ఇంద్రకీలాద్రిలో 23న విద్యార్థులకు ఉచిత దర్శనం, ప్రత్యేక ప్రసాదం | Indrakeeladri Sri Panchami 2026
Indrakeeladri Sri Panchami 2026 : మాఘ శుద్ధ పంచమి సందర్భంగా 2026 జనవరి 23వ తేదీన (శుక్రవారం) ఇంద్రకీలాద్రిలో శ్రీ పంచమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు.
ఈ శుభదినాన చదువుల తల్లి సరస్వతి దేవి అలంకారంలో శ్రీ దుర్గమ్మ అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
విద్యార్థులకు ఉచిత దర్శనం | Free Darshanam to Students
పాఠశాల విద్యార్థులకు ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 7:00 గంటల వరకు ఉచిత దర్శనం కల్పించబడుతుంది.
ఉచిత దర్శనం పొందాలంటే విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫార్మ్ ధరించి, పాఠశాల ID కార్డు వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు.

ప్రత్యేక ప్రసాదం | Special Prasadam Distribution
దర్శనం చేసుకున్న ప్రతి విద్యార్థికి దేవస్థానం తరపున ఉచితంగా:
- ఒక పెన్ను
- శ్రీ దుర్గమ్మ అమ్మవారి ఫొటో
- అమ్మవారి శక్తి కంకణం
- చిన్న లడ్డూ ప్రసాదం (40 గ్రాములు)
- అందజేస్తారని తెలిపారు.
- ఇది కూడా చదవండి : విజయవాడకు దగ్గర్లో టాప్ 7 కుటుంబ సమేతంగా వెళ్లదగిన ప్రాంతాలు | Vijayawada Near By Places
అక్షరాభ్యాసం, వైదిక కార్యక్రమాలు | Aksharabhyasam & Vaidika Karyakramalu
శ్రీ పంచమి సందర్భంగా సుమారు 500 మంది చిన్నారులకు ఉచితంగా సామూహిక అక్షరాభ్యాసం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
అలాగే మహామండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు, యాగశాలలో శ్రీ సరస్వతీ హోమం వంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఈ అవకాశాన్ని విద్యార్థులు, భక్తులు సద్వినియోగం చేసుకుని చదువుల తల్లి ఆశీర్వాదం పొందాలని ఆలయ అధికారులు కోరారు.
- ఆంధ్రప్రదేశ్ ట్రావెల్ అండ్ టూరిజం స్టోరిస్ కోసం క్లిక్ చేయండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
