హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు డైరక్ట్ ఫ్లైట్…లాంచ్ చేసిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ | Hyderabad To Phuket Direct Flights
థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై మీరు థాయ్‌లోని ఫుకెట్ వెళ్లాలి అనుకుంటే మీరు హైదరాబాద్ నుంచి డైరక్టుగా (Hyderabad To Phuket Direct Flights Flights ) ప్రయాణించవచ్చు. ఎయిర్ ఇండియా అనుబంధ సంస్థ అయిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కొత్త సర్వీసును లాంచ్ చేసింది. అయితే ఇది ఎప్పటి నుంచి అందుబాటులోకి రానుంది ? ధరలేంటి ? విమాన విశేషాలు ఏంటో ఈ పోస్టులో చదవండి.
ముఖ్యాంశాలు
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ తరువాత తెలుగు వాళ్లు ఎక్కువగా వెళ్లే ప్రదేశం ఫుకెట్ ( Phuket ). హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు ఇకపై డైరక్ట్ ఫ్టైట్‌లో మీరు వెళ్లగలరు. దీని వల్ల థాయ్‌లాండ్‌కు రిలాక్స్ అవ్వడానికి వెళ్లేవారు, వ్యాపారం కోసం వెళ్లేవారికి డబ్బు, సమయం సేవ్ అవనుంది. దీంతో పాటు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహించే జీఎమ్మార్ ( GMR Hyderabad International Airport Ltd ) సంస్థ ఈ ఏడాది కొత్తగా 10 అంతర్జాతీయ డెస్టినేషన్సకు డైరక్ట్ ప్లైట్స్ వేయాలని భావిస్తోంది. అందులో భాగంగా ఫుకెట్‌కు హైదారాబాద్ నుంచి డైరక్ట్ ఫ్లైట్స్ త్వరలో మొదలు కానున్నాయి.
ఫుకెట్ ఫ్లైట్ వివరాలు | Hyderabad To Phuket Flight Details

2025 జనవరి 31వ తేదీ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( Air India Express ) వారానికి మూడు సార్లు హైదరాబాద్ నుంచి ఫుకెట్‌కు విమానాన్ని నడపనుంది. ఈ విమానం ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం హైదరాబాద్ నుంచి బయల్దేరనుంది. దీని కోసం స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ విమానం అయిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానాన్ని ( Boeing 737 MAX 8 aircraft ) వినియోగించనున్నారు. ఈ విమానంలో ప్రయాణం అనేది సౌకర్యవంతమైన అనుభూతిని కలిగిస్తుంది.
షెడ్యూల్ విషయానికి వస్తే | Hyderabad To Phuket Flight Schedule
- బుధవారం రోజు : IX910 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.20 నిమిషాలకు బయల్దేరుతుంది. ఫుకెట్‌కు అది సాయంత్రం 5.35 నిమిషాలకు చేరుకుంటుంది. ప్రయాణ సమయం వచ్చేసి 3 గంటల 45 నిమిషాలు ఉంటుంది.
- ఆదివారం : IX910 ఫ్లైట్ హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటల 50 నిమిషాలకు బయల్దేరుతుంది. సాయంత్రం 5 గంటల 5 నిమిషాలకు ఫుకెట్ చేరుకుంటుంది.
ఫుకెట నుంచి హైదరాబాద్ | Phuket to Hyderabad Direct Flight Schedule
- బుధవారం : IX909 ఫ్లైట్ ఫుకెట్ నుంచి సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు బయల్దేరి రాత్రి 8 గంటల 25 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ప్రయాణ సమయం 3 గంటల 35 నిమిషాలు ఉండనుంది.
- ఆదివారం : IX909 ఫ్లైట్ పుకెట్ నుంచి సాయంత్రం 6 గంటల 05 నిమిషాలకు బయల్దేరి రాత్రి 8 గంటల 10 నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటుంది
ఫిబ్రవరి 20వ తేదీ నుంచి వారానికి 6 విమానాలను నడపనున్నారు. దీన్ని బట్టి ప్రాంతాల మధ్య ప్రయాణికులు ఎంత ఎక్కువగా ప్రయాణించే అవకాశం ఉందో మీరు ఊహించవచ్చు.
ఇక థాయలాండ్లోని బ్యాంకాక్‌కు కూడా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( Flights To Bangkok ) విమానాలను నడుపుతోంది. థాయ్‌లాండ్‌కు తమ సేవ పరిధిని పెంచుకునేందుకు మరో అడుగు ముందుకు వేస్తూ ఈ సర్వీసును ప్రారంభించింది.
