట్రైనులో హరిద్వార్ చేరుకోవచ్చు.
విమాన మార్గంలో | Hyderabad to Haridwar Flights
- హరిద్వార్‌లో విమానాశ్రయం లేదు. హైదరాబాద్ నుంచి కానీ విజయవాడ నుంచి కాని హరిద్వార్‌కు డైరక్టుగా ఫ్లైట్‌లో వెళ్లడం సాధ్యం కాదు. అయితే హరిద్వార్ నుంచి 38 కిమీ దూరంలో ఉన్న డెహ్రాడూన్‌లో ( Dehradun ) లో ఒక విమానాశ్రయం ఉంది. దీని పేరు జాలీ గ్రాంట్ విమానాశ్రయం ( Jolly Grant Airport ) మీరు ఇక్కడికి ఫ్లైట్‌లో రావచ్చు.

హైదరాబాద్ నుండి డెహ్రాడూన్ | Hyderabad to Dehradun Flights
- జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి హైదరాబాద్ డైరక్ట్, వన్‌స్టాప్, టూ స్టాప్ ఫ్లైట్స్ ఉన్నాయి. టికెట్ విషయానికి వస్తే హైదరాబాద్ ( RGIA ) నుంచి డెహ్రాడూన్ ( Dehradun Airport ) ఫ్లైట్ రాను పోను సుమారు రూ. 5600 అవుతుంది. ప్రయాణ సమయం మినిమం 2 గంట 25 నిమిషాల నుంచి 8 గంటల వరకు పట్టొచ్చు. ఇది మీరు ఎంచుకున్న వైమానిక సర్వీసుపై ఆధారపడి ఉంటుంది.
గమనిక : ధరలలో సమయాన్ని బట్టి మార్పు ఉంటుంది.
Also Read : 51 శక్తి పీఠాలు ఎక్కడ ఉన్నాయి ? ఏ శరీర భాగం ఎక్కడ పడింది ?
విజయవాడ నుంచి డెహ్రాడూన్ | Vijayawada To Dehradun Flights
- విజయవాడ నుంచి డెహ్రాడూన్‌కు డైరక్ట్ ఫ్లైట్స్ లేవు. మీరు ఎంచుకున్న విమాన సర్వీసును బట్టి ఒకటి లేదా రెండు విమానాశ్రయాల్లో ఆగాల్సి ఉంటుంది. ఇక టికెట్ విషయానికి వస్తే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ( Vijayawada International Airport ) నుంచి డెహ్రాడూన్ ఫ్లైట్స్ చార్జీలు అప్ అండ్ డౌన్ ప్రయాణానివి కలిపితే తక్కవులో తక్కువ మీకు రూ.8600 వరకు ఉంటాయి. మీరు ఎంచుకున్న విమాన సర్వీసులు బట్టి ప్రయాణానికి 5 గంటల 30 నిమిషాల నుంచి 35 గంటల వరకు సమయం పడుతుంది.
డెహ్రాడూన్ నుంచి హరిద్వార్‌కు మీకు ప్రైవేట్, ఆర్టీసి బస్సులు అందుబాటులో ఉంటాయి.
బస్సు మార్గంలో | Haridwar By Bus
- హరిద్వార్‌కు హైదరాబాద్, విజయవాడ నుంచి డైరక్టు బస్సులు లేవు. మీరు ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి బస్సులో హరిద్వార్ చేరుకోవచ్చు. ప్రభుత్వ ఆర్టీసి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే నేను ఫ్లిక్స్ ( Flix Bus ) అనే బస్సులో వచ్చాను.. లాంచింగ్ ఆఫర్ సందర్భంగా నాకు మంచి డిస్కౌంట్లో టికెట్ దొరికింది. మీరు కంపేర్ చేసుకుని బుక్ చేసుకోండి. ఎందుకంటే లాంచింగ్ సమయంలో ఉన్న డిస్కౌంట్ తరువాత ఉండకపోవచ్చు. ( ఇది ప్రమోషన్ కాదు. సలహా మాత్రమే )
Trending Videos On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్
- వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
- Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
- అంటార్కిటికా : 70 శాతం మంచినీరు ఇక్కడే ఉంది…రాత్రి సూరీడు…పగలు చీకటి
- Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
- Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!