Indian Railways : ఇండియన్ రైల్వే గుడ్ న్యూస్.. హైదరాబాద్, సికింద్రాబాద్ సహా 6,115 స్టేషన్లలో ఫ్రీ వై ఫై ఎలా కనెక్ట్ చేయాలంటే ?
Indian Railways : ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో భారతీయ రైల్వేలు దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సదుపాయాన్ని విస్తరిస్తున్నాయి. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించారు. భారతదేశం డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో దేశంలోని 6,115 రైల్వే స్టేషన్లలో హై-స్పీడ్ ఉచిత వై-ఫై సేవలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆగస్టు 8న రాజ్యసభలో ఎంపీ స్వాతి మాలివాల్ అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో మంత్రి ఈ సమాచారం ఇచ్చారు.
ఎలా పనిచేస్తుంది?
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. భారతీయ రైల్వేలోని దాదాపు అన్ని స్టేషన్లలో టెలికాం సేవల ప్రొవైడర్ల ద్వారా 4జీ/5జీ కవరేజ్ అందుబాటులో ఉంది. ప్రయాణికులు డేటా కనెక్టివిటీ కోసం ఈ నెట్‌వర్క్‌లను కూడా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ప్రయాణికుల అనుభవం మెరుగుపడింది. అదనంగా, మేము 6,115 రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై సేవలను అందిస్తున్నామని చెప్పారు. రైల్వే స్టేషన్లలో ఈ వై-ఫై సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్‌టెల్ (RailTel) అందిస్తోంది.

ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
ఉచిత వై-ఫై సదుపాయం ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్లు
దేశవ్యాప్తంగా ఉచిత వై-ఫై సదుపాయం ఉన్న కొన్ని ప్రధాన రైల్వే స్టేషన్లలో… హైదరాబాద్, సికింద్రాబాద్ జంక్షన్, కాచిగూడ, హజ్రత్ నిజాముద్దీన్, ఆనంద్ విహార్ టెర్మినల్, న్యూఢిల్లీ, సూరత్, అహ్మదాబాద్, మంగళూరు సెంట్రల్, యశ్వంతపుర, ఎర్నాకులం జంక్షన్, కోజికోడ్, తిరువనంతపురం సెంట్రల్, పుణె, కల్యాణ్, భువనేశ్వర్, పూరి, కటక్, రూర్కెలా, అమృత్సర్, జలంధర్, చెన్నై సెంట్రల్, అలహాబాద్, ఖరగ్‌పూర్ వంటివి ఉన్నాయి. ఈ సేవలతో ప్రయాణికులు స్టేషన్లో హై-డెఫినిషన్ వీడియోలు చూడటం, సినిమాలు, పాటలు, గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవడం, ఆన్లైన్లో ఆఫీస్ పనులు చేసుకోవడం వంటివి చేయవచ్చు.
ఇది కూడా చదవండి : Egypt Travel Guide: ఈజిప్ట్..ఇక్కడ డబ్బు కట్టి సమాధులను చూస్తారు.. 15 Facts
వై-ఫైని ఎలా ఉపయోగించాలి?
- రైల్వే స్టేషన్లో వై-ఫైని ఉపయోగించుకోవడం చాలా సులభం.
- మీ స్మార్ట్‌ఫోన్‌లో వై-ఫై మోడ్‌ను ఆన్ చేయండి.
- అందులో కనిపించే ‘RailWire’ వై-ఫై నెట్‌వర్క్‌ను ఎంచుకోండి.
- మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- మీకు ఎస్ఎమ్ఎస్ ద్వారా ఒక ఒన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వస్తుంది.
- ఆ ఓటీపీని ఎంటర్ చేసి, హై-స్పీడ్ వై-ఫైని ఉపయోగించుకోవచ్చు.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.