టికెట్ ధరలు
Hyderabad To Phuket Direct Fligh Ticket Price : ప్రస్తుతానికి అయితే ఫుకెట్ వెళ్లాలి అన్నా, థాయ్‌లాండ్ వెళ్లాలి అన్నా సుమారు మినిమమ్ 14 వేల వరకు ఖర్చు అవుతుంది ( ఏమైనా అప్టేడ్ ఉంటే కామెంట్ చేయండి ). కానీ ఈ విమాన సర్వీస్ వల్ల ఈ ప్రయాణం మరింత చవక అవనుంది.

టికెట్ల ధరలు క్లాసును బట్టి
- ఎక్స్ప్రెట్ లైట్ ఫ రూ.10512
- ఎక్స్‌ప్రెస్ వాల్యూ 11010
- ఎక్స్‌ప్రెస్ ఫ్లెక్స్ ధర వచ్చేసి 12510
- ఎక్స్‌ప్రెస్ బిజ్ వచ్చేసి రూ.25833 వరకు ఉంటుంది.
ఫుకెట్ ఎందుకు వెళ్తున్నారు ? | Why Indians Choosing Phuket ?
బ్యాంకాక్ తరువాత అధిక సంఖ్యలో ప్రయాణికులు ఫుకెట్ వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ పర్యాటకులు ( Travelers ) సంతోషపడే అంశాలు చాలా ఉంటాయి. బీచులు, రిసార్టులు, వాటర్ స్పోర్ట్స్, రుచికరమైన థాయ్ ఫుడ్ ( Thai Food ) అంతమైన లొకేషన్స్ ఇలా ఎన్నో అంశాల వల్ల భారతీయులు అత్యధికంగా ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడతారు. అందులోనూ తెలుగు వాళ్లు చాలా మంది ఫుకెట్ వెళ్లడం హాబీగా మార్చుకున్నారు. ఇక కొత్తగా రానున్న డైరక్ట్ విమానం రావడంతో ( Hyderabad To Phuket Direct Flights ) ఈ హాబీ ఒక అలవాటుగా మారుతుంది అని అనుకోవచ్చు. ఇంతకి మీరు థాయ్‌లాండ్ వెళ్లారా ? మీకు అక్కడ నచ్చే అంశం ఏంటి ?
ఒక వేళ మీరు వెళ్లాని ప్లాన్ చేస్తోంటే థాయ్‌లాండ్ గురించి గతంలో పబ్లిష్ చేసిన ఈ స్టోరీస్ చూడండి. మీకు తప్పకుండా ఉపయోగపడతాయి. థాయ్క్యూ
- Thailand Travel Plan : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఎక్కడికి వెళ్లాలి? ఏం చేయాలి ?
- Thailand e-Visa : 2025 జనవరి నుంచి అందుబాటులోకి థాయ్ ఈ వీసా…ఇలా అప్లై చేయండి
- బ్యాంకాక్, ఫుకెట్ , స్ట్రీట్ షాపింగ్… 11 కారణాలతో అయస్కాంతంలా ఆకర్షిస్తున్న థాయ్‌లాండ్
- థాయ్‌లాండ్‌లో నా అన్వేషణ అన్వేష్ ఆటగాళ్ల సంబరాలు | Naa Anveshana In Thailand
గమనిక : ఈ వెబ్సైట్లో కొన్ని ప్రకటనలు కనిపిస్తాయి. వీటిని గూగుల్ యాడ్ అనే సంస్థ అందిస్తుంది. ఈ ప్రకటనలపై మీరు క్లిక్ చేయడం వల్ల మాకు ఆదాయం వస్తుంది.
Trending Video On : Prayanikudu Youtube Channel
- Pandharpur: 7 గంటల్లో 7 ఆలయాల దర్శనం
- Hemkund Sahib Trek : హిమాలయాల్లో బ్రహ్మకమలం దర్శనం
- Kamakhya Temple: కామాఖ్య దేవీ కథ
- Tuljapur : శివాజీ నడిచిన దారిలో తుల్జా భవానీ మాత దర్శనం
- Shillong : అందగత్తెల రాజధాని ఫిల్లాంగ్
- ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్
- హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం కనిపించింది..మీరు కూడా చూడండి