తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అద్భుతమైన పర్యటక స్థలాలు ఉన్నాయి. అందులో కొన్నింటిని ప్రయాణికులు బాగా ఇష్టపడుతుంటారు. అలాంటి ఒక డెస్టినేషనే వంజంగి (Vanjangi ) .
వంజంగి వ్యూ పాయింట్ నుంచి సూర్యోదయం సమయంలో ప్రకృతి రమణీయత వర్ణాణాతీతం. దేశ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి సూర్యోదయం చూడటానికే వస్తుంటారు. ట్రెక్కింగ్ పూర్తి చేసి కొండ పై నుంచి పాలమీగడలాంటి మేఘాలను చూసి సరికొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు.
Read Also: Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?
ఈ కొండ ఎక్కేటప్పుడు ఎంత అలసట అనిపిస్తుందో…కొండ పైకి చేరుకోగానే మొత్తం అలసట హుష్ కాక్ అయిపోతుంది. ఇదీ వంజంగి ప్రత్యేకత అంటే.
ముఖ్యాంశాలు
1. Vanjangi ఎలా చేరుకోవాలి ?
How To Reach Vanjangi ? | ఆంధ్రాకాశ్మీర్ లంబసింగి వెళ్లడానికి ముందే ఉంటుంది ఈ వంజంగి. ఈ మధ్యే పర్యటకులు ఈ ప్రదేశాన్ని చాలా ఇష్టపడుతున్నారు. దీంతో పాటు సోషల్ మీడియా, ట్రావెల్ వ్లాగర్స్ వీరంతా కలిసి వంజంగిని ఒక హాటెస్ట్ టూరిస్ట్ డెస్టినేషన్‌గా మార్చారు.
ఇక మీరు కూడా వంజంగి వెళ్లాలి అనుకుంటే ముందుగా మీరు ఎక్కడ ఉన్నా వైజాగ్ చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడి నుంచి అరుకు లేదా లంబసింగి వైపు ప్రయాణించాల్సి ఉంటుంది. లంబసింగికి వెళ్లడానికి ముందే ఈ వంజంగి ఉంటుంది.
ఒకవేళ మీరు వంజంగి వెళ్లాలి అనుకుంటే విశాఖ ( Vizag ) జిల్లా నుంచి బస్సు లేదా ఏదైనా వెహికల్‌లో మీరు అరకు రూట్లో రావచ్చు…లేదంటే మీరు పాడేరుకు డైరక్టుగా చేరుకోవచ్చు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మీరు పాడేరుకు ఖచ్చితంగా ఒకరోజు ముందు చేరుకునే ప్లాన్ చేసుకోండి.
అలా చేరుకున్న వెంటనే మీరు ఉదయం వంజంగి వెళ్లేందుకు ఏదైనా లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే పొద్దున్నే 5 గంట 40 నిమిషాలకు సూర్యోదయాన్ని చూడటం కష్టమే అవుతుంది.
2. వంజంగిలో ఎక్కడ ఉండాలి ?
How To Reach Vanjangi ? | మీ టార్గెట్ వంజంగి అయితే మీరు పాడేరులోనే రూమ్ తీసుకుంటే బెటర్. అయితే చలికాలం ఇక్కడ చాలా రష్ ఉంటుంది. రూమ్స్ దొరకకపోవచ్చు. అందుకే ముందుగానే బుకింగ్ చేసుకోవచ్చు మీరు.
పాడేరులో కాకుండా మీరు డైరక్టుగా వంజంగి దగ్గరే అద్దెకు ఉండాలి అనుకుంటే. వంజంగి కొండ పాద భాగంగా స్థానికులు నిర్వహించే టెంట్ రెంట్‌పై లభిస్తాయి. మీరు రాత్రి సమయంలో అక్కడ ఉండవచ్చు.
