Tirupati Trains Change : తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. ఇకపై ఆ రైళ్లు తిరుపతి బదులు తిరుచానూరు నుంచే
Tirupati Trains Change : తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇది చాలా ముఖ్యమైన గమనిక. ఇకపై తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి నడిచే అనేక రైళ్లు, స్పెషల్ రైళ్లు తిరుచానూరు రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానున్నాయి. తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు పూర్తి కావడంతో, రైల్వే అధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరంతరం రద్దీగా ఉండే తిరుపతి, రేణిగుంట స్టేషన్ల భారాన్ని తగ్గించడమే ఈ మార్పు ముఖ్య ఉద్దేశం.
రద్దీ తగ్గించేందుకే కొత్త టెర్మినల్
ప్రస్తుతం తిరుపతి, రేణిగుంట రైల్వే స్టేషన్ల నుంచి రోజుకు సుమారు 90 రైళ్లు, 80 వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు అంచనా. ఈ విపరీతమైన రద్దీ కారణంగా తిరుపతి స్టేషన్‌పై భారం పెరుగుతోంది. చాలా మంది శ్రీవారి భక్తులు తిరుచానూరు, రేణిగుంట స్టేషన్లు తిరుపతికి కేవలం 10 కి.మీ దూరంలో ఉన్నాయనే విషయం కూడా తెలియక తిరుపతి స్టేషన్‌నే ఆశ్రయిస్తున్నారు. ఈ రద్దీని తగ్గించే పరిష్కారంగా రైల్వే అధికారులు తిరుచానూరు స్టేషన్‌ను రూ. 120 కోట్లతో ఆధునికీకరించి, కొత్త టెర్మినల్‌గా అభివృద్ధి చేశారు.
ఇది కూడా చదవండి : Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు

తిరుచానూరు స్టేషన్లో కొత్త సౌకర్యాలు
ఆధునీకరణ పనుల తర్వాత తిరుచానూరు స్టేషన్ ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ ఏసీ, నాన్-ఏసీ వెయిటింగ్ హాళ్లు, టాయిలెట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతో ఇకపై తిరుచానూరు స్టేషన్ తిరుపతికి ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. ఇక్కడి నుంచి కూడా భక్తులు సులభంగా తిరుపతికి చేరుకుని, అక్కడి నుంచి తిరుమలకు వెళ్లవచ్చు. నేరుగా తిరుచానూరు నుంచే తిరుమలకు కూడా వెళ్లే ఏర్పాట్లు కూడా భవిష్యత్తులో చేయనున్నారు.
ఇది కూడా చదవండి : Peaceful Countries: ప్రపంచంలోని టాప్ 10 శాంతియుత దేశాలు
తిరుచానూరు నుంచి నడిచే రైళ్ల వివరాలు
తిరుచానూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పూర్తయిన నేపథ్యంలో ఈ స్టేషన్ రాబోయే రోజుల్లో చాలా కీలకమైనదిగా మారే అవకాశం ఉంది. రైల్వే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరికొన్ని రైళ్లను కూడా తిరుచానూరు నుంచి నడిపేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం తిరుపతి, రేణిగుంట కాకుండా తిరుచానూరు నుంచి ప్రయాణాలు ప్రారంభించే కొన్ని ముఖ్యమైన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
- చర్లపల్లి (07252 చర్లపల్లి–తిరుచానూరు, తిరుచానూరు–చర్లపల్లి)
- చర్లపల్లి (07018 చర్లపల్లి–తిరుచానూరు / తిరుచానూరు–చర్లపల్లి)
- సికింద్రాబాద్ (07010 సికింద్రాబాద్–తిరుచానూరు / తిరుచానూరు–సికింద్రాబాద్)
- జాల్నా (07610 జాల్నా–తిరుచానూరు / తిరుచానూరు–జాల్నా)
- నాందేడ్ (07016 నాందేడ్–తిరుచానూరు / తిరుచానూరు–నాందేడ్)
- చెన్నై సెంట్రల్ (66070)
- అరక్కోణం (66044)
రైలు ప్రయాణికులు ఈ మార్పులను తప్పక గమనించాలి.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.