Aircraft Age : మీరు ప్రయాణిస్తున్న విమానం ఎప్పుడు తయారైందో తెలుసుకోవాలని ఉందా.. ఇలా చేయండి
Aircraft Age : ఆకాశంలో రెక్కలు కట్టుకుని ఎగరాలని చాలామందికి కల ఉంటుంది. విమాన ప్రయాణం అంటే చాలామందికి ఒక కల. అయితే, ఈ మధ్య కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాల వల్ల ప్రయాణీకుల్లో కొంత భయం నెలకొంది. మనం ప్రయాణించే విమానం పాతదా? కొత్తదా? దాని వయసు ఎంత? టేకాఫ్ తర్వాత సురక్షితంగా ల్యాండ్ అవుతుందా లేదా? అనే సందేహాలు చాలామందికి వస్తుంటాయి. ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే, మీరు ప్రయాణించే విమానం పాతదా, కొత్తదా అని తెలుసుకోవడం చాలా సులభం. దాని వయసు తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

విమానం వయసుతో సేఫ్టీకి సంబంధం ఉందా?
సాధారణంగా మనం విమానం ఎక్కే ముందు సీటు నంబర్, బోర్డింగ్ పాస్, లగేజ్ వంటివి మాత్రమే చూసుకుంటాం. కానీ విమానం తయారు చేసిన సంవత్సరం గురించి చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అయితే, నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విమానం సేఫ్టీ దాని తయారీ సంవత్సరంతో ముడిపడి ఉండదు. విమానానికి క్రమం తప్పకుండా నిర్వహణ, సర్వీసింగ్ చేస్తూ, అవసరమైనప్పుడు అప్‌గ్రేడ్ చేస్తే, ఎలాంటి భద్రతాపరమైన ప్రమాదం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
అయితే, పాత విమానాల్లో సీటింగ్, లైటింగ్, టాయిలెట్ వంటి సదుపాయాలు కాస్త పాతగా ఉండవచ్చు. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునేవారికి ఇవి కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఛార్టర్డ్ విమాన సంస్థల ప్రకారం, తయారైన తేదీ నుండి పది సంవత్సరాల వరకు ఒక విమానాన్ని కొత్తదిగా పరిగణిస్తారు. ఇది ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిందనేది ముఖ్యం కాదు. పది నుంచి ఇరవై సంవత్సరాలు సర్వీస్‌లో ఉన్న వాటిని సాధారణ విమానాలుగా పరిగణిస్తారు. ఒకవేళ విమానం 20 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉపయోగంలో ఉంటే, దాన్ని పాతదిగా భావించాలి. నిపుణుల ప్రకారం.. 30 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ఉపయోగంలో ఉన్న విమానాల్లో సౌకర్యాలు కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి విమానాలను సుదూర ప్రయాణాలకు ఎంచుకోకపోవడం మంచిదని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
విమానం వయసు ఎలా తెలుసుకోవాలి?
మీరు ప్రయాణించే విమానం ఎప్పుడు తయారైందో తెలుసుకోవడానికి, ముందుగా మీకు మీ ఫ్లైట్ నంబర్ తెలియాలి. FlightRadar24, FlightAware, Airfleets, Planespotters వంటి వెబ్సైట్లలో ఫ్లైట్ నంబర్ ఆధారంగా విమానం రిజిస్ట్రేషన్ నంబర్ తెలుసుకోవచ్చు. భారతదేశంలోని విమానాల రిజిస్ట్రేషన్ నంబర్లు సాధారణంగా ‘VT’ అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. ఈ నంబర్‌ను మళ్ళీ ఎయిర్ఫ్లీట్స్, ప్లేన్స్పాటర్స్ వంటి వెబ్సైట్లలో ఎంటర్ చేస్తే, ఆ విమానం కంప్లీట్ హిస్టరీ తెలుస్తుంది. విమానం ఎప్పుడు తయారైంది? ప్రస్తుతం ఏ విమానయాన సంస్థలు దాన్ని ఉపయోగిస్తున్నాయి? ఇంతకు ముందు ఎవరు ఉపయోగించారు? వంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మీకు మరింత సమాచారాన్ని అందిస్తుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.