3.వంజంగి ట్రెక్కింగ్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి ?
when to start vanjangi trek: ఎవరైనా వంజంగికి ఎందుకు వస్తారు ? సూర్యోదయం సమయంలో ఆకాశం అందాలను చూడటానికే కదా. అంటే మనం సూర్యోదయం అవ్వడానికి కొద్ది సేపటి ముందు అయినా వంజంగి పాదం భాగం నుంచి ట్రెక్కింగ్ ప్రారంభించాలి. అంటే మీరు కనీసం వేకువ జామున 4 గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి.
స్నానాలు గీనాలు అవన్నీ పట్టించుకోకుండా ముందు ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే సూర్యోదయం ( sunrise at vanjagn i) మిస్ అయితే మీరు ఖచ్చితంగా డిసపాయింట్ అవుతారు
Read Also: Manali : మనాలి ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి?
4.ఎలా సిద్ధం అవ్వాలి ?
How To Prepare For Vanjangi ? | వంజంగి ట్రెక్కింగ్ ప్రారంభించడానికి ముందే మీరు మొబైల్ ఫోన్లు ఫుల్ చార్జ్ పెట్టుకోవాలి. ఎందుకంటే కొండ ఎక్కే టైమ్‌లో దారి నిండా రాళ్లు రప్పలు ఉంటాయి మరి.
- దీంతో పాటు మంచి గ్రిప్ అండ్ సోల్ ఉన్న షూ ఉంటే మీకు ఉపయోగపడుతుంది.
- మీతో పాటు చిన్న ట్రెక్కింగ్ పోల్ లేదా కర్ర ఉంటే మీకు కొంత సపోర్ట్ అవుతుంది.
- పవర్ బ్యాంకు ఉంటే మీకు మొబైల్ చార్జింగ్‌లో ఉపయోగపడుతుంది.
- సూర్యోదయాన్ని చూడటానికి వెళ్తున్నాం కాబట్టి చీకటిలో నడవాల్సి ఉంటది. అందుకే టార్చ్ లైట్ ఉంటే బెటర్
5. తినడానికి ఏమైనా దొరుకుతాయా ?
వంజంగి ట్రెక్కింగ్‌లో దారిపొడగునా మీకు కాఫీ టీలు, మ్యాగీ గీగీలు తినడానికి లభిస్తాయి. చాలా మంది ఇక్కడ ఫ్రెండ్స్‌తో కలిసి వస్తారు. వాళ్లు ఈ పాయింట్స్‌లో ముచ్చట్లు చెబుతూ కూర్చుంటారు. మీరు కూడా కాసేపు రిలాక్స్ అవ్వొచ్చ.
ఇవన్నీ వద్దు నాకు వ్యూ పాయింటే ముద్దు అనుకుంటే మాత్రం మీరు పోకిరిలో మహేష్ బాబులా దూసుకెళ్లండి. అయితే మరీ వేగంగా కాకుండా ప్రశాంతంగా ఎక్కండి. అలసిపోతే ఏం బాగుంటుంది చెప్పండి.
6. ఏమేం తీసుకెళ్లాలి ?
Things to Carry To Vanjangi ? | సెల్ఫీ స్టిక్స్, అందంగా కనిపించడానికి కళ్లద్దాలు, వాటర్ బాటిల్స్, చలి నుంచి ప్రొటెక్ట్ చేసే కోర్టు ఇలా మీకు కావాల్సినవి మీరు తీసుకెళ్లవచ్చు.
కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి. ఏం తీసుకెళ్లినా అక్కడ మాత్రం వదిలేయకండి. దాంతో పాటు అక్కడ ఫుడ్ కవర్స్, కాఫీ కప్పులు ఇలాంటి వాటిని ఎక్కడంటే అక్కడ పాడేయకండి. ఎందుకంటే వాటిని క్లీన్ చేయడం అనేది చాలా కష్టమైన పని కదా.
Read Also: Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు
7. కొండపైకి చేరుకున్నాక…
ప్రశాంతంగా అక్కడి వ్యూను ఎంజాయ్ చేయండి. కాసేపు ఫోన్ పక్కన పెట్టి కళ్లల్లో అక్కడి అందాన్ని రికార్డు చేయండి.
