ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో ( Henley Passport Index 2025 ) సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది.
Table Of Content
ప్రపంచంలోనే అత్యంత పవర్‌ఫుల్ పాస్‌పోర్టు ఏది ? అమెరికా అనుకుంటాం కదా. కానీ అమెరికా టాప్5 లో కూడా లేదు. ఇటీవలే హాన్లీ సంస్థ విడుదల చేసిన పాస్‌పోర్టు ఇండెక్స్‌లో ( Henley Passport Index 2025 ) సింగపూర్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ దేశ ప్రజలు ప్రపంచంలోని 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించింది. సింగపూర్ తరువాత 193 దేశాలతో జపాన్ రెండవ స్థానంలో ఉంది. టాప్ 10 దేశాలు, తరువాత భారత్, పాకిస్తాన్ ఇతర దేశాల ర్యాంకింగ్ చెక్ చేద్దాం.

ప్రపంచంలోనే 10 పవర్‌ఫుల్ పాస్‌పోర్టులు | Top 10 Powerful Passports For 2025
2025 సంవత్సరానికి గానూ మొత్తం 199 దేశాలలో 106 దేశాల పాస్‌పోర్టుల ర్యాంకులు విడుదల చేసింది హాన్లీ. వివిధ దేశాలు తమ దేశ ప్రజలకు వీసా లేకుండా ( Visa Free ) ప్రయాణించే సదుపాయాల్ని బట్టి ర్యాంకులను నిర్ణయించింది. ఇందులో టాప్ 10 ర్యాంకులు ఇవే మరి..
1. సింగపూర్ | Singapore Passport Rank 2025
ప్రపంచంలో పెర్ ఫెక్ట్ దేశాల్లో ఒకటి సింగాపూర్. అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఈ దేశం తమ దేశ ప్రజలకు 195 దేశాలకు వీసా ఫ్రీ సదుపాయం కల్పిస్తోంది. అందుకే ఇది మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది
2. జపాన్ | Japan Passport Rank 2025
సింగపూర్ తరువాత జపాన్ 2వ అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు స్థానాన్ని సాధించింది. జపాన్ ప్రజలు 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
3. ఫిన్లాండ్ | Finland, Italy, Spain, France Germany Passport Rank 2025
ఈ జాబితాలో ఫిన్లాండ్ అనే యూరోప్‌లోని ఒక దేశం వస్తుంది అని మీరు ఊహించక పోవచ్చు. కానీ ఫిన్లాండ్‌తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సౌత్ కొరియా, స్పెయిన్ దేశాలు తమ దేశ ప్రజలకు 192 దేశాలు వెళ్లేందుకు వీసా ఫ్రీ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. అందుకే ఈ దేశాలు 3వ స్థానాన్ని ( Henley Passport Index 2025 ) కైవసం చేసుకున్నాయి,
4.ఆస్ట్రియా |Austria, Denmark, Ireland, Norway, Sweden Passport Rank 2025
ఐరోపాలోని ఆస్ట్రియా, డెన్మార్క్, ఐర్లాండ్, లక్జెంబర్గ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ దేశాలు 4వ ర్యాంకును సాధించాయి. ఈ దేశాలు తమ ప్రజలకు 191 దేశాలను వెళ్లే సదుపాయం కల్పించాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ దేశాల ప్రజలు ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు.
5. బెల్జియం ..| UK, Belgium, Portugal, New Zealand, Switzerland Passport Rank 2025
190 దేశాలకు వీసా ఫ్రీ సదుపాయం కల్పిస్తున్న బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్, స్విట్జర్లాండ్, న్యూజిలాండ్ , పోర్చుగల్ దేశాలు 5 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. అంటే ఈ దేశ ప్రజలు వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లే అవకాశం ఈ దేశాలు కల్పిస్తున్నాయి.
6. ఆస్ట్రేలియా | Greece, Australia Passport Rank 2025

ఆరవ స్థానంలో ఆస్ట్రేలియా, గ్రీస్ దేశాలు ఉండటానికి కారణం 189 దేశాలకు తమ ప్రజలను వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించడమే. అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సత్సంబంధాలు, మంచి రవాణా వ్యవస్థ వంటి అనేక అంశాలు ర్యాంకులను ప్రభావితం చేస్తాయి.
