Numaish 2025 Opening : నేడు ప్రారంభం కానున్న నుమాయిష్..టికెట్ ధర, టైమింగ్, ఎలా చేరుకోవాలి మరిన్ని వివరాలు

Share This Story

హైదరాబాద్‌లో ఏ‌టా జరిగి అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన జనవరి 3వ తేదీన ప్రారంభం కానుంది. ప్రతీ ఏడాది జనవరి 1వ తేదీన నుమాయిష్ ( Numaish 2025 Opening ) ప్రారంభం అవుతుంది. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందడటంతో ప్రభుత్వం వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఈ సమయంలో ఎలాంటి అధికారిక కార్యక్రమాలు, ప్రారంభాలు ఉండవు. దీంతో రెండు రోజులు ఆలస్యంగా నుమాయిష్ ప్రారంభోత్సవం జరగనుంది.

సర్వం సిద్ధం | Numaish 2025 Opening

నుమాయిష్ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు నిర్వాహకులు. గత ఏడాది లాగే ఈసారి కూడా హైదరాబాద్ ఎగ్జిబిషన్‌ను ( Hyderabad Exhibition 2025 ) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్టు ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాహకులు తెలిపారు.

నుమాయిష్ చరిత్ర | Hyderabad Numaish History

1938 లో ప్రారంభమైన ఎగ్జిబిషన్‌ నేటికీ విజయవంతంగా కొనసాగుతోంది. చిన్నా, మధ్య తరహా సంస్థలను ప్రోత్సాహించడానికి నాటి హైదరాబాద్ సంస్థానం నుమాయిష్‌ను ప్రారంభించింది. 1938 లో తొలి ఎగ్జిబిషన్ పబ్లిక్ గార్డెన్‌లో జరగగా 1946 నుంచి ప్రస్తుతం ఉన్న ప్రాంతంలో నిర్వహించడం మొదలు పెట్టారు.

Prayanikudu

84వ నుమాయిష ప్రత్యేకతలు | Details Of Hyderabad Numaish 2025

2025 లో జరిగే 84వ ప్రదర్శనలో ( 84th All India Industrial Exhibition ) 45 రోజుల సమయంలో సుమారు 25 లక్షల మంది సందర్శకులు నాంపల్లి ఎగ్జిబిషన్‌కు వచ్చే అవకాశం ఉంది అని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈసారి ఎగ్జిబిషన్‌లో దాదాపు 1500 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ, ప్రైవేటు , పబ్లిక్ సెక్టార్ , మల్టినేషనల్ సంస్థలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్టాల్ నిర్వాహకులు ఇప్పటికే తమ స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు.

Numaiash 2025 Opening
నుమాయిష్ | ఫైల్ ఫోటో

ప్రశ్న : నుయాయిష్ తేదీలు | Numaish 2025 Start and Closing Dates
సమాధానం : 2025 జవవరి 3వ తేదీన ( Numaish 2025 Opening ) ప్రారంభం కానున్న నుమాయిష్ ఫిబ్రవరి 17వ తేదీ వరకు కొనసాగుతుంది.

ప్రశ్న : నుమాయిష్ టైమింగ్ ? | Numaish 2025 Timing
సమాధానం : హైదరాబాద్ నుమాయిష్ అనేది సాయంత్రం 4 నుంచి రాత్రి 10.30 వరకు తెరచి ఉంటుంది. శనీ, ఆదివారాల్లో 11 గంటల వరకు తెరచి ఉంటుంది.

ప్రశ్న : నాంపల్లి ఎగ్జిబిషన్‌కు ఎలా వెళ్లాలి ? | How To Reach Hyderabad Numaish 2025
సమాధానం : హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి నాంపల్లి, ఎంజే మార్కెట్‌‌, గాంధీ భవన్ వైపు ఆర్టీసి బస్సులు నడుస్తాయి. వీటితో పాటు మెట్రో రైలు సంస్థ నుమాయిష్ కోసం రైళ్ల సంఖ్య కూడా పెంచింది.

ప్రశ్న : నుమాయిష్ 2025 టికెట్ ధర ఎంత ? | Hyderabad Numaish 2025 Entry Fees
సమాధానం : హైదరాబాద్ నుమాయిష్‌ టికెట్ ధర వచ్చేసి రూ.50.

ప్రశ్న : నుమాయిష్ టికెట్లు ఆన్‌లైన్లో లభిస్తాయా ? | Numaish 2025 Online Ticket Booking
సమాధానం :ఆన్‌లైన్లో బుక్ చేసుకునే వెసులు బాటు ఉంది. దీని కోసం ఎగ్జిబిషన్ సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ మీకు ఒక స్కానర్ అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు ఎంట్రీ గేట్స్, టికెట్ కౌంటర్ దగ్గర కూడా చెక్ చేసి చూడండి.

మీకు నుమాయిష్ విషయంలో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. వాటి గురించి తెలిస్తే వివరిస్తాము. తెలియకపోతే నిర్వాహకులను అడిగి తెలుసుకుంటాము.

గమనిక : ఈ వెబ్‌సైట్‌లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది. 

Trending Video On : Prayanikudu Youtube Channel

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

Share This Story

Leave a Comment

error: Content is protected !!