దొరికితే కొండపైకి చేరుకున్న తరువాత అరకు కాఫిని (Araku Coffee) రుచి చూడవచ్చు. నాకు కాఫీ నచ్చదు . నాది ఇరానీ ఛాయ్ టైప్. అంతే కాఫీపై నాకు కోపం కానీ ప్రేమా కానీ ఏ ఇమోషనూ లేదు.
జీవితం ఏది ఇస్తే అది ప్రసాదంలా తినాలి అని మా తాత చెప్పాడు. కానీ తాగాలి అని చెప్పలేదు. సో కాఫీ తాగలేదు. కాకపోతే మీరు కాఫీ లవర్ అయితే మీకు అరకు కాఫీ నచ్చుతుందేమో.
8. వంజంగికి ఎలా సిద్ధం అవ్వాలి ?
Is Vanjangi A Hardd Trek ? | హిమాలయాలతో కంపేర్ చేస్తే వంజంగి పెద్ద ట్రెక్ కాదు. కానీ ఇప్పటి వరకు ట్రెక్ చేయని వారికి ఇది కష్టంగానే అనిపిస్తుంది. మధ్యలో ఒకపాయింట్‌లో వెనక్కి వెళ్తే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది.
అలాంటప్పుడు వెనక్కి తగ్గడం కన్నా వెనక్కి తిరిగి చూడండి మీకన్నా చిన్నపిల్లలు, మీకన్నా పెద్దవాళ్లు కనిపిస్తారు. వాళ్లను చూసి కాస్తమోటివేట్ అవ్వండి ముందుకు వెళ్లండి. ఇలా ట్రెక్కింగ్ మధ్యలో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే మాత్రం వంజంగి రావడానికి ముందే మీరు సిద్ధం అవ్వండి.
కొన్ని రోజుల ముందు నుంచే జాగింగ్, సైక్లింగ్, వీలు అయితే స్కిప్పింగ్ చేయండి. దీంతో మీ కండరాలు, గుండె, ఊపిరితిత్తుల పనితీరు మెరుగు అవుతుంది. ద
9. ఎవరు వెళ్లవచ్చు ?
Who Can Go To Vanjangi : వంజంగి చాలా అందమైన వ్యూ పాయింట్ అని బాగా ప్రచారం జరగడంతో చిన్నా పెద్దా అని తేడాలేమీ లేకుండా అందరూ వెళ్తున్నారు. నిజంగా వంజంగి వ్యూపాయింట్ చాలా అందంగా ఉంటుంది.
ఆ అందాన్ని చూడటానికి వచ్చిన వారిలో నేను 9 ఏళ్ల చిన్నారినీ చూశాను. అంతేనా 65 ఏళ్ల పెద్దావిడ కూడా కొండ ఎక్కడం నేను చూశాను. సో వాళ్లు కూడా వెళ్లవచ్చు. అయితే మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే జాయింట్ పెయిన్స్, కీల్లనొప్పులు , ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే మీరు మీ డాక్టర్‌ను లేదా నిపుణులను సంప్రదించిన నిర్ణయం తీసుకోండి. వెళ్లగలిగిన వాళ్లు వెళ్లి బాగా ఎంజాయ్ చేయండి. అలా ఒక కొత్త ప్రపంచాన్ని చూసి ఆనందించండి.
10. కొండ దిగడం
కొండ దిగి వచ్చే సమయానికి మీకోసం ఇడ్లీ, దోశలు , మాగీ కూడా రెడీగా ఉంటాయి. వాటిని తింటూ స్థానికులు జీవన విధానాన్ని అర్థం చేసుకోవచ్చు. వారి శ్రమైక జీవితానికి సెల్యూట్ చేయవచ్చు.
పాడేరుకు తిరిగి వచ్చే సమయంలో మీకు ఎన్నో అందమైన వ్యూస్ కనిపిస్తాయి.
వాటిని చూస్తూ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటూ మీ ప్రయాణాన్ని కంటిన్యూ చేయండి
వంజంగి గురించి నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్ అయిందా ? లేదా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి.
ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.