7. కెనడా | Canada, Malta, Poland Passport Rank 2025
వివిధ దేశాలతో ఉన్న మంచి సంబంధాలు, వ్యాపార లావాదేవీలు, అంతర్జాతీయంగా పాపులారిటీ వంటి అంశాలతో పాటు తమ దేశ ప్రజలను 188 దేశాలకు వీసా ఫ్రీ ప్రయాణాన్ని కల్పిస్తున్నాయి కెనడా, పోలండ్, మాల్టా దేశాలు. అందుకే ఇవి 7వ ర్యాంకును కైవసం చేసుకున్నాయి.
8. హంగరి | Czech Republic, Hungary Passport Rank 2025
చెక్ రిపబ్లిక్, హంగరీ దేశాలకు పర్యాటకుల వెళ్లేందుకు చాలా ఇష్టపడతారు. అలాగే ఆ దేశంలోని ప్రజలు కూడా ఇతర దేశాలను సందర్శించడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే ఈ దేశాలు తమ ప్రజలకు 187 దేశాలకు వీసా అవసరం లేకుండా వెళ్లే సదుపాయాన్ని కల్పించింది.
9. అమెరికా | United States, Estonia Passport Rank 2025
ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్టు జాబితాలో అమెరికా మొదటి ర్యాంకులో ఉంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ అమెరికాతో పాటు ఈస్టోనియా దేశాలు 9వ ర్యాంకును సాధించాయి . ఈ దేశాలు 186 దేశాలకు తమ పౌరులను వీసా అవసరం లేకుండా వెళ్లే సదుపాయాన్ని కల్పిస్తోంది.
- Chai Samosa USA : భారతీయులను టూరిస్టులను ఆకట్టుకోవడానికి ఛాయ్ సమోసా స్ట్రాటజీని అమలు చేస్తున్న అమెరికా…
- Niagara Falls, మాన్యుమెంట్ వ్యాలీ.. అమెరికాలో తప్పకుండా చూడాల్సిన 10 నేచురల్ వండర్స్
10. యూఏఈ | UAE, Slovenia, Lithuania, Latvia Passport Rank 2025
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టు కలిగిన దేశాల జాబితాలో 10 ర్యాంకులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates ), స్లోవేనియా, లాత్వియా, లిథువేనియా దేశాలు ఉన్నాయి. 185 దేశాలకు ఈ దేశ ప్రజలు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉంది.
టాప్ 10 శక్తివంతమైన పాస్‌పోర్టుల జాబితాను చూశారు కదా. ఇక భారత దేశం ర్యాంకు ( Henley Passport Index 2025 ) ఎంత ? ఈ సారి ర్యాంకు పెరిగిందా లేదా తగ్గిందా ..ఎన్ని దేశాలకు వీసా లేకుండా వెళ్లే అవకాశం ఉందో చదవండి
85. భారత్ | Indian Passport Rank 2025

గత ఏడాదిలో పోల్చితే భారత దేశ పాస్‌పోర్టు 5 ర్యాంకులను కోల్పోయింది. గత సంవత్సరం 80 వ ర్యాంకులో ఉన్న భారత్ ఈ సారి 85వ స్థానానికి పడిపోయింది.హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025 ప్రకారం భారతీయులు 57 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఈ ర్యాంకులో మనతో పాటు ఈక్వటోరియల్ గినియా, నైగర్ దేశాలు కూడా సమంగా ఉన్నాయి.
fact : భారత్ పొరుగు దేశం అయిన చైనా 60 వ ర్యాంకులో ఉంది
ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన దేశాలు ఏంటో చూశారు కదా. ఇప్పుడు వీక్ పాస్‌పోర్టు ( Least Powerful Passports By Hanley ) ఉన్న దేశాలు ఏంటో చూడండి. ముందు పాకిస్తాన్‌తో స్టార్ట్ చేద్దాం.
103 . పాకిస్తాన్ | Pakistan Passport Rank 2025 : పొరుగు దేశం అయిన పాకిస్తాన్ తమ దేశ ప్రజలను 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లే వెసులుబాటు కల్పించడంతో ఈ దేశం 103 ర్యాంకును సాధించింది.
- 97వ ర్యాంకులో సుడాన్ ( 43 దేశాలు )
- 98వ స్థానంలో ఎరిట్రియా(42 దేశాలు )
- 99వ స్థానంలో నార్త్ కొరియా(41 దేశాలు )
- 100 వ స్థానంలో బంగ్లాదేశ్, లిబియా, పాలస్తిన టెరిటరీ ( 40 దేశాలు )
- 101వ స్థానంలో నేపాల్ ( 39 దేశాలు )
- 102వ స్థానంలో సోమాలియా( 35దేశాలు )
- 103వ వ స్థానంలో పాకిస్తాన్, యెమెన్ ( 33దేశాలు )
- 104వ స్థానంలో ఇరాక్ ( 31 దేశాలు )
- 105వ స్థానంలో సిరియా ( 27 దేశాలు )
- 106వ స్థానంలో ఆఫ్ఘనిస్థాన్ (26 దేశాలు ) దేశాలు ఉన్నాయి.
మొత్తానికి
భారత దేశ పాస్‌పోర్టు ర్యాంకు పడిపోవడం చాలా మందికి ఆశ్చర్యంగా అనిపించొచ్చు. అయితే భవిష్యత్తులో ఈ ర్యాంకు మెరుగయ్యే అవకాశం ఉంది. ఇక యుద్ధం, ఆర్థిక సంక్షోభాల్లో ఉన్న పలు దేశాలు కూడా తమ ర్యాంకులను భవిష్యత్తులో కోల్పోయే అవకాశం కూడా ఉంది.ఒక వేళ యుద్ధం ఆగి సాధారణ పరిస్థితి వస్తే ఈ దేశాల ర్యాంకులు ( Henley Passport Index 2025 ) మెరుగవ్వవచ్చు.
దీంతో పాటు సరైన రవాణ వ్యవస్థ, మెరుగైన మౌలిక సదుపాయాలు, భద్రత, ఇలాంటి ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక దేశం తమ పౌరులు వీసా లేకుండా వెళ్లే దేశాల జాబితాలో దేశాలను చేర్చుకుంటుంది లేదా తొలగిస్తుంది.
ఈ జాబితాలో మంచి ర్యాంకు సాధించడం అనేది ఒక దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా ఉండాలి. అంతే కాకుండా అంతర్జాతీయ సమాజంలో వివిధ దేశాలతో సత్ససంబంధాలు ఉండాలి. అంతర్జాతీయ సంక్షోభాలు,యుద్ధాలు,అనవసరమైన వివాదాలకు దూరంగా ఉన్న సింగపూర్, జపాన్, న్యూజీలాండ్ వంటి ఇతర ఐరోపా దేశాలు బలమైన పాస్‌పోర్టులతో దూసుకెళ్తున్నాయి.
మన ర్యాంకు ( Henley Passport Index 2025 ) వచ్చే ఏడాది బెటర్ అవుతుంది అని ఆశిద్దాం.
Trending Video On : Prayanikudu Youtube Channel
ప్రపంచ యాత్ర గైడ్
- Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
- Dangerous Countries : 2025 లో వెళ్లకూడని అత్యంత ప్రమాదకరమైన 10 దేశాలు
- Milaf Cola : ఖర్జూరంతో సాఫ్ట్ డ్రింక్ లాంచ్ చేసిన సౌదీ అరేబియా
- Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
- ప్రపంచ యుద్ధం వస్తే ఈ 10 దేశాలు చాలా సేఫ్
- UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
- సౌదీ అరేబియాకి ఎవరైనా వెళ్లవచ్చా ? వెళ్తే ఏం చూడవచ్చు?
- Oymyakon : ప్రపంచంలోనే అత్యంత చల్లని గ